
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్‌ని లీడ్ చేస్తే బెటర్ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్ సీక్రెట్‌ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్ మీల్ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.
పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు.
నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్‌పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు.
డైట్ ఎలా ఉంటుందంటే..
రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్‌బ్రెడ్.
ఎర్రటి గోధమ జోవర్ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె.
చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.
(చదవండి: అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..)