చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం | Ambulance Accident In Chittoor's Thavanampalle: News Updates | Sakshi
Sakshi News home page

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

Published Fri, Sep 15 2023 8:38 AM | Last Updated on Fri, Sep 15 2023 9:37 AM

Chittoor Thavanampalle Ambulance Accident News Updates - Sakshi

ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది.. 

సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తవణంపల్లె మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది.

వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్  అంబులెన్స్.. చిత్తూరు-తిరుపతి హైవే మీద ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సహా నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆంబులెన్స్‌లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వాళ్లను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement