ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్‌ కశ్యప్‌ | Anurag Kashyap Strong Counter to Rumours of Quitting Movies | Sakshi
Sakshi News home page

Anurag Kashyap: షారూఖ్‌ కంటే ఫుల్‌ బిజీ.. డేట్స్‌ లేక రోజుకు 3 సినిమాలు రిజెక్ట్‌ చేస్తున్నా..

Apr 18 2025 2:07 PM | Updated on Apr 18 2025 3:33 PM

Anurag Kashyap Strong Counter to Rumours of Quitting Movies

బాలీవుడ్‌ పరిస్థితి అధ్వాణ్నంగా తయారైందని.. అక్కడ తాను ఉండలేనన్నాడు దర్శకనటుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap). అందుకే హిందీ ఇండస్ట్రీని వీడుతున్నట్లు ప్రకటించి దక్షిణాది చిత్రపరిశ్రమకు షిఫ్ట్‌ అయిపోయాడు. ఇది చూసిన కొందరు సినిమాలే వదిలేస్తున్నాడేమో.. రిటైర్‌మెంట్‌ అని నేరుగా చెప్పకుండా ఇలా ఏదేదో వాగుతున్నాడు అని విమర్శించారు.

షారూఖ్‌ కంటే బిజీ
దీనిపై అనురాగ్‌ కశ్యప్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. నేను సిటీ మారానంతే.. సినిమాలు మానలేదు. తిక్కతో అన్నీ వదిలేసి వెళ్లిపోయాననుకునేవాళ్లకు నేను చెప్పేదేంటంటే.. ప్రస్తుతం నేను షారూఖ్‌ ఖాన్‌ కంటే బిజీగా ఉన్నాను. (అంతే బిజీగా ఉండాలి కూడా.. కాకపోతే ఆయనంత డబ్బు సంపాదించను) 2028 వరకు నా డేట్స్‌ ఖాళీగా లేవు. 

చేతినిండా సినిమాలు
ప్రస్తుతం డైరెక్టర్‌గా నా చేతిలో ఐదు సినిమాలున్నాయి. మూడు ఈ ఏడాది.. మరో రెండు వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తాయి. క్షణం కూడా ఖాళీగా లేనంత పని దొరికింది. దీనివల్ల రోజుకు మూడు ప్రాజెక్టులైనా తిరస్కరించాల్సి వస్తోంది. కాబట్టి మీరు నోరు మూసుకోండి అంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం అనురాగ్‌ కశ్యప్‌.. మహారాజ, విడుదల:2, రైఫిల్‌ చిత్రాలతో సౌత్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఇతడు డకాయిట్‌ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. 

 

 

చదవండి: ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్‌ ఫ్యామిలీ.. థాంక్స్‌ చెప్పిన నమ్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement