
తెలుగులో కొన్నేళ్ల పాటు పాపులర్ యాంకర్ గా కొనసాగిన ప్రదీప్ మాచిరాజు.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో గతంలో హీరోగానూ నటించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ఇప్పుడు యాంకరింగ్ ని పక్కనబెట్టి మరో మూవీలో హీరోగా నటించాడు. అదే 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)
ట్రైలర్ బట్టి చూస్తుంటే సివిల్ ఇంజినీరింగ్ చేసిన ఓ కుర్రాడు.. ఊహించని విధంగ ఓ పల్లెటూరికి వెళ్తాడు. ఆ ఊరిలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? ఇందులో హీరోయిన్ పాత్రేంటి? అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
ట్రైలర్ లో కామెడీ పర్లేదనేలానే ఉంది. ఏప్రిల్ 11న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రదీప్ సరసన దీపిక పిల్లి హీరోయిన్ కాగా.. నితిన్-భరత్ దర్శకులుగా పరిచయమవుతున్నారు. మరి ఈ సారైనా ప్రదీప్ హిట్ కొడతాడేమో చూడాలి?
(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత)