
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా హిందీలో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగులో హిట్ అయిన హిందీ-డబ్బింగ్ వెర్షన్ హక్కులను ఈ కంపెనీ సొంతం చేసుకుంది అయితే కార్తీక్ ఆర్యన్ నటించిన అధికారిక హిందీ రీమేక్ షెహజాదా మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం బన్నీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ సంచలనమే. ఇక తమన్ కెరీర్ లోనే అదిరిపోయే ఆల్బమ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సాంగ్ నుంచి సినిమా విడుదల వరకు క్షణక్షణం అనేక రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్‌కు యూట్యూబ్‌లో వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయంటే సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది.
#AlaVaikunthapurramuloo (Hindi) | 2 Days To Go | Releasing On 2nd Feb 2023 Only On Our YouTube Channel #Goldmines #AlaVaikunthapurramulooHindi @alluarjun @hegdepooja pic.twitter.com/k0KLAPsX5W
— Goldmines Telefilms (@GTelefilms) January 31, 2023