
ఇదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తిమ్మప్ప చాక్‌లెట్ ఇప్పిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.
కోలారు: కామంతో కళ్లుమూసుకుపోయిన వృద్ధుడు చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన తాలూకాలోని ఛత్రకోడి హళ్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజుమాదిరిగానే బుధవారం ఉదయం తమ ఐదేళ్ల చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రంలో వదలి పనులకు వెళ్లారు. సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రం నుంచి బాలిక ఇంటికి చేరుకోగా ఇదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు తిమ్మప్ప చాక్‌లెట్ ఇప్పిస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. వృద్ధుడి చేష్టలను చిన్నారి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిమ్మప్పను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి:
నాపై హత్యాయత్నం చేశారు: నటి శ్రీసుధ
ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది...