ఆర్బీఐ కొత్త రూల్‌.. యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్‌ | Use any UPI app to pay from your wallet as RBI allows interoperability for full KYC PPI | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కొత్త రూల్‌.. యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్‌

Dec 27 2024 9:40 PM | Updated on Dec 27 2024 9:40 PM

Use any UPI app to pay from your wallet as RBI allows interoperability for full KYC PPI

యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి థర్డ్-పార్టీ యూపీఐ ( UPI ) యాప్‌‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ పీపీఐ సంస్థకు చెందిన యూపీఐ యాప్‌ ద్వారా మాత్రమే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉండేది.

ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇకపై వ్యాలెట్ హోల్డర్‌లు యూపీఐ చెల్లింపులు చేయడానికి పీపీఐ వ్యాలెట్ జారీచేసే సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐని ఉపయోగించి వ్యాలెట్ ద్వారా లావాదేవీలు చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌లో ఆర్బీఐ పేర్కొంది.

పీపీఐ అంటే..
పీపీఐలు అనేవి అందులో జమైన సొమ్ముతో వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణ, చెల్లింపులు మొదలైన వాటిని సులభతరం చేసే సాధనాలు. పీపీఐలను బ్యాంకులు, నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. ఆర్బీఐ నుండి అనుమతి పొందిన తర్వాత బ్యాంకులు పీపీఐలను జారీ చేస్తాయి. ఇక భారతదేశంలో ఏర్పాటై కంపెనీల చట్టం, 1956 / 2013 కింద నమోదైన నాన్‌  బ్యాంక్‌ కంపెనీలు కూడా పీపీఐలను జారీ చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement