అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్‌

Published Wed, Apr 2 2025 7:34 AM | Last Updated on Wed, Apr 2 2025 7:34 AM

అమ్మవ

అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్‌

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): మండల పరిధిలోని చిట్కుల్‌ గ్రామ శివారులో వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ మెంచు నగేశ్‌ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి, సన్మానించారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగేశ్‌ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

రేషన్‌షాపుల్లో

ప్రధాని ఫొటో పెట్టాలి

మెదక్‌జోన్‌: రేషన్‌ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను పెట్టాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. సన్నబియ్యం పంపిణీకి సంబంధించి సొమ్ము కేంద్రానిది అయితే, పెత్తనం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 27 వరకు బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు సుభాష్‌గౌడ్‌, సంతోష్‌రెడ్డి, ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, సిద్దిరాములు, విజయ్‌, శంకర్‌, నారాయణరెడ్డి పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దు

జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి

మెదక్‌ మున్సిపాలిటీ: యువత, విద్యార్థులు బెట్టింగ్‌ యాప్స్‌, నిషేధిత ప్లే కార్డ్స్‌, గేమింగ్స్‌ యాప్‌లు, ఐపీఎల్‌ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే భ్రమలో యువత వాటికి బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీస్‌ నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై నిఘా పెట్టాలని సూచించారు.

భూముల అమ్మకాన్ని

విరమించుకోవాలి

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్‌

నారాయణఖేడ్‌: హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అతిమెల మాణిక్‌ డిమాండ్‌ చేశారు. ఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ డివిజన్‌ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజాపోరాటాలపై, నాయకులపై నిర్బంధం పెరిగిందన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ ఖేడ్‌ ప్రాంత కార్యదర్శి రమేశ్‌ మహిపాల్‌, నర్సింహులు, గణపతి, శివరాజ్‌ పాల్గొన్నారు.

కేతకీలో కర్ణాటక

ఎమ్మెల్సీల పూజలు

ఝరాసంగం(జహీరాబాద్‌): శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కర్ణాటక మాజీమంత్రి రాజశేఖర్‌ పాటిల్‌, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌ పాటిల్‌, భీమ్‌రావు పాటిల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం ఆలయానికి వచ్చిన వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి తదితర పూజ లు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హన్మంత్‌ రావు పాటిల్‌,నాయకులు చంద్రశేఖర్‌ పాటిల్‌, మల్ల య్య స్వామి, రుద్రయ్య స్వామి పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న  అదనపు కలెక్టర్‌1
1/2

అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్‌

అమ్మవారిని దర్శించుకున్న  అదనపు కలెక్టర్‌2
2/2

అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement