
Bigg Boss 5 Telugu Finalist Maanas Clear On Relationship With Priyanka Singh: బిగ్‌బాస్ సీజన్-5లో మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్ మానస్. ఎమోషన్స్, గేమ్‌ను బ్యాలెన్స్ చేస్తూ టాప్ 5లో స్థానం సంపాదించుకున్న మానస్ తన ఆటతీరుతో, ప్రవర్తనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. చదవండి: బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్.. పోస్ట్ వైరల్
చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యాడు. అయితే మానస్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది పింకీ లవ్ ట్రాక్. చాలా సార్లు తన ఇష్టాన్ని వ్యక్తపరిచినా మానస్ మాత్రం సున్నితంగానే నో చెప్పేవాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మానస్ ప్రియాంక గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
'జైలు నామినేషన్ టాస్కుల్లో అవకాశం ఉన్నా రవిని కాకుండా జెస్సీని నామినేట్ చేసింది. ఆ సందర్భంలో ప్రియాంక నటిస్తున్నట్లు అనిపించింది. అంతకుముందు టవర్ టాస్కులో కూడా చీరను అడ్డుపెట్టి ఓడిపోయేలా చేసింది. ఈ రెండు సందర్భాల్లో ప్రియాంక నటిస్తున్నట్లు ఉంది అని కాజల్‌తో చెప్పాను. తను నా ఫ్రెండ్ కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేశాను. వేరే వాళ్లతో చెప్పలేదు.
కానీ కొందరికి అది బ్యాక్ బిచ్చింగ్‌లా అనిపించొచ్చు. హౌస్‌లో 90రోజులు జర్నీ చేసిన ప్రియాంక సైతం బయటికి వెళ్లాక ఈ ఫుటేజ్ చూసి.. నువ్వు నటించావా లేదా భరించావా అని వీకెండ్ ఎపిసోడ్‌లో అడిగింది. 24 గంటలు హౌస్‌లో నన్ను గమనించి కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి అలా అడిగిందంటే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా' అంటూ వివరించాడు.
చదవండి: బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్