
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో మైనర్ ఫేస్‌బుక్ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. వివరాలు.. ఇద్దరు మైనర్లకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
దీంతో మనస్తాపం చెందిన మైనర్ బాలిక ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకుంది. బాలిక మరణం విషయం తెలుసుకున్న బాలుడు బుధవారం మౌలాలి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్.. ఆపరేషన్ ‘నిమ్రా’ సక్సెస్