తొలగించిన వారిని తిరిగి చేర్చుకోవాలని అభ్యర్థన | US FDA reaching out to some of its recently dismissed scientists asking them to return to their positions | Sakshi

తొలగించిన వారిని తిరిగి చేర్చుకోవాలని అభ్యర్థన

Published Mon, Feb 24 2025 1:57 PM | Last Updated on Mon, Feb 24 2025 1:57 PM

US FDA reaching out to some of its recently dismissed scientists asking them to return to their positions

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇటీవల తొలగించిన కొందరు శాస్త్రవేత్తలను తమ స్థానాల్లోకి తిరిగి తీసుకోవాలని కోరుతోంది. మాదకద్రవ్యాలు, ఆహార భద్రత, వైద్య పరికరాలు, పొగాకు ఉత్పత్తులను సమీక్షించే ఏజెన్సీలో గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయా విభాగాల్లో కొంత మందికి లేఆఫ్స్‌ ప్రకటించారు. అయితే అందులో తిరిగి 300 మందిని విధుల్లోకి తీసుకోవాలని ఎఫ్‌డీఏ కోరుతోంది.

న్యూరాలింక్‌లోకి శాస్త్రవేత్తలు

ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ న్యూరాలింక్‌ను సమీక్షించడంలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు ఈ రీహైరింగ్‌ ప్రయత్నాల్లో భాగంగా తిరిగి సంస్థలో పని చేయబోతున్నట్లు తెలిసింది. క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలన్న న్యూరాలింక్ అభ్యర్థనను గతంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎప్‌డీఏ తిరస్కరించింది. కానీ తర్వాత  ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. కొన్ని రోజులకు శాస్త్రవేత్తల ఆకస్మిక తొలగింపు నిర్ణయం వెలువడింది. తాజాగా తిరిగి వీరు విధుల్లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభావం ఇలా..

ఎలాన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ టెక్నాలజీతో మానవుల ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నాలు చేస్తోంది. మెదడులో చిప్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాల వ్యాధులు, పక్షవాతం బాదితులతో సమర్థంగా కమ్యునికేట్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ విప్లవాత్మక మార్పులో భాగంగా మెదడు-కంప్యూటర్ ఇంటర్ఫేస్ పరికరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. న్యూరాలింక్‌ పనితీరును సమీక్షిస్తున్న శాస్త్రవేత్తలను తిరిగి నియమించాలన్న ఎఫ్‌డీఏ నిర్ణయంతో ఈ టెక్నాలజీ పురోగతికి ఆటంకాలు లేకుండా చేసినట్లయింది.

ఇదీ చదవండి: యాపిల్‌ తయారీ ప్లాంట్‌ అమెరికాకు తరలింపు

ఉద్యోగాలు కోల్పోయిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రజారోగ్యం, భద్రత మిషన్‌లో పని చేసేవారని ఎఫ్‌డీఏ తెలిపింది. వారిని తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. వారివల్ల అమెరికన్ రోగులకు సాయపడే వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. గతంలో అణ్వాయుధ కార్యక్రమాలను, బర్డ్ ఫ్లూ వ్యాప్తిని పర్యవేక్షించడానికి బాధ్యత వహించిన ఫెడరల్ ఉద్యోగులను తొలగించారు. వీరిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయా ఏజెన్సీలు కోరుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement