
హైదరాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ.. తమ తాజా ప్రాజెక్ట్ 'సింక్ బై రాఘవ'ను ప్రకటించారు. ఈ ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్ కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 7.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాఘవ ‘సింక్’ ఐదు 61 అంతస్తుల టవర్లు కలిగి ఉంది.
సింక్‌లోని ప్రతి రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ‘ది ఒయాసిస్’ పార్టీ ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి టవర్‌లో పికిల్‌బాల్ కోర్టులు, పార్టీ డెక్, యోగా డెక్‌తో కూడిన స్కై లాంజ్ కూడా ఉంది. అంతే కాకుండా వ్యాపార కేంద్రాలు, ప్రఖ్యాత విద్యా సంస్థలు, ఆసుపత్రులు కూడా దీనికి దగ్గరగా ఉన్నాయి.
సింక్ బై రాఘవ కేవలం నివాస ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక హై-ఎండ్ ఆర్కిటెక్చరల్ అద్భుతం. చిన్న చిన్న అంశాల మీద కూడా ప్రత్యేక శ్రద్ద వహిస్తూ.. నాణ్యమైన మెటీరియల్స్ ఉపయోగించినట్లు.. రాఘవ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష రెడ్డి పొంగులేటి అన్నారు. డిజైన్, ఫినిష్ , ఫీచర్స్ అన్నీ కూడా ప్రస్తుత జీవన విధానాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.