
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్, నటి ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నిజమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, చహల్ మరో యువతితో డేటింగ్‌లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఆర్జే మహ్వాష్‌తో(RJ Mahvash) డేటింగే వల్లే చహల్ కాపురంలో చిచ్చు మొదలైందని పుకార్లు కూడా వచ్చాయి. కొద్దిరోజుల క్రితమే వాటిని మహ్వాష్ తిప్పికొట్టింది. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఆమె పేర్కొంది. అయితే, తాజాగా వారిద్దరూ కలిసి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో సందడి చేశారు. దీంతో మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్‌ఇండియా అందుకుంది. ఇంతటి సంబరంలో కూడా యుజ్వేంద్ర చహల్, ఆర్జే మహ్వాష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వారిద్దరూ ప్రేక్షకుల గ్యాలరీలో సందడిగా కనిపించారు. చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షోషల్‌మీడియాలో కొందరు షేర్ చేశారు. గతంలో వీళ్లిద్దరూ రెస్టారెంట్‌లో కనిపించిగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా మరోసారి సన్నిహితంగా కనిపించడంతో వారిద్దరిపై వస్తున్న డేటింగ్ వార్తలు నిజమేననే అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఒక సందర్భంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ కూడా ఈ జంటతో ముచ్చటించారు. ఆయన కూడా చహల్, మహ్వాష్ ఫోటోలను షేర్ చేశారు.
ఆర్జే మహ్వాష్ సినీ నటి మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు నిర్మాతగా ఉన్నారు. నిర్మాణ కార్యక్రమంలో ఉన్న ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే, ఆమెకు రేడియో జాకీగా మొదట బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు క్రికెటర్ యుజ్వేంద్ర చహల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె పేరు ట్రెండ్ అవుతుంది.
Following separation from actress-choreographer #DhanashreeVerma, cricketer #YuzvendraChahal was spotted with #RJMahvash watching #INDvsNZ Champions Trophy final in Dubai. pic.twitter.com/j5cjTXcdvL
— Cinemania (@CinemaniaIndia) March 9, 2025