
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరాఖండ్‌లో తనకు ఓ గుడి కట్టారని. ఆపై బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉందని ఒక ఇంటర్వ్యూలో ఆమె కామెంట్ చేశారు. ఎప్పుడూ ఎదో వివాదంలో చిక్కుకునే ఈ బ్యూటీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాజాగా తన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్స్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఊర్వశీ టీమ్ పేర్కొంది.
'ఊర్వశీ తన పేరు మీద ఆలయం ఉందని మాత్రమే చెప్పారు. కానీ, అది తన ఆలయమని ఆమె ఎక్కడా చెప్పలేదు. అయితే, కొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మీరందరు కూడా మరోసారి ఊర్వశీ మాట్లాడిన వీడియోను చూడండి. అప్పుడు ఆమె మాటలను అర్థం చేసుకుంటారని అందరినీ కోరుతున్నాం. ఢిల్లీ యూనివర్సిటీలో ఊర్వశీ ఫోటోకు దండలు వేసి పూజలు చేస్తారని చెప్పడం నిజమే.. కావాలంటే ఎవరైనా విచారించుకోవచ్చు. ఇప్పటికే పలు ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కూడా అందుబాటులో ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని అవమానకరమైన కామెంట్లు చేయడం చాలా దారుణం. అందరినీ గౌరవించండి.' అంటూ ఊర్శశీ టీమ్ ఒక పోస్ట్ చేసింది.
బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించాలని ఊర్వశీ కోరడంతో బద్రీనాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు భగ్గుమన్నారు. ఊర్వశీ తన వ్యాఖ్యలతో భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. బద్రీనాథ్ సమీపంలో ఉన్న బామ్నిలో ఊర్వశీ పేరుతో ఒక ఆలయం ఉన్నమాట వాస్తవమేనని అర్చకులు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ ఆలయానికీ, ఊర్వశీకి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు.