Viral Video: రైల్వే స్టేషన్‌లో యువతి బిత్తర స్టెప్పులు.. అయినా 10 లక్షల వ్యూస్‌! | Viral Video Girl Dancing At Railway Station Makes Netizens Cringe | Sakshi
Sakshi News home page

Viral Video: రైల్వే స్టేషన్‌లో యువతి బిత్తర స్టెప్పులు.. అయినా 10 లక్షల వ్యూస్‌!

Mar 31 2023 8:39 PM | Updated on Mar 31 2023 9:12 PM

Viral Video Girl Dancing At Railway Station Makes Netizens Cringe - Sakshi

సోషల్‌ మీడియా పుణ్యమా అని  ఎవరూ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. యూట్యూబ్‌ వీడియోలు, రీల్స్‌తో తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యేందకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అర్థవంతమైన, ప్రజలకు అవసరమైన కంటెంట్‌ను అందించి ఫేమస్‌ అవుతుంటే మరికొందరు జనాల దృష్టిని ఆకర్షించేందకు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చిచేష్టలు, అర్థంపర్థం లేని డ్యాన్స్‌లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 

ఇలాంటి కోవకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సీమా కనోజియా అనే యువతి రైల్వే స్టేషన్‌లో డ్యాన్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇందులో యువతి రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లో అక్షయ్‌ ఖన్నా, ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘ఆ అబ్‌ లౌత్‌ చలే’ సినిమాలోని ‘మేరా దిల్‌ తేరా దీవానా’ అనే పాటకు పిచ్చిపిచ్చిగా డ్యాన్స్‌ చేసింది. బ్లూ కలర్‌ డ్రెస్‌లో పాటకు సంబంధం లేకుండా ఆమె వేసిన స్టెప్పులు ఎవరిని ఆకట్టులేకపోకపోయాయి. అయినా యువతి అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా డ్యాన్స్‌ చేయడం కొసమెరుపు.

దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌లో  వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. యువతి బిత్తర స్టెప్పులపై నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఆమె డ్యాన్స్‌ను ట్రోల్‌చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిస్తున్న ఈమెలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికాగా సదరు యువతికి ఇన్‌స్టాలో 3లక్షలకు పైగా ష్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉండటం గమనార్హం.  అయితే యువతి ఇలాంటి వీడియోలు పెట్టడం ఇదేం తొలిసారి కాదు, లోకల్‌ రైలు, రోడ్డు ఎలా ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement