ఎంపురాన్ మూవీ పోస్టర్‌.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు? | Netizens debates over mystery man on poster of Mohanlal, Prithviraj in L2: Empuraan | Sakshi
Sakshi News home page

L2: Empuraan Movie - ఎంపురాన్ మూవీ పోస్టర్‌.. ఇంతకీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?

Published Tue, Mar 25 2025 4:09 PM | Last Updated on Tue, Mar 25 2025 4:23 PM

Netizens debates over mystery man on poster of Mohanlal, Prithviraj in L2: Empuraan

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ 'ఎల్ 2: ఎంపురాన్'. గతంలో హిట్‌గా నిలిచిన 'లూసిఫర్' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌ రాజు విడుదల చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ ఉగాది కానుకగా మార్చి 27న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే తాజాగా ఎంపురాన్ విడుదల చేసిన పోస్టర్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్టర్‌లో ఉన్నది ఎవరా? ‍అనే చర్చ మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కూడా నటించారా? అనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ఎంపురాన్ కొత్త పోస్టర్‌లో ఉన్నది అమిర్ ఖానా? రిక్ యూనేనా అని నెటిజన్స్ తెగ కన్‌ఫ్యూజ్ ‍‍అవుతున్నారు.

ఒక అభిమాని రాస్తూ.. ఈ ఫోటోలో ఉన్నది అమీర్ ఖానే.. అతని చెవులు చూడండి అచ్చం అలానే ఉన్నారు. అవును ఆ పోస్టర్‌లో ఉన్నది కచ్చితంగా అమీర్ ఖానే.. ఎందుకంటే ఆయన సోదరి కూడా చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని మరో నెటిజన్స్ కామెంట్ చేశాడు. మరికొందరైతే హాలీవుడ్ నటుడు రిక్ యునే కావచ్చుని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది అమిర్ ఖాన్ కాదు.. కచ్చితంగా రిక్ యున్ అని కామెంట్స్‌లో రాసుకొచ్చాడు.

ఓ నెటిజన్‌ ఏకంగా ఏఐ గ్రోక్‌ని కూడా అడిగాడు. ఈ ఫోటో రిక్ యున్‌తో పోలికను కలిగి ఉందా? అని అడిగాడు. ఈ పోస్టర్‌లో డ్రాగన్‌కి ఎదురుగా ఉన్న సూట్‌లో వెనుక నుంచి ఒక వ్యక్తి కనిపిస్తాడు.. అది బహుశా మోహన్‌లాల్ అయి ఉండొచ్చు. ముఖం కనిపించకుండా ఉన్న ఈ పోస్టర్‌కు రిక్ యున్‌తో పెద్దగా పోలిక లేదు. ఈ శైలి యున్ యాక్షన్ పాత్రలను సరిపోలినప్పటికీ.. కానీ భౌతికంగా చూస్తే ఆ పోలిక అస్పష్టంగా ఉంది" అని గ్రోక్ సమాధానమిచ్చింది. అయితే ఎల్‌2 ఎంపురాన్ పోస్టర్‌ మిస్టరీ మ్యాన్‌ ఎవరనే విషయంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement