
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, అతను కోలుకుంటాడన్న నమ్మకం తమకు ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నారు. స్టంట్ వేయడం కుదరలేదు, మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే ప్రత్యేక వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఇవాల్టికి కాస్త మూమెంట్ ఉందని డాక్టర్లు చెప్పారు. తారకరత్న కోలుకుంటాడన్న నమ్మకం మాకు ఉంది. బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు ఉందన్నది తెలియాల్సి ఉంది. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్థించండి. అభిమానుల ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాన్న నమ్మకం ఉంది'' అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.