netizens
-
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో విషాదం, నెటిజనుల దిగ్భ్రాంతి
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద వార్తను రజని దంపతులు ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్ ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్ (ఫిబ్రవరి 18న) ఇన్‌స్టాలో ప్రకటించారు. 2008 ఆగస్టులో పుట్టిన తరణ్ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్‌కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం, బీ బ్రేవ్ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను ఆమె ఖుషీ చేసేవారు. రజని ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే ట్యాగ్‌లైన్‌తో రెసిపీలను షేర్ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనే ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు. వీడియోలలో భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా రజని అభిమానులకు బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్లో కనిపించాడు.(మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)ఆత్మహత్య ఊహాగానాలు, రజని జైన్ స్పష్టతతన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి పోస్ట్‌ను పంచుకోవడం అనుమానాలకు తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్ది ఆత్మహత్య అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తరణ్ చాలా మెరిట్స్టూడెంట్ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రజనీ వివరణ ఇచ్చారు. -
మహిళలకు ఫ్రీ బస్సా? ఇదెక్కడి న్యాయం అంటూ ట్వీట్ : ఇచ్చిపడేసిన నెటిజనులు
అటు కర్ణాటక, ఇటు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం మహిళలను బాగా ప్రయోజనకరంగా మారింది. మరోవైపు ఉచిత ప్రయాణంపై అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ప్రస్తుతం దీనిపై తెగ చర్చ నడుస్తోంది.బెంగళూరుకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తన అభిప్రాయాన్ని ట్విటర్లో పంచుకున్నాడు. అసలు కేవలం ఆధార్ చూపించిబస్సులో ప్రయాణించడం ఎంతవరకు న్యాయం అంటూ తన అక్కసంతా వెళ్లగక్కాడు. కుమార్ పోస్ట్‌లో అందించిన వివరాల ప్రకారం బెంగళూరు నుండి మైసూరుకు KSRTC బస్సులో ప్రయాణ ఛార్జీ రూ.210. ఈ బస్సులో 50 మంది ప్రయాణికులలో దాదాపు 30 మంది మహిళలు. 20 మంది పురుషులు డబ్బులుచెల్లించి టికెట్ తీసుకుంటే, ఆధార్ చూపించి 30మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది న్యాయమా? సమానత్వం అంటే ఇదేనా?. ఒక వృద్ధుడు చెల్లించడానికి నోట్లు దొరక్క ఇబ్బంది పడుతోంటే, మరో పక్క వీడియో కాల్లో ఒక ధనిక యువతి దర్జాగా ఫ్రీగా వెళుతోంది అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభుత్వం అంత మిగులు ఆదాయాన్ని ఆర్జిస్తుంటే, విమానాశ్రయ షటిల్ సర్వీస్ తరహాలో సార్వత్రిక ఉచిత బస్సు సేవను ప్రకటించవచ్చు కదా అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా, సబ్సిడీలు, సంక్షేమం భరించలేని వారికి కదా ఇచ్చేది, కానీ బెంగళూరు , మైసూరు వంటి నగరాల్లో ధనవంతులైన మహిళలకు ఉచిత పథకమా అంటూ ఆక్రోశమంతా వెళ్లగక్కాడు. ఓట్ల కోసం ఉచితాలనే దుర్మార్గపు చక్రంలోకి ప్రవేశించాం, సమీప భవిష్యత్తులోదీన్నుంచి బయటపడటం కష్టం అంటూ వాపోయాడు.దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది ఈ పథకాన్ని సమర్థించారు. సాధారణంగా ఉచితాలను ఆమోదించను కానీ రెండుమూడు సార్లు BMTCలో ప్రయాణించా. బస్సులో ప్రయాణించే చాలా మంది మహిళలు రోజువారీ వేతన కార్మికులు లేదా సాధారణ ఉద్యోగులే కనుక..అది చూసి మంచిగా అనిపించింది ఒక యూజర్ వ్యాఖ్యానించారు. "ఇది ఉచితాలు కాదు. ప్రజలు ఇచ్చే పన్నులకు బదులుగా ప్రభుత్వం సమాజానికి తిరిగి చెల్లిస్తోంది. ఇది అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ,పాలనా సూత్రాలు అర్థం కావు అంటూ మరో వినియోగడదారుడు చురకలేశాడు.మరి కొంతమంది ఆయన వాదను సమర్ధించారు. తాము చెల్లించే ఇలా పోతున్నాయి.. ఇది తనకు నచ్చలేదు అంటూ మహిళల ఫ్రీ బస్సు పథకంపై ప్రతికూలంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్‘‘మీ వాదన సరైనదే. ఉచితం కాదు.. 50శాతం చేయండి. మహిళలకు ఈ ఉచిత ప్రయాణం పాఠశాల, కళాశాల ,పనికి వెళ్లే సాధారణ ప్రయాణికులకు కష్టంగా మారింది.’’ "నా ఆదాయపు పన్నును రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించాలి... అర్హత లేని వారికి ఉచితాలను పంపిణీ చేయడానికి కాదు" I took an early morning bus to Mysuru, from Bengaluru. ₹210 fare. Comfortable KSRTC bus and a world class highway for fast travel.But I got a few thoughts. 1) Nearly 30 of the 50 passengers were women. Just show Aadhar and travel free. Is this fair? Is it equality? 2) 20… pic.twitter.com/2TfkzF88IA— Kiran Kumar S (@KiranKS) January 8, 2025 "ఇతరులు చెల్లించడానికి ఇబ్బంది పడుతుండగా, సంపన్న మహిళలకు ఉచితాలను అందజేయడం. ఓటు బ్యాంకు రాజకీయం తప్ప మరొకటి కాదు. సబ్సిడీలను మౌలిక సదుపాయాలు లేదా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడం వంటి నిజమైన సమస్యలకు ఉపయోగించాలి. ఇలా కొంతమందిపై అదనపు భారం ఎందుకుమోపాలి? ఇది స్పష్టమైన అసమానత, పురోగతి కాదు" -
గోవాలో ఏం జరుగుతోంది?.. సీఎం రియాక్షన్ ఇదే!
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అక్కడి పర్యాటకం మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గోవాలో పరిస్థితులు మునుపటిలా లేవని.. పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోతూ వస్తోందన్న గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా తప్పుగా వ్యవహరించొద్దంటూ ఆయన పిలుపు ఇస్తున్నారు. ఇంతకీ గోవాలో ఏం జరుగుతోందంటే.. ఈసారి ఇయర్ ఎండ్‌లో గోవాకు సందర్శకుల తాకిడే లేకుండా పోయిందని.. హోటల్స్, బీచ్‌లు బోసిపోయాయని పలు జాతీయ మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పాటు గోవాలోని పర్యాటకుల జేబులను గుళ్ల చేస్తున్న మాఫియా ముఠాలే అందుకు కారణమని విశ్లేషించాయి కూడా. అయితే..ఈ కథనాలకు మూలం.. కొందరు సోషల్ మీడియా(Social Media) ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన పనేనని తేలింది. అయినప్పటికీ అది పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపెడుతుందనే ఆందోళనలతో సీఎం ప్రమోద్ సావంత్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది.‘‘సోషల్ మీడియాలో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈసారి ఇయర్ ఎండ్ వేడుకులకు గోవాకు పెద్దగా పర్యాటకులెవరూ రాలేదని.. వేరే ప్రాంతాలకు వెళ్లారని పోస్టులు చేశారు. వాళ్లు చేసింది ముమ్మాటికీ తప్పు. గోవా గురించి తప్పుడు సందేశాలు పంపారు వాళ్లు. వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే. మీరు ఇక్కడికి వచ్చి తీర ప్రాంతాన్ని ఆస్వాదించండి’’ అని సీఎం ప్రమోద్ సావంత్ పిలుపు ఇచ్చారు.అదే సమయంలో గోవా(Goa)లో జరిగే పలు మాఫియాల మీద ఆయన స్పందించారు. గోవాకు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రాంతాలను ఆస్వాదించాలి. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలి అనుకోవాలి. అంతేగానీ.. చేదు అనుభవాలతో తిరిగి వెళ్లకూడదు. పర్యాటకులతో సవ్యంగా మసులుకోకుంటే.. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు. అలాగే.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అదనపు బలగాలను మోహరించేలా చూస్తామని ప్రకటించారాయన. ‘‘యావత్ దేశం నలుమూలల నుంచి గోవాకు ఇదే మా ఆహ్వానం. నవంబర్, డిసెంబర్, జనవరి.. ఈ మూడు నెలలు గోవాకు ఎంతో కీలకం. రకరకాల పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం దేశవిదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికే గోవాలో అన్ని హోటల్స్ నిండుగా ఉన్నాయి. విమానాలు కూడా నిండుగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో.. కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని పేర్కొన్నారాయన.నిజంగానే పడిపోయిందా?చిన్నరాష్ట్రమైన గోవా జనాభా సుమారు 16 లక్షలు. పర్యాటకుల సంఖ్య మాత్రం ఏయేడు కాయేడూ పెరుగుతూనే వస్తోంది. అయితే తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి.2015లో గోవాను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఐదు లక్షల 20 వేలు2023లో సుమారు 8 లక్షల 50 వేల మంది పర్యటించారు2019లో ఏకంగా 9 లక్షల 40 వేల మంది పర్యటించి రికార్డు క్రియేట్ చేశారు2024 నవంబర్‌నాటికి ఆ సంఖ్య సుమారు 4 లక్షలుగా ఉంది.*ఓహెర్లాడో గణాంకాల ప్రకారంఒక్కడితో మొదలై.. గోవా టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంపై సోషల్‌మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. గోవా మునుపటి ఫ్రెండ్లీ స్పాట్‌లా లేదని.. పర్యాటకానికి ప్రతికూలంగా మారిందనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ పర్యాటక ప్రాంతాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే టైంలో.. గోవాలో మోసాలు ఎక్కువగా జరుగుతాయనే భావన పర్యాటకుల్లో విపరీతంగా పేరుకుపోయిందని చెబుతూ రామానుజ్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. తప్పుడు గణాంకాలతో అతను పోస్ట్ చేశాడంటూ గోవా పోలీసులు కేసు నమోదు చేశాడు. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఈసారి ఏకంగా సీఎం ప్రమోద్ సావంత్‌కే ఓ లేఖ రాశారు. విదేశీ పర్యాటకులు గోవాను ఏమాత్రం సురక్షిత ప్రాంతంలా భావించడం లేదని, ట్యాక్సీ సర్వీసుల మొదలు.. లిక్కర్, హోటల్, ఫుడ్, చివరికి చిరువ్యాపారులు సైతం తమను దోపిడీ చేస్తున్నారనుకుంటున్నారని, ఈ పరిస్థితి మారకపోతే రాబోయే రోజుల్లో గోవా పర్యాటకానికి గడ్డు పరిస్థితులు తప్పవని సీఎంకు సూచించాడాతను. అటుపై.. అతనికి మద్ధతుగా ఖాళీ బీచ్‌లు, హోటల్స్, సెలబ్రేషన్స్ ఫొటోలు పెడుతూ వస్తున్నారు. చదవండి👉🏾: రెస్టారెంట్ సిబ్బందితో గొడవ.. గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య -
ఫుడ్ డెలివరీ యాప్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రచారం చేయడానికి బిల్‌బోర్డ్‌లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం..
ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ చేసిన తరువాత.. సుశాంత్ మెహతా తన ఎక్స్ ఖాతాలో కార్ల డిజైన్ గురించి, సర్వీస్ క్వాలిటీ వంటి వాటిపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. మీరు ఇప్పటికే ఉన్న కార్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల సమస్యలు, ఉద్యోగుల ప్రవర్తనలకు సంబంధించిన.. గ్రౌండ్ లెవల్ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని అన్నారు.మీ కార్ల డిజైన్స్ విషయానికి వస్తే.. అవన్నీ హ్యుందాయ్ కార్లకు సమీపంలో కూడా ఎక్కడా నిలబడలేవు. బీఈ 6ఈ కారు లుకింగ్ కూడా వింతగానే ఉందని పేర్కొన్నాడు. మీ డిజైన్ టీమ్ ఇలాగే ఆలోచిస్తోందా? లేదా మీకు డిజైన్ మీద సరైన అవగాహనా లేదా? అని విమర్శించాడు. అంతే కాకుండా మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా.. టాటా కంపెనీ కూడా ప్రపంచ స్థాయి కార్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ నిరాశే మిగిలిందని అన్నాడు.దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే సుశాంత్. మనం చాలా దూరం వెళ్ళాలి. అయితే మనం ఎంత దూరం వచ్చామన్న విషయాన్ని కూడా ఆలోచించండి. నేను 1991లో కంపెనీలో చేరాను. అప్పుడే భారత్ ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి అడుగుపెట్టే కార్లు.. గ్లోబల్ బ్రాండ్లతో పోటీపడలేవని, ఈ రంగం నుంచి తప్పకోవాలని ఓ సంస్థ సలహా ఇచ్చింది. అయినప్పటికీ మేము మూడు దశాబ్దాలుగా కార్లను తయారు చేస్తూ.. అనేక ప్రపంచ బ్రాండ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాము. ఎటువంటి ఆత్మసంతృప్తికి మేము ఆస్కారం లేదు. నిరంతర అభివృద్ధి మా మంత్రంగా కొనసాగుతుంది. మమ్మల్ని మరింత రగిల్చినందుకు ధనవ్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఆనంద్ మహీంద్రా సానుకూల ప్రతి స్పందనను కొనియాడారు. దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్ కార్ల కంటే మహీంద్రా, టాటా కార్లు చాలా సురక్షితమైనవి పేర్కొన్నారు.ఆనంద్ మహీంద్రా స్పందనకు సుశాంత్ మెహతా సైతం ఫిదా అయిపోయాడు. నేను చేసిన విమర్శను కూడా స్వీకరిస్తూ.. సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ట్వీట్ చూసి మీ టీమ్ కాల్ చేసింది. వారు బహుశా హర్ట్ అయ్యి ఉంటారని నేను భావించాను. అందుకే ట్వీట్ డిలీట్ చేశా అని మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.OMG this is so sweet.I am glad you took the criticism constructively, I had to delete the tweet after a call from yiur team because I thought they are unhappy with the harsh words.— Sushant Mehta (@SkyBarrister) December 1, 2024 -
‘మా నగరానికి ఏమైంది’ : కాలుష్యంపై నెటిజన్ల ఆగ్రహం
సాక్షి, ముంబై: దేశరాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కా లుష్యంతో ఇప్పటికే సతమత మవుతుండగా, ఇప్పు డు ముంబై కూడా అదే సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా నగరంలో వాయునాణ్యత క్షీణిస్తుండటంతో పర్యావరణవేత్తలు, ముంబైవాసు లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మా నగరా నికి ఏమైంది? దీనికి బాధ్యులెవరు?‘అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి ముంబైలోని అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించిన బాంద్రా – కుర్లా కాంప్లెక్స్, బైకుల్లా, శివ్డీ, కొలాబా, శివాజీనగర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్రమేపీదిగజారుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలనెదుర్కొంటున్నారు. గుండె జబ్బులు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు సూచనలు.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నగరంలో కాలుష్య నియంత్రణకు పలు సూచనలు చేస్తున్నారుపరిశ్రమల నుంచి వెలువడే వాయు మలినాలను తగ్గించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం. ట్రాఫిక్ నియంత్రణ ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించడం. పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేయడం. -
నీ వెనుక నేనుంటా.. నెటిజన్ ప్రపోజల్‌కి సమంత ఎమోషనల్!
సమంత ప్రస్తుతం ‘సిటాడెల్: హనీ బన్నీ ’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ముంబైతో పాటు పలు నగరాలు తిరుగుతూ వెబ్ సిరీస్‌ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తోంది. ఒకవైపు మీడియాతో ముచ్చటిస్తూనే..మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పకలరిస్తోంది.వీలున్నప్పుడల్లా నెట్టింట సందడి చేసే సామ్..తాజాగా తన ఫాలోవర్స్, అభిమానులతో మాట్లాడేందుకు ఇన్‌స్టాలో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్స్ ఆమెకు పలు ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సామ్ సమాధానం చెప్పింది. ఇక ఓ నెటిజన్ అయితే సమంతపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది. నీకు తోడుగా ఎవ్వరు లేకపోతే.. ఆ సమయంలో నేను ఉంటా. ఐ లవ్ యూ సమంత’ అని కామెంట్ చేశాడు. నెటిజన్ ప్రపోజ్కి సమంత ఫిదా అయింది. మీ ప్రేమే నాకు బలం అంటూ ఎమోషనల్ అయింది. ‘సిటాడెల్’ భారీ అంచనాలుసమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిసి నటిచిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ‘దీ ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియాంక చోప్రా నటించిన అమెరిక్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’కి ఇది ఇండియన్ వెర్షన్. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి భారీ స్పందన వచ్చింది. ప్యామిలీమేన్ తరహాలో ఈ వెబ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బట్టి చూస్తే.. ఇందులో సమంత భారీ యాక్షన్ సీన్స్ చేసినట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
ద్రోహం తలపెట్టినా చూస్తూ ఉండిపోవాలా?
సాక్షి, అమరావతి: ఆనాడు పిల్లనిచ్చి.. పదవులిచ్చి.. పార్టీ నీడనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. నేడు ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల సొంత అన్న జగన్‌కే ద్రోహం తలపెట్టారు. స్వార్జిత ఆస్తుల్లో వాటా ఇస్తానన్న అన్న ప్రేమకు విలువ లేకుండా చేస్తూ, ఆయన బెయిల్ రద్దుకు శత్రువులతో కలిసి కుట్రలు చేస్తున్నారు.పెళ్లయిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన పదేళ్ల అనంతరం కూడా చెల్లికి ఆస్తులిచ్చేంత సహృదయం ఉన్న జగన్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఈ కుతంత్రాలను రక్తి కట్టించడం కోసం మీడియా ముందు దొంగ ఏడుపులతో డ్రామాలాడుతున్నారు. ఇదేనా వైఎస్సార్ బిడ్డ నైజం. ఇలాగేనా ఆ మహానేత కుమార్తె నడుచుకోవాల్సిన విధానం... అంటూ షర్మిలపై సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్ పోస్టులతో దుమ్మెత్తి పోస్తున్నారు. వాటి సారాంశం ఇలా ఉంది.. భారతి పేరు ఉంది.. మీ పేరు లేదంటే ఏంటి అర్థం? ‘వాళ్ల పేర్లతో ఆస్తులు ఉంటే... నిజంగా వాళ్లవి అవుతాయా? నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్లలేదు అంటున్నారు. అలా అయితే భారతి కూడా జైలుకు వెళ్లాలి కదా’ అని అంటున్న షర్మిలకు భారతి పేరు ఈడీ కేసుల్లో ఉందనే విషయం తెలియదా? మరి షర్మిల పేరు ఎందుకు లేదు. అంటే ఆ ఆస్తులతో షర్మిలకు సంబంధం లేదనే కదా అర్థం. ఎవరైనా తమ ఆస్తులకు వేరే వాళ్ల పేర్లు పెట్టుకుంటుంటే పోనీలే పేరు పెట్టుకుంటే ఏముందిలే అని ఊరుకుంటారా.? అవి జగన్ ఆస్తులు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టుకున్నా దివంగత వైఎస్సార్ అభ్యంతరం చెప్పలేదనేది నిజం కాదా? చిన్నాన్నను అంత మాట మీరనొచ్చా? సొంత చిన్నాన్న అంటుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయని, నా బిడ్డలు నీ ముందు పెరగలేదా... అని సుబ్బారెడ్డిని ప్రశ్నించిన షర్మిల అదే చిన్నాన్నను జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, పదవులు ఇస్తే అనుభవిస్తున్నారని అనడం సమంజసమా. ఆయనపై అంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా అంత పెద్ద మాట ఎలా అనగలిగారు షర్మిలమ్మా.? చిన్నాన్న కాబట్టే, మొదటి నుంచీ జరుగుతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్నారు కాబట్టే సుబ్బారెడ్డి వాస్తవాలు మాట్లాడితే తట్టుకోలేక ఆయనను నిందించడమేనా మీ సంస్కారం. పైగా సాయిరెడ్డి, సుబ్బారెడ్డిలను పరీక్షించడం కోసం, వాళ్ల గురించి విజయమ్మకు తెలియడం కోసం లేఖలో వారి పేర్లు ప్రస్తావించారా? ఇప్పుడు మీరు వారిద్దరి గురించి విజయమ్మకు కొత్తగా చెప్పాలా..? విజయమ్మ క్షోభకు కారణం మీరే కదా? ‘సొంత కొడుకు తల్లిని కోర్టుకి ఈడ్చాడని, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాను.. పురిటిలోనే చంపేయాల్సింది అని ఆ తల్లి అనడం లేదని, ఇది చూడటానికా నేను ఇంకా బతికి ఉన్నాను’ అని విజయమ్మ ఏడుస్తోందని చెప్పుకొస్తున్నారు షర్మిల. విజయమ్మ ఈ మాటలు అన్నారో లేదో షర్మిలకే తెలియాలి. అయితే నిజానికి విజయమ్మను ఇంతటి క్షోభకు గురిచేస్తున్నది మాత్రం షర్మిలేనని స్పష్టంగా అర్థం అవుతోంది. ఆస్తుల కోసం షర్మిల పట్టుబట్టి తల్లిని, కొడుకుని వేరు చేయాలని ప్రయత్నిస్తుండటం విజయమ్మకు కడుపుకోత కాదా? కుమారుడి ప్రతి కష్టంలోనూ, ప్రతి విజయంలోనూ తోడున్న విజయమ్మను కూడా మీ కుట్రలకు వాడుకుంటారా..? బహుశా ఇలాంటి కూతురు నాకెందుకు పుట్టిందా అని విజయమ్మ బాధపడుతూ ఉండి ఉంటారు. ఒకసారి చేస్తే సరేగాని ప్రతి సారీ మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపులు ఏడ్చేయడం షర్మిలకే చెల్లింది. చంద్రబాబును కాపాడాలనుకున్న ప్రతిసారీ ప్రెస్‌మీట్ పెట్టడం... కన్నీళ్లు పెట్టేసుకోవడం ఆమెకు బాగా అలవాటైపోయింది. ప్రజలపై రూ.6 వేల కోట్లకు పైగా విద్యుత్ చార్జీల భారం వేస్తే రాని కన్నీరు, వాస్తవాలను ఒప్పుకోలేక వస్తున్నాయంటేనే అర్థం అవుతోంది ఆమెకు ప్రజల మీద ఎంత ప్రేమో.. విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు, కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత రాకూడదనేగా ఈ ఏడుపు డైవర్షన్లు? నిజమే.. జగన్ లాంటి అన్న ఎవరుంటారు? ఏ అన్న అయినా... చెల్లికి గిఫ్ట్ అంటే ఏ బంగారమో, చీరనో ఇస్తారని, అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాటా ఇస్తారా? నా హక్కు కాబట్టే నాకు ఇస్తామన్నారని షర్మిల అంటున్నారు. నిజమే ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న రోజులివి. అలాంటి కలికాలంలోనూ చెల్లిలికి తన సొంత ఆస్తి నుంచి, కష్టార్జితం నుంచి వాటా ఇస్తాననే అన్న బహుశా ఒక్క జగన్ తప్ప ఎవరూ ఉండరేమో. అది కూడా ఆమెకు పెళ్లి జరిగిన 20 ఏళ్ల తరువాత, తండ్రి మరణించిన 10 ఏళ్లు అయిపోయాక అంటే నిజంగా చెల్లిలి మీద ఎంత ప్రేముంటే ఇంతటి నిర్ణయం తీసుకుంటారు..? పైగా అడగకుండానే ఎంవోయూ రాసిచ్చారని మీరే అంటున్నారంటే, అంత చిత్తశుద్ధి ఉన్న అన్న ఇంకెవరుంటారు. మీ లేఖను టీడీపీ విడుదల చేయడమేమిటి? ఐదేళ్లు ఎంవోయూ చేతిలో ఉన్నా ఏ మీడియాకు విడుదల చేయని షర్మిల.. అన్నకు రాసిన లేఖను మాత్రం టీడీపీ అధికారికంగా ఎలా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ లేఖ, ఆమె కాకుండా టీడీపీ అధికారికంగా ఎలా బయటపెడుతుంది. అంటే కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటేనని మీరే చెప్పినట్టు కాదా.? మీరు చేస్తున్నది ఏమిటి...? జగన్ సొంత లబ్ధి కోసం తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారంటున్నారే మరి మీరు చేస్తున్నదేమిటి. మీ లబ్ధి కోసం, మీరు మోస్తున్న చంద్రబాబు లబ్ధి కోసం సొంత అన్న బెయిల్‌ను రద్దు చేయించి జైలుకు పంపాలనుకోవడం లేదా? ఇందుకోసం మీరు మీ తల్లి విజయమ్మను వాడుకోవడం లేదా..? దీన్నేమనాలి? మీరేం త్యాగాలు చేశారు? వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడానికి మీ త్యాగాలు, కష్టమే కారణమా షర్మిల. మీరు పదేళ్లలో అన్న ఇచ్చిన రూ.200 కోట్లు తీసుకున్నారు. తండ్రి పంచి ఇచ్చిన ఆస్తులతో వ్యాపారాలు చేసుకున్నారు. అదేనా మీ త్యాగం? అన్నంటే ప్రాణం అంటూనే అన్న చేసిన సాయాన్ని మర్చిపోయి కుట్రలు చేయడమేనా మీ నైజం? మీరు సంపాదించుకున్న ఆస్తుల్లో జగన్ వాటా అడిగితే మీకెలా ఉంటుంది?. -
దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి: యాంకర్ రష్మి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.‘మైనర్‌పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్ చేసింది.ఆ వీడియోలో ఏముందంటే..రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి. నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో. ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ.. జానీ మాస్టర్ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్ చేస్తున్నారు. Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice Pls do not use this interview now and mislead audience This interview was taken way before 2020 Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024 -
నాలుగేళ్ల క్రితం నివాళి అర్పించా.. దయచేసి ఆమెను అవమానించొద్దు: అనసూయ కౌంటర్!
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది.తాజాగా అనసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు. దీనిపై అనసూయ రియాక్ట్ అయింది. ఇకపై దేనికి స్పందించకూడని నిర్ణయించుకున్నాని ఆమె తెలిపారు. కానీ.. మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అనసూయ ట్వీట్లో రాస్తూ. 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఈ ఈవెంట్లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేస్కోండి' అంటూ అతనికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hello Teju! Hope you are well!! I decided for my own peace not to react on anything mean.. but I have been seeing this particular bit of my performance giving a tribute to the Mahanati Savithramma for one of the festival events on a channel 4 years back.. using it in a very… https://t.co/u05s1L16oG— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 15, 2024 -
'గాడిద గుడ్డేం కాదు'.. నెటిజన్‌కు ఇచ్చిపడేసిన విశ్వక్ సేన్!
టాలీవుడ్ యంగ్ విశ్వక్ సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో అలరించాడు. ఇటీవల థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.అయితే విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ఉద్దేశించి ఓ నెటిజన్ ట్వీట్ చేసింది. ఈ మూవీ రైట్స్‌ను దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం రూ.8 కోట్లకే అమ్మినట్లు పోస్ట్ చేసింది. అది కూడా జీఎస్టీతో కలిపి అంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇది చూసిన విశ్వక్ సేన్ తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేశాడు.'గాడిద గుడ్డేం కాదు.. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్లో పెట్టొద్దు. మెకానికి రాకీ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎలాంటి విక్రయాలు జరగలేదు. మీరు కాస్తా వాస్తవాలను తెలుసుకోండి. ఇదంతా ఓ టీమ్ కెరీర్‌కు సంబంధించింది' అంటూ నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Donkey egg em kadhu . With gst anta 😂 tea shop muchatlu theeskochi tweeter lo pettodhu priyaji. #mechanicrocky was never sold yet ! Get facts right . Its teams career— VishwakSen (@VishwakSenActor) June 12, 2024 -
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేశాడు. టెన్నిస్‌బాల్‌తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్‌తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్‌తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్‌లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్‌కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
ప్రేమ పావురాలు సినిమాతో యువతరం మనసు దోచుకున్న భాగ్యశ్రీ గుర్తుందా. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్‌లో తెలుగులో ప్రభాస్ మూవీ రాధేశ్యామ్‌లో కూడా కనిపించింది. 2.3 మిలియన్ల ఫాలోయర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ రెసిపీలు, తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సింపుల్‌గా తయారు చేసుకునే వెజిటబుల్ సూప్ గురించి ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online)వెజిటబుల్ సూప్: క్యారట్, కాప్సికమ్, ఫ్రెంచ్బీన్స్, వెన్న, మైదా కార్న్ ఫ్లోర్, పాలు, చీజ్ సాయంతో సూప్ తయారు చేసింది. దీనికి కొద్దిగా పెప్పర్, చిల్లీ సాస్ యాడ్ చేసి చీజ్‌తో గార్నిష్ చేసింది.అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మైదా, మొక్కజొన్న పిండి, వెన్న ఆరోగ్యానికి మంచిది కాదని ఒకరు కమెంట్ చేశారు. అలాగే మైదాకు బదులుగా గోధుమ పిండి లేదా జొన్న పిండి లేదా రాగి పిండిని ఉపయోగిస్తే మంచిదని, మొక్కజొన్న పిండిని ఎవాయిడ్ చేయవచ్చు అని కూడా మరొకరు సూచించారు. -
స్టార్ హీరోయిన్ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
ఎవరైనా సెలబ్రిటీ మనకు ఎదురైతే చాలు. సెల్ఫీల కోసం ఎగబడే కాలం ఇది. ఇక పొరపాటున స్టార్స్ హీరోయిన్స్, హీరోలు కనపడితే ఇంక అంతే. సెల్పీ కోసం క్యూ కడతారు. అలాంటి ఈ రోజుల్లో ఓ డెలివరీ బాయ్ చేసిన పని నెట్టింట తెగ వైరలవుతోంది. అసలేం అతను ఏం చేశాడు? ఎందుకు అంతలా హాట్ టాపిక్‌గా మారిందో తెలుసుకుందాం.తాజాగా ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. దీంతో ఆమె అక్కడే వేచి ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతను తన పని పట్ల అంకితభావంతో ఉన్నాడంటూ మరొకరు రాసుకొచ్చారు. అతన్ని చూస్తుంటే సంతోషంగా ఉందంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. అతనికి కంపెనీ ప్రోత్సాహం ఇవ్వాలని కొందరు సూచించారు.ఆ తర్వాత తాప్సీ తన కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో తాప్సీ తన చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమావ విషయానికొస్తే ఖేల్ ఖేల్ మే, ఫిర్ అయి హసీన్ దిల్రుబాలో తాప్సీ కనిపించనుంది.Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂pic.twitter.com/8MM6RfDZ2V— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024 -
పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్‌లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్‌ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్‌కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
విజయ్ సింపతీ డైలాగులు.. నేనూ తెలంగాణ బిడ్డనే అన్న అనసూయ
గతేడాది విమానం చిత్రంతో అలరించిన అనసూయ.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ టాలీవుడ్లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనసూయ తనదైన స్టైల్లో స్పందించింది. మీకు, నాకు ఎలాంటి రిలేషన్ లేదంటూనే కాస్తా వ్యంగ్యంగానే ఇచ్చిపడేసింది. ఇంతకీ అసలేం జరిగింది? అనసూయ ఎందుకు రియాక్ట్ అయిందో మీరు కూడా చూసేయండి. అనసూయ తన ట్వీట్లో రాస్తూ.. 'ఎందుకు కార్తీక్ అస్తమానం నన్ను లాగుతారు. ఎవరు ఏం మాఫియా చేస్తున్నారో నేను ఎప్పుడో చెప్పి చెప్పి వదిలేశాను. అనవసరంగా నేనే హైప్ ఇస్తున్నానని మా వాళ్లు అంటుంటే నిజమేనేమో అని వదిలేశాను. నేను కూడా తెలంగాణ బిడ్డనే. కానీ నాకు సింపతి అక్కర్లేదు. నాకు నా మీద నమ్మకం. నా దేవుడి మీద నమ్మకం. మా అమ్మ, నాన్నలు నాకిచ్చిన విలువలు, పెంపకం నన్ను నా దృష్టిలో ఎప్పుడు దిగజారనివ్వవు. ఇప్పుడు ఈ ట్వీట్‌ను కూడా తమ స్వార్థానికి వాడుకున్న నేను ఆశ్చర్యపోను. కానీ నాకు, వాళ్లకి ఎటువంటి సంబంధం అప్పుడు లేదు.. ఇప్పుడు లేదు.. అన్నట్లు నాకు తెలిసి మీరు, నేను చుట్టాలం అస్సలు కాదండి. సో నేను నీకు ఆంటీ కానేమో.. అయినా ఒకసారి మీ ఇంట్లో అడగండి. మీకు తెలియకుండా ఏమైనా రిలేషన్స్ ఉన్నాయోమో?.. ఎందుకంటే నాకు చుట్టాలైతేనే ఆ పలకరింపులు ఉంటాయని మా పెద్దలు నేర్పించారు. ఏదేమైనా మీరు అంతా మంచే జరగాలి అండి.' అంటూ పోస్ట్ చేసింది. అసలేం జరిగిందేంటే.. తాజాగా ఓ నెటిజన్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అనసూయను ఆంటీ అని ప్రస్తావించాడు. ఇది చూసిన అనసూయ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయ, విజయ్ ఫ్యాన్స్‌కు కోల్డ్ వార్ కాగా.. గతంలో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి తనకు మధ్య జరిగిన ట్విటర్ వార్‌పై కూడా అనసూయ భరద్వాజ్ స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. గతంలో విమానం సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. నాకు పీఆర్ టీమ్ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా.. ట్వీట్స్ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నా.. అని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా.. గతంలోనే అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. Yenduku Karthik garu astamaanam nannu laagutaaru.. evaru em mafia chestunnaro nenu yeppudo cheppi cheppi odilesanu.. anavasaranga nene hype istunnanani na vaallu antunte nijamenemo ani odilesanu..nenu kuda telangana biddane.. kaani naaku sympathy akkarledu.. naku naa meeda… https://t.co/JhIdIBBM32 — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2024 -
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్‌టాపిక్‌గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్‌కు చెందిన రాయల్ ఓక్ వాచ్‌ను తన బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్‌తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్‌లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్‌లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్‌పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోన్న సాంగ్..ప్రముఖ వ్యాపారవేత్త ఫిదా!
ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు సంగీత ప్రియులకు పండగే. చిన్న జానపద పాటల నుంచి సినిమాల పాటల వరకు కనెక్ట్ అవుతారు. భాషతో సంబంధం లేకుండా కాలు కదిపేస్తారు. అలా గతంలో చాలా సాంగ్స్ సినీ ప్రేక్షకులను ఓ ఊపు ఉపేశాయి. తాజాగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ సాంగ్ నెటిజన్లకు పూనకాలు తెప్పిస్తోంది. ఎక్కడ చూసినా ఆ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సాంగ్‌కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 'గులాబీ షరారా' అనే ఉత్తరాఖండ్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రముఖ సింగర్ ఇందర్ ఆర్య రూపొందించిన మెలోడీ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంక సైతం ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోందని.. ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారంటూ రాసుకొచ్చారు. పాఠశాల పిల్లల నుంచి పెద్దల వరకు డ్యాన్స్ రీల్స్‌ను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. అయితే ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజై నాలుగు నెలలైనా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. Here it is my Daughter Adyaa Raj is practicing with the same song. pic.twitter.com/lcqiRstUgY — Raj Nayak (@RajNaya50858983) December 26, 2023 Sir such is the craze that my wife and sil(twin sisters) danced to it in Rishikesh. pic.twitter.com/vJSPZHaQ3H — Joy Sanyal,MD, DM, (@JoySanyal74) December 26, 2023 This Uttarakhandi song has gone viral. I hope you enjoy its beat as much as I do! pic.twitter.com/uEvMDvKTOE — Harsh Goenka (@hvgoenka) December 26, 2023 -
'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్‌తో చిట్ చాట్ నిర్వహించడం మన స్టార్ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్లో ముచ్చటించారు షారుక్. అయితే ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. కాగా.. హ్యాట్రిక్ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్‌తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp — Shah Rukh Khan (@iamsrk) December 6, 2023 -
నెటిజన్‌కు ఇచ్చిపడేసిన హీరోయిన్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో మంగళవారం మూవీ గురించే తెగ ట్రెండ్ అవుతోంది. ఆర్ఎక్స్100 పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే థియేటర్లలో రిలీజైన మంగళవారం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనకు తొలి ఛాన్స్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే ఆమె నటించింది. పాయల్ ప్రధాన రోల్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబరు 17న సినిమా థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోంది.(ఇది చదవండి: నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!)అయితే సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్‌పై రోజుకు ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్స్‌కు తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. మంగళవారం చిత్రంలోని ఓ సీన్ క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేసిన నెటిజన్ చాలా నీచంగా పోస్ట్ పెట్టాడు. ఆమె లో దుస్తులపై దారుణంగా కామెంట్స్ చేయడంతో దీనికి పాయల్ రియాక్ట్ అయింది. పాయల్ రాజ్‌పుత్ ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటరిచ్చింది. అది నాది కాదు.. ప్రొడక్షన్ హౌస్ వాళ్లు ఇచ్చింది' తనదైన శైలిలో బుద్ది చెప్పింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తున్నారు. -
బ్లూ దోస వీడియో వైరల్: నెటిజన్లు మాత్రం..!
Blue Pea Dosa దక్షిణ భారత వంటకాలు అందులోనూ దోస అంటే నోరు ఊరనిది ఎవరికి. పళ్లు లేని వారుకూడా నమల గలిగేలా మెత్తగా దూదపింజ లాంటి దోస మొదలు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే. ఇక దీనికి సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. గతంలో బ్లూ రైస్ వీడియోకూడా వార్తల్లో నిలిచింది. ఇపుడు బ్లూ పీ దోస అన్నమాట. జ్యోతీస్ కిచెన్ అనే ఇన్స్టాగ్రామ్ రీల్లో బ్లూ పీ దోస ఇపుడు నట్టింట వైరల్‌గా మారింది. నీలి రంగు అపరాజిత పూలను ఉడికించిన నీళ్లలో దోస పిండి కలిపి దోస తయారీ అవుతోంది. ముఖ్యంగా చక్కటి నీలి రంగులో నోరూరించే దోస రడీ కావడం విశేషంగా నిలిచింది. ఇప్పటి 10 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ దోస వీడియోపై Instagram యూజర్లు మిశ్రమంగా స్పందించారు. వావ్ చాలా అద్భుతంగా ఉంది.. బ్యూటిఫుల్ కలర్ అని కొంతమంది కమెంట్ చేశారు. అవును.. శంఖు పూలు ఎడిబుల్.. ఈ పూలతో చేసిన టీ చాలా బావుంటుంది అంటూ ఒక యూజర్ కమెంట్ చేశారు. మరికొంతమంది మాత్రం అరే ఎందుకురా..అందమైన దోసను ఇలా పాడు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమందయితే విచిత్రమైన దోసలతో పాపులరైన మరోఫుడ్ బ్లాగర్కి ట్యాగ్ చేశారు. రివ్యూ చే బ్రో... ఎక్కడున్నావ్..లాంటి ఫన్నీ కామెంట్లు కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by jyotiz kitchen (@jyotiz_kitchen) -
ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై!
దేశరాజధాని ఢిల్లీలోని ఒక స్ట్రీట్ వెండర్ ఆమ్లెట్ ఛాలెంజ్ చేస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నాడు. తన ఛాలెంజ్‌లో గెలిస్తే భారీగా నగదు గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. తాను చేసిన అతిపెద్ద ఆమ్లెట్‌ను 30 నిముషాల్లో తింటే ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెబుతున్నాడు. రాజీవ్ భాయ్ అనే ఈ స్ట్రీట్ వెండర్ భారీ మోతాదులో వెన్న, 31కి పైగా గుడ్లు, కబాబ్, మిక్స్ వెజ్ మొదలైనవన్నీ కలిపి భారీ ఆమ్లెట్ తయారు చేస్తున్నాడు. ఫిట్నెస్ను అమితంగా ఇష్టపడే భరజాత్య ఈ భారీ ఆమ్లెట్కు చెందిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో వేడిపెనంపై వెన్నను కరిగిస్తూ, ఇతర దినుసులు జతచేస్తూ, ఆమ్లెట్ తయారు చేయడాన్ని చూడవచ్చు. ఆమ్లెట్ పూర్తికాగానే దానిపై కూరగాయల ముక్కలు, పన్నీర్ మొదలైనవాటితో టాపింగ్ చేయడాన్ని గమనించవచ్చు. ఈ ఆమ్లెట్ ధర 1,320. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే అనారోగ్యం బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చూడండి: కర్నాటకలో మహిష దసరా వివాదం ఏమిటి? 450g butter, 31 whole eggs, 50g cheese, 100g seekh kebab and 200g paneer. Approximately 3,575 mg of cholesterol in total. Nahi chahiye bhai tere 1 lakh. 👍🏻 pic.twitter.com/wfhayx7UGn — Chirag Barjatya (@chiragbarjatyaa) October 10, 2023 -
ఎంత కావాలో చెప్పు అంటూ.. సింగర్ చిన్మయిపై వల్గర్ కామెంట్
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్‌గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్‌గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు. కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు) దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్‌లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ 'మాధవి లత'. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మహేష్ బాబు మూవీ అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది. అయితే రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. (ఇది చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్!) అయితే ఇప్పటివరకు మాధవి లత ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఆమె పెళ్లి గురించి నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె షేర్ చేసిన వీడియోల్లో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైనశైలిలో ఇచ్చిపడేసింది. ఫేస్బుక్లో ఓ నెటిజన్ చేసిన కామెంట్స్‌కు బాధపడిన మాధవిలత తన పెళ్లి గురించి ఘాటుగానే బదులిచ్చింది. మాధవిలత మాట్లాడుతూ..'పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా? పెళ్లి చేసుకోని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా? పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా? మీ మాటలు చూస్తే.. పెళ్లి చేసుకోలేదంటే నాకు ఆత్మాభిమానం ఉన్నట్టే కదా? మీరు ఎలా ఉన్నారంటే.. పెళ్లి చేసుకోని వారంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? పీఎం మోదీ, యూపీ సీఎం యోగి, వివేకానంద, అబ్దుల్ కలాం వీరంతా పెళ్లి చేసుకోకుండానే గొప్పోళ్లు అయ్యారు కదా? అయితే నాకు పెళ్లి కానందు వల్ల మీరంతా ఫీలవుతున్నారా? అయితే మీరే నాకు పెళ్లి చేయండి' అంటూ వీడియోలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవిలత షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll sanathani ll BJP Women ll Serve NGO ll (@actressmaadhavi) -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్‌తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్‌లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్‌తో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్‌లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్‌లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్‌తేజ్‌తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్‌తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూ అప్పుడప్పుడు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ అంటూ నెటిజన్స్‌తో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా చిట్ చాట్ నిర్వహించింది ముద్దుగుమ్మ. ఈ చిట్ చాట్‌లో నెటిజన్స్ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. హద్దులు మీరి ప్రశ్నలు వేస్తుంటారు. అలా ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటరిచ్చింది శృతిహాసన్. కొందరు నెటిజన్స్ చిన్నప్పటి ఫోటో పెట్టమని అడగ్గా.. మరొకరు ఎర్ర డ్రెస్సులో ఉన్న ఫోటో.. అలాగే బాయ్ ఫ్రెండ్ శంతన హజారికాతో ఉన్న ఫోటో పెట్టమని అడిగారు. అలా అన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రుతి హాసన్‌కు.. ఓ నెటిజన్ చాలా వింత ప్రశ్నవేశాడు. నీ పాదాల ఫోటో పెట్టు పెట్టు అని అడిగాడు. అయితే అతనికి శృతి తనదైన శైలిలోనే స్పందించింది. ఏదో ఒక ఏలియన్‌ను పోలిన పాదాల ఫోటోను పెట్టింది. దీంతో నెటిజన్‌కు వింత ప్రశ్నకు తగిన బుద్ది చెప్పింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు బై అంటూ కామెంట్ చేసింది. మొత్తానికి ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. -
భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్
హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆకట్టుకునే కళ్లతో పాటు అంద,చందాలతో తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రభస', 'డైనమైట్', ‘అత్తారింటికి దారేది’లాంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘భీమన అమావాస్య’సందర్భంగా అనవాయితీ ప్రకారం నా భర్తకు పాదపూజ చేశాను. ప్రతి ఏడాది ఇలానే చేస్తాను. ఆ ఫోటోలను షేర్ చేసినందుకు గతంలో కూడా నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా నన్ను ట్రోల్ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యంలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడ (జూలై - ఆగస్టు)లో చంద్రుడు లేని రోజు (అమావాస్) నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తలు మరియు సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా అంటారు. తుళునాడుకు ఇది పెద్ద పండగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్!
ప్రపంచంలో నేరాలు చేసేందుకు నేరస్తులు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. కొందరు నేరస్తులు ఫోనులో బెదిరిస్తే, మరికొందరు నేరం చేసేముందు ఏదో ఒక సూచన చేస్తారు. అయితే ఇటీవల ఒక మహిళకు ఎదురైన అనుభవం ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన ఈ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్ మాధ్యమంలో అందరికీ తెలియజేసింది. ఆ మహిళ తన అనుభవాన్ని ఎఫ్బీలో తెలియజేస్తూ..‘కొద్దిరోజుల క్రితం మా ఇంటి లెటర్ బాక్స్‌పై ఎరుపు రంగు గుర్తులు కనిపించాయి. మరోమారు కూడా ఇంటి సైడ్ గేట్ దగ్గర మళ్లీ ఇటువంటి గుర్తులే కనిపించాయి. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి రెండవ గేటు తెరచివుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. దీనిపై నాలో ఆందోళన మొదలయ్యింది. ఆ గేటు కొంచెం కష్టంమీద తెరవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గాలి కారణంగానే ఆ గేటు తెరుచుకుని ఉంటుందని భావిస్తున్నాను. ఎవరి ఇంటి దగ్గరైనా ఇటువంటి చిహ్నాలు కనిపించాయా? ఎవరికైనా ఇటువంటి అనుభవం ఎదురయ్యిందా?’ అని ఆమె నెటిజన్లను ప్రశ్నించింది. సదరు మహిళ ఈ పోస్టు విషయంలో ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీనిని స్పందించిన ఒక యూజర్ ‘మీ ఇంటిలోని కుక్కలను తీసుకుపోయేందుకు ఎవరో దొంగ ఈ చిహ్నాలు వేశాడని’ రాశారు. ఇటువంటి గుర్తులను కుక్కలను ఎత్తుకుపోయేవారు వేస్తుంటారని విన్నానని, మీ కుక్కలను జాగ్రత్తగా కోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు. కొంతమంది యూజర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని, గేటుకు తాళం వేయాలని సలహా ఇచ్చారు. కాగా ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న గుర్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఫొటోపై నాలుగు ఎర్రని సమాంతర రేఖలు ఉండగా, మరో ఫొటోపై ఎన్టీ ఆని రాసివుంది. మరో ఫొటోపై ఎస్ అని రాసి వుంది. దీనికి స్పందించిన ఒక యూజర్ ఎన్టీ అంటే ‘నో థ్రెట్’ ఎస్ అంటే సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
రెస్టారెంట్లో ఖరీదైన వాటర్ బాటిల్ అంటగట్టారని.. ‘పైసా వసూల్’ పనిచేసి..
ఖరీదైన రెస్టారెంట్లలో బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. అటువంటి సందర్భాల్లో కాస్త నిట్టూరుస్తూనే బిల్లు చెల్లిస్తుంటాం. తాజాగా ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్ రితికా బోరా రెస్టారెంట్లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఆమె రెస్టారెంట్లో వాటర్ బాటిల్‌కు ఆర్డర్ చేయగా, దానికి ఆమె భారీగా బిల్లు చెల్లించాల్సి వచ్చింది. తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసిన ఆమె క్యాప్షన్‌లో ‘మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఈ ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు స్నేహితురాలితో పాటు వెళ్లాను. అక్కడ వాటర్ బాటిల్‌కు రూ.350 చెల్లించాల్సి వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అందుకే ఆ బాటిల్‌ను నాతో పాటు ఇంటికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దీనిని తిరిగి వినియోగించవచ్చని భావించాను. ఈ విధంగా నేను మాత్రమే చేస్తున్నానా? మీరు కూడా చేస్తారా?’ అని అమె ప్రశ్నించింది. Met up with a friend at this fancy restaurant for lunch, and you won't believe they charged 350 rps for a bottle of water! So, I decided to bring the bottle home with me so that I can reuse it. Is it only me or u have done this too? pic.twitter.com/AecGPLuoV8 — Ritika Borah (@coach_ritika) July 10, 2023 ఎక్కడైనా వాటర్ బాటిల్ రూ. 20కి లభ్యమవుతుంది. అయితే ఈ రెస్టారెంట్లో ఏకంగా వాటర్‌బాటిల్‌కు రూ. 350 చెల్లించాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. రితికా బోరా పోస్టును చూసిన పలువరు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమకు రెస్టారెంట్లలో ఎదురైన అనుభవాలను తెలియజేయగా, మరికొందు ‘పైసా వసూల్’ పని చేశారంటూ మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
టీడీపీ చీప్ ట్రిక్స్.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏ క్రైమ్ జరిగినా వైఎస్సార్సీపీ మీద నెట్టేయడమే పనిగా పచ్చ మీడియా, ప్రతిపక్షాలు పెట్టుకున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ తీరును ఎండగడుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలపై మండిపడుతున్నారు. ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు క్షీణించిపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఏదో విధంగా బురద చల్లాలనే ఉద్దేశంతో కుట్రలకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ తీరుపై నెటిజన్లు వ్యగ్యంగా పోస్టులు పెడుతూ దుమ్మెతిపోస్తున్నారు.. ►కర్నూలులో కుక్క కరిచి వ్యక్తికి గాయాలు.. ఆ కుక్క వైసీపీ నాయకుడిది అని అనుమానం.. ►నంద్యాలలో నాలుగు పచ్చని చెట్లను నరికేసిన వ్యక్తులు.. ఆ వ్యక్తులు వైసీపీ వారిగా అనుమానం.. ►చిత్తూరు అత్తను చంపిన అల్లుడు.. అల్లుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►కడపలో ఒకే కాన్పులో నలుగురు కవలను జన్మనిచ్చిన టీడీపీ నేత.. ఇది వైసీపీ నాయకుల కుట్రగా అనుమానం.. ►గుంటూరులో ఓ అమ్మాయిని లేపుకెళ్లిన యువకుడు.. ఆ యువకుడు వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►ఒంగోలులో బర్రెను ఢీకొన్న లారీ.. లారీ ఓనర్ వైసీపీ వ్యక్తిగా అనుమానం.. ►నెల్లూరులో ఓ ఇంట్లో దొంగతానికీ పాల్పడ్డ దొంగలు.. దొంగలు వైసీపీ వారిగా అనుమానం.. ►విజయవాడలో కొట్టుకున్న రౌడీమూకలు.. వైసీపీ మూకలుగా అనుమానం.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. తెలుగుదేశం, జనసేన రకరకాల కుట్రలు చేస్తున్నాయి. ఎక్కడ లేని క్రైం అంతా ఏపీలోనే జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా.. ఏది జరగకపోయినా.. దాన్ని అధికార పార్టీపై రుద్ది రాజకీయ లబ్ది పొందాలన్నది టీడీపీ కుట్రగా మారింది. ఏ క్రైం జరిగినా.. దానికి వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. చదవండి: నిసిగ్గుగా చందబ్రాబు, లోకేష్ శవ రాజకీయాలు.. ఇదీ అసలు వాస్తవం.. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మృతిపై టీడీపీ శవ రాజకీయాలకు తెరలేపింది. ఆ యువకుడి మృతికి వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆత్మహత్యకు లింకు పెట్టే కుట్రకు బీజం వేశారు. ఒక వ్యక్తి బాధతో, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేయడానికి ఏకంగా చంద్రబాబు, లోకేష్ రంగంలోకి దిగారు. -
మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!
తమిళసినిమా: ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రుతీహాసన్. ఈమె జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పవచ్చు. విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలు అయిన ఈమె హిందీ చిత్రంతో కథానాయకిగా నట జీవితాన్ని ప్రారంభించి ఆపై తెలుగు, తమిళం అంటూ తన స్థాయిని విస్తరించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తెలుగులో శ్రుతీహాసన్ లక్కీ హీరోయిన్. దాదాపు అక్కడ సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్‌కు జంటగా సలార్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలో తిరిగి రావడానికి ముస్తాబవుతుంది. కాగా శ్రుతీహాసన్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. పండ్లు ఉన్న చెట్టుకే దెబ్బలు అన్ని సామెత మాదిరి శ్రుతీహాసన్ సినీ వ్యక్తిగత జీవితాల గురించి ఎవరికీ తోచింది వారు రాస్తుంటారు. ప్రచారం చేస్తుంటారు. (చదవండి: కోలీవుడ్ సూపర్‌స్టార్ ఎవరు?) ఇవి కూడా ఎవరూ ఎలాంటి ప్రశ్న వేసినా చాలా బోల్డ్‌గా బదులిస్తుంటారు తన బాయ్‌ఫ్రెండ్‌తో కూడా బహిరంగంగా తిరిగే నటి శ్రుతీహాసన్. ఎందుకంటే ఈమె పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. తమ తల్లిదండ్రులు తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని, అలాగని వారికి గౌరవానికి తలవంపులు తెచ్చే ఎలాంటి పనిని తాను చేయనని చెబుతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తరుచూ అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటించే శ్రుతీహాసన్ ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చి వారిని ఖుషీ చేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని మీరు మద్యం తాగుతారా? అన్న ప్రశ్న లేదు తాను మద్యం తాగాను, మాదకద్రవ్యాలు కూడా తీసుకోను అంటూ బదులిచ్చారు. అంతేకాకుండా తాను జీవితాన్ని హుందాగా గడిపే నటినని స్పష్టం చేసింది. దటీజ్ శ్రుతిహాసన్ అని మరోసారి నిరూపించుకున్నారు. -
పబ్లిక్‌లో ఇలాంటి పనులా?.. నటిపై నెటిజన్స్ ట్రోల్స్
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. శ్రీనగర్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ ముంబయి విమానాశ్రయంలో హల్చల్ చేసింది. సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) హీనా ఖాన్ బాలీవుడ్ బుల్లితెర నటిగా ఫేమ్ తెచ్చుకుంది. యే రిష్తా క్యా కెహ్లతా హైలో అక్షరా, కసౌతి జిందగీ కే 2లో కొమొలికా పాత్రలో ఆమెకు గుర్తింపు దక్కింది. ఖత్రోన్ కీ కిలాడీ, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోస్‌లో రన్నరప్‌గా నిలిచింది. #HinaKhan spotted at Mumbai Airport Rocky came to pick her 🧿💕❤️ @eyehinakhan @JJROCKXX #HiRo #HinaKhan #rRockyJaiswal #NachBaliye #NachBaliye10 #CoupleGoals #Couple #Love #Mumbai #Airport #MumbaiAirport #AirportFashion #Bollywood #BollywoodActress pic.twitter.com/hgECADd84t — hina_khanfc (@Mohamme37896951) May 24, 2023 -
ఆ డ్రెస్ ఆవుపేడతో తయారు చేశారా? నటిపై విమర్శలు
విభిన్నమైన దుస్తులు ధరిస్తూ వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. హిందీలో ఓ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉర్ఫీ.. బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమస్ అయింది. ఆ తర్వాత విచిత్రమైన డ్రెస్సులు ధరిస్తూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. ముంబైలో ఉర్ఫీ ఏ ప్రాంతానికి వెళ్లినా కెమెరాల కన్ను ఆమె వైపు తిరుగుతాయి. దానికి కారణం ఆమె ధరించిన డ్రెస్సే. ఒంటి నిండా దుస్తులు ధరించడం ఆమెకు అస్సలు నచ్చదు. తాజాగా ఉర్ఫీ ధరించిన డ్రెస్ ఒక్కటి నెట్టింట వైరల్ అవుతోంది. చెట్టు బెరడుతో తయారు చేసిన డ్రెస్ వేసుకొని ఫోటో షూట్ చేసింది ఉర్ఫీ. ఈ అవుట్‌ఫిట్ తయారు చేసే క్రమంలో ఏ చెట్టుకు హానీ కలగలేదని చెప్పింది. ఉర్ఫీ తాజా ఫోటోలపై నెటిజన్స్ స్పందిస్తూ.. ‘నువ్వు ధరించిన ఆ డ్రెస్ ఆవు పేడతో తయారు చేసినట్లు ఉంది. ప్రతిదీ ట్రెండ్ అవుతుందని ఊహించుకోకు’ అని విమర్శిస్తున్నారు. (చదవండి: రాత్రికి రాత్రే రూ. 40కోట్లు నష్టపోయాను: కంగనా రనౌత్) గతంలోనూ ఉర్ఫీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఓ సారి నెమలి డ్రెస్ అంటూ నెమలి డ్రెస్ అంటూ అర్ధనగ్నంగా ఫోటోలకు పోజులు ఇచ్చింది. అలాగే ఓ సారి చూయింగ్ డ్రెస్ అంటూ నమిలి ఊసిన చూయింగ్ గమ్‌లను శరీరానికి అంటించుకొని ఫోటో షూట్ చేసింది. ఇలా ఫ్యాషన్ పేరుతో ఒక్కోసారి ఒక్కో వెరైటీ దుస్తులు ధరిస్తూ పరువు తీస్తుందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Uorfi (@urf7i) -
షారుక్ ఖాన్‌పై నెటిజన్స్ ఫైర్!
-
టీజర్ తో షాక్ ఇచ్చిన నరేష్,పవిత్ర.. రియల్ కథనే సినిమాగా మళ్ళీపెళ్లి..
-
ముందు తిన్నగా ఆడటం నేర్చుకో...తర్వాత ప్రయోగాలు చేద్దువు
-
సమంత సింపతీ డ్రామా....?
-
'మళ్లీ శోభనం' ఎప్పుడు రిలీజ్?.. టీజర్‌పై నెటిజన్స్ దారుణ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ టీజర్లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్ నెటిజన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్‌గా మారింది. అయితే ఈ టీజర్‌పై కొందరు నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'మళ్లీ … శోభనం' !! ఎప్పుడు రిలీజ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్! 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను' 'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు' 'బతుకుజట్కాబండి, ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్' 'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు' 'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.' 'మళ్లీ … శోభనం !! ఎప్పుడు రిలీజ్' -
నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఖాతాల బ్లూటిక్ మాయం కావడంతో ప్రముఖులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా వెరిఫికేషన్ ఫీజు చెల్లించిన తరువాత కూడా బ్లూటిక్ మాయం కావడంతో ఒకింత అవమానంగా భావించారు. అంతేకాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలంతా ట్విటర్ చర్యతో షాక్ అవుతున్నారు. దీంతో మా బ్లూటిక్ మాకు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) హే ట్విటర్! మీరు వింటున్నారా?సబ్స్క్రిప్షన్ సేవ కోసం చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందుండే బ్లూటిక్‌ను తిరిగి ఇచ్చేయండి. తద్వారా నేనే అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. కాళ్లపై పడాలా? అంటూ బిగ్‌బీ ఫన్నీగా ట్విట్ చేశారు. దీంతో యూజర్లు ఫన్నీ రిప్లైలను పోస్ట్ చేసారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) " సహనం ఉంటేనే బ్లూ టిక్’’ అని ఒకరు, మూడు నాలుగురోజులు ఆగండి అని ఇంకొకరు కామెంట్ చేశారు. మిస్టర్ బచ్చన్, మస్క్ విదేశీయుడు, ఎవరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇంకొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు "బచ్చన్ సాహెబ్ ఉ అంగ్రేజ్ హో కేహు కా నహీ సునత్ హో, అంటూ బిగ్‌బీ స్టయిల్లోనే మరొకరు సమాధానం ఇచ్చారు. అలాగే నటి ఖుష్బూ కూడా తాను సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ట్విటర్ బ్లూటిక్ పోయిందని ట్వీట్ చేశారు. T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ?? — Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023 My account says subscription will end on 17th March 2024, yet it says canceled. I have paid for a year. Why does it stand canceled @TwitterBlue ??? pic.twitter.com/1BZpOm10aY — KhushbuSundar (@khushsundar) April 21, 2023 సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్లు, వార్తా సంస్థలు ఇలా ఏ ఖాతానూ మస్క్ వదిలిపెట్టలేదు. బాలీవుడ్ స్టార్లు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, నటుడు ప్రకాశ్ రాజ్, టాలీవుడ్ హీరో చిరంజీవితోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖాతాల్లో బ్లూటిక్ ఎగిరిపోయింది. అలాగే హీరోయిన్లు సమంత, అలియా భట్ లతో పాటు రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యూపీ యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలు మీడియా సంస్థలు కూడా బ్లూటిక్‌ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. As of now, this is my blue tick verification! 😬 https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2 — Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023 -
మయాంక్ అగర్వాల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
చెప్పిందే చేశా: డోజీ లోగోపై మస్క్ వివరణ, నెటిజన్ల మీమ్స్ వైరల్
సాక్షి, ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ అనూహ్యంగా లోగోను మార్చడం పెద్ద దుమారాన్ని లేపింది. ట్విటర్‌కు ఇప్పటిదాకా ఉన్న బ్లూ బర్డ్ లోగోను స్థానంలో అకస్మాత్తుగా వచ్చిన ‘డోజీ ’ లోగోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరోవైపు లోగో ఇలా మార్చాడో లేదో మస్క్ మద్దతున్న క్రిప్టో కరెన్సీ Dogecoin దాదాపు 30 శాతం పెరిగింది. దీంతో ట్విటర్లో నాన్‌స్టాప్ మీమ్స్‌తో సందడి చేశారు. ఇది ఇలా ఉంటే క్లాసిక్ బర్డ్లోగోమార్చడంపై ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాగ్దానం చేసినట్టుగానే అంటూ ఈ సందర్బంగా 2022, మార్చి 26 నాటి పాత చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. అందులో ఓ యూజర్ ట్విటర్ బర్డ్ లోగోను డాగ్ గా మార్చాలని అడగడాన్ని మనం గమనించావచ్చు. ఈ క్రమంలో అప్పుడు చెప్పినట్టు ట్విటర్ లోగోను మార్చినట్టు చెప్పాడు. అంతేకాదు పనిలో పనిగా ఇక ఆపండి అబ్బాయిలూ అంటూ మీడియాపై సెటైర్లు కూడా వేశాడు. అయితే ఈ లోగో శాశ్వతంగా ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. As promised pic.twitter.com/Jc1TnAqxAV — Elon Musk (@elonmusk) April 3, 2023 టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో అయినఎలాన్ మస్క్ గత ఏడాది నవంబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేశాడు. కొత్త బాస్‌గా ట్విటర్.2లో అనేక కీలక మార్పులతో వార్తల్లో నిలిచాడు మస్క్. సీఈవో సహా ఇతర కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగింపు మొదలు, ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజు దాకా ప్రతీ మార్పుతో తనదైన శైలిని చాటుకుంటున్నాడు మస్క్. జపాన్ జాతికి చెందిన ‘షిబా ఇనూ’ అనే కుక్క ఫొటోనే డోజీగా పిలుస్తుంటారు. 2013 లో మొదటి సారి డోజీకాయిన్ క్రిప్టో కరెన్సీకి డోజీని లోగోగా క్రియేట్ చే'సిన సంగతి తెలిసిందే. Twitter logo be like 💢#TwitterLogo #DOGE #Twitter #ElonMusk #Dogecoin #DogecoinToTheMoon #Memes pic.twitter.com/smS3uoeWwM — Vinny Bhardwaj (@vinnybhardwaj_) April 4, 2023 I wish the media would stop flattering me all time … it’s a bit much guys ☺️ — Elon Musk (@elonmusk) April 3, 2023 -
Viral Video: రైల్వే స్టేషన్లో యువతి బిత్తర స్టెప్పులు.. అయినా 10 లక్షల వ్యూస్!
సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరూ చూసినా ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, స్నాప్చాట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్‌తో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యేందకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అర్థవంతమైన, ప్రజలకు అవసరమైన కంటెంట్‌ను అందించి ఫేమస్ అవుతుంటే మరికొందరు జనాల దృష్టిని ఆకర్షించేందకు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చిచేష్టలు, అర్థంపర్థం లేని డ్యాన్స్‌లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి కోవకు సంబంధించిన ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సీమా కనోజియా అనే యువతి రైల్వే స్టేషన్లో డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇందులో యువతి రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యరాయ్ నటించిన ‘ఆ అబ్ లౌత్ చలే’ సినిమాలోని ‘మేరా దిల్ తేరా దీవానా’ అనే పాటకు పిచ్చిపిచ్చిగా డ్యాన్స్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లో పాటకు సంబంధం లేకుండా ఆమె వేసిన స్టెప్పులు ఎవరిని ఆకట్టులేకపోకపోయాయి. అయినా యువతి అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా డ్యాన్స్ చేయడం కొసమెరుపు. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని ఇప్పటికే 10 లక్షల మంది వీక్షించారు. యువతి బిత్తర స్టెప్పులపై నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఆమె డ్యాన్స్‌ను ట్రోల్చేస్తున్నారు. మరికొందరు ఇతరులకు ఇబ్బంది కలిస్తున్న ఈమెలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదికాగా సదరు యువతికి ఇన్‌స్టాలో 3లక్షలకు పైగా ష్యాన్స్ ఫాలోయింగ్ ఉండటం గమనార్హం. అయితే యువతి ఇలాంటి వీడియోలు పెట్టడం ఇదేం తొలిసారి కాదు, లోకల్ రైలు, రోడ్డు ఎలా ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) View this post on Instagram A post shared by Seema Kanojiya (@seemakanojiya87) -
సరిహద్దుల్లో బాగానే ఎదుర్కొంటున్నాం కానీ, మన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా..
సరిహద్దుల్లో బాగానే ఎదుర్కొంటున్నాం కానీ, మన ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేద్సార్! -
ప్రధాని మోదీకి జైకొడుతున్న చైనా నెటిజన్లు.. అమెరికా మ్యాగజైన్ వెల్లడి
బీజింగ్: భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ప్రధాని మోదీకి మాత్రం చైనాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు! ముఖ్యంగా నెటిజన్లయితే మోదీ పట్ల ఫిదా అవుతున్నారు. ‘మోదీ లావోగ్జియన్’ (మోదీ చిరంజీవి) అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఒక విదేశీ నేత పట్ల చైనీయులు ఇంతటి గౌరవాదరాలు చూపడం అరుదు. ‘మోదీ అద్భుతమైన నాయకుడు. విభిన్నంగా ఆలోచిస్తారు. భారత్‌ను చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ చైనా సోషల్ సైట్ సినావెబోలో నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారని అమెరికా మ్యాగజైన్ ది డిప్లొమేట్ పేర్కొంది. సినా వెబోకు 58 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు. -
అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్..నెటిజన్స్ ఫైర్
సినిమా నటులకు జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వాళ్లు ఏదైనా మంచి చేస్తే భారీ స్థాయిలో ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఏదైనా తప్పు చేస్తే కూడా అదే స్థాయిలో ట్రోల్స్ చేస్తారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్‌కి వెళ్తే నడక నుంచి మాట వరకు ప్రతీది జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ చిన్న తప్పు చేసినా నెటిజన్స్ ఆడేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ భూమి ఫెడ్నేకర్ తన అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకొని వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భూమి ఫెడ్నేకర్ తాజాగా ఓ ఈవెంట్‌కి వెళ్లింది. అక్కడ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. ఆ సమయంలో అతిథులంతా స్టేజ్ ఎక్కారు. పక్కనే నిలబడి ఉన్న భూమిని కూడా స్టేజ్‌పై రావాలని పిలిచారు. దీంతో ఆమె చెప్పులు విప్పి అక్కడికి వెళ్లాలనుకుంది. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా కాలికి ఉన్న చెప్పులు తీయలేకపోయింది. దీంతో పక్కకు వచ్చి అసిస్టెంట్‌కి సైగ చేయగా..అతను వచ్చి సహాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్ పైకి వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది. అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ‘టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ, బాలా, బధాయి దో’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది భూమి ఫెడ్నేకర్. . మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ద్వారానే భూమి టాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. -
యంగ్ నటిపై దారుణమైన ట్రోల్స్.. చివరికి ఏం చేసిందంటే?
బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేత తివారీ ముద్దుల కూతురు పాలక్ తివారి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకున్నారు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాలక్ తివారీ తాజాగా ఇన్‌స్టాలో కాస్తా బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. ఇవీ చూసిన కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరేమో మీరు చాలా అందంగా ఉన్నారంటూ పోస్ట్ చేయగా.. మరికొందరు మాత్రం చాలా దారుణంగా కామెంట్స్ పెట్టారు. దీంతో నెటిజన్స్ చేసిన పనికి పాలక్ తివారీ కొపమొచ్చింది. వెంటనే కామెంట్స్‌ను ఆఫ్ చేసేసింది. విషయమేమిటంటే పాలక్ తివారీ తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరలయ్యాయి. వాటిని చూసిన కొందరు యూజర్లు అందంగా ఉన్నావంటూ పొగడగా.. మరికొందరు మాత్రం దారుణంగా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె కొంతసేపటికే కామెంట్స్‌ను ఆఫ్ చేసింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాగా.. బిజ్లీ బిజ్లీ మ్యూజిక్ వీడియోతో ఫేమ్ సంపాదించకుంది పాలక్ తివారీ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
వీధి కుక్కల ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, యాంకర్ ఘాటు రిప్లై..
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీ అయింది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేయడమే కాదుసమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. బెసిగ్గా రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. మూగ జీవాలను హింసించిన సంఘటనలపై తరచూ ఆమె సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల హైదరబాద్‌లో జరిగిన వీధి కుక్కల దాడి ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూనే కుక్కలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలంటూ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు! కొందరు ఆమె అభిప్రాయానికి మద్దతు ఇస్తుంటే మరికొందరు తప్పు బడుతున్నారు. ఈ క్రమంలో రష్మీని దారుణంగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా ఓ నెటిజన్ అయితే రష్మీని కుక్కతో పోల్చాడు. ‘ఈ కుక్క రష్మీని.. కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని ఆమె ట్వీట్‌పై కామెంట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన రష్మీ అతడితో వార్‌కు దిగింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు. నేనే వచ్చి నిన్ను కలుస్తా. ఎలా కొడతావో నేను చూస్తా. నీకు ఇదే నా చాలెంజ్’’ అంటూ అతడికి సవాలు విసిరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Sure Pls share your address I'll come personally Let's see how you can handle the situation then It's an open challenge https://t.co/SMhAIhWWY4 — rashmi gautam (@rashmigautam27) February 24, 2023 -
ఆ వీడియో ఇలాంటి టైంలో షేర్ చేస్తారా?.. యంగ్ డైరెక్టర్‌పై నెటిజన్ ఫైర్!
హైదరాబాద్‌లో బాలుడిని వీధికుక్కలు చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నగరంలోని అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యోపాపం అనకుండా ఉండలేరు. అలాగే ఈ ఘటనపై టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ క్రమంలోనే ఆ వీడియోను తన ట్విటర్లో షేర్ చేశాడు. ఇది చూసిన ఓ నెటిజన్ యంగ్ డైరెక్టర్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం మెుదలైంది. ఆ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం ఆ నెటిజన్‌కు గట్టి కౌంటరే ఇచ్చాడు. ఓ జర్నలిస్టు షేర్ చేసిన ఈ వీడియోను పంచుకున్నారు సాయిరాజేష్. దీంతో ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి వీడియోలను ఎలా షేర్ చేస్తారు. నువ్వు అసలు మనిషివేనా. చాలా సున్నితమైన ప్రజలు కూడా ఉంటారు. ఇలాంటి వీడియోలు షేర్ చెయ్యడం తప్పు.' అని ఆ నెటిజన్ ఫైర్ అయ్యాడు. డైరెక్టర్ రాజేశ్‌కు కోపం తెప్పించింది. నువ్వు సెన్సిటివ్ అయితే సమాజంలో కనిపించకుండా ఇంట్లో కూర్చో అంటూ ఘాటుగా స్పందించాడు. అయితే కొందరేమో సాయిరాజేశ్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆ నెటిజన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా.. డైరెక్టర్ సాయి కొబ్బరి మట్ట, కలర్ ఫోటో, హృదయకాలేయం లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. For people who cannot see such things please unselect this setting instead of making noise pic.twitter.com/7bLoSaArrc — Atom (@Gautam54938900) February 21, 2023 -
కొత్త సీఈవో అంటూ మస్క్ ట్వీట్: ‘ఇక ఇదే ఆఖరు’ చెత్త ఫోటోలపై యూజర్లు ఫైర్
న్యూఢిల్లీ: బిలియనీర్ ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కొత్త సీఈవో అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క ఫోల్కి ఫోటోను పోస్ట్ చేసి 'న్యూ సీఈఓ ఆఫ్ ట్విటర్' అని పేర్కొన్నారు. అంతేకాదు ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్ , నెంబర్లలోనూ ఇదే బెటర్.. స్టయిల్ కూడా అదిరింది అంటూ పరోక్షంగా మాజీ సీఈవో అగర్వాల్‌ను అవమానించేలా వరుస ట్విట్లలో కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్టయిలిష్‌గా, బ్రాండెడ్ బ్లాక్ టీ-షర్ట్‌లో క్రేజీ లుక్స్‌తో ఉన్న ఫ్లోకి ముందు ఓ టేబుల్, దానిపైన ల్యాప్‌టాప్ ఉన్న ఫోటోను షేర్ చేయడంతో..కొత్త సీఈవో స్టైల్ అదిరిపోయిందని ఒకరు, చాలా ఇన్స్పైరింగ్.. పప్పీలా ఆ స్థాయికి ఎదగాలనుకుంటున్నా అంటూ కమెంట్ చేశాడు కాగా అంతకుముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్లో అభ్యంతరకరమైన పోస్ట్ చేయడంతో మస్క్‌పై ట్విటర్ యూజర్లు మండిపడ్డారు. ఇక ఇదే ఆఖరు.. అధికారికంగా ట్విటర్ నుంచి నిష్క్రమిస్తున్నాను అని ఒకరు, ఈ పోస్ట్ ఇబ్బందికరమైన, స్త్రీద్వేషపూరిత చిత్రమని మరొకరు పేర్కొన్నారు ."మీరిలా చేస్తారని నమ్మలేక పోతున్నాను", మరొకరు, "మీ మీమ్స్ చాలా పేలవంగా ఉన్నాయని మరొక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్లాక్మస్క్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. pic.twitter.com/iZUukCVrl5 — Elon Musk (@elonmusk) February 14, 2023 -
మధురిమలు పంచుకోండి.. మధురంగా..
ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. ► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్‌లో ఉంచేందుకు సమయం కేటాయించండి. ► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమమైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి. ► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. ► డ్రైవ్ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్ ఫుల్ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. ► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్‌గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. ► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి. ► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ సినిమాలు చూడండి. పాప్‌కార్న్ వంటి స్టఫ్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది వంటకం కావచ్చు.. డ్యాన్స్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. ► ట్రెజర్ హంట్ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. ► ప్రేమకు సూచిక అయిన హార్ట్ సింబల్లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్ సింబల్ ఆకారంలో కేక్‌కి ఆర్డర్ ఇవ్వండి. ► ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. ► ఇద్దరూ కలిసి పెయింట్ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. ► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. ► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్ బిజీ రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్‌కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. ► ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. ► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. -
'అలా అయితే సింగిల్‌గానే మిగిలిపోతావ్'.. హీరోపై నెటిజన్ కామెంట్ వైరల్
'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా తన అభిమానులతో ఆస్క్ కిరణ్ అబ్బవరం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు హీరో సమాధానమిచ్చారు. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ నెటిజన్ ప్రశ్నకు హీరో ఆశ్చర్యానికి గురయ్యారు. 'అన్న నీ పెళ్లి ఎప్పుడు? మేసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే ఎప్పటికీ సింగల్‌గానే మిగిలిపోతావ్' అంటూ ప్రశ్నించాడు. దీనికి హీరో స్పందిస్తూ.. 'ఎంత మాట అనేశావ్ తమ్ముడు' అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత నెటిజన్ల్ అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ సమాధామిచ్చారు. Entha mata annav thammudu 😒 https://t.co/u6CEmJLX2P — Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 6, 2023 -
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ ధర వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొమ్మిది మంది ప్రయాణానికి టిక్కెట్ ధర వింటే షాక్ అవుతారు. నెటిజన్లు కూడా ఈ టిక్కెట్‌ని చూసి ఫిదా అవుతూ.. తెగ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..పాకిస్తాన్ నుంచి భారత్‌కు వెళ్లే ఓ పాత టిక్కెట్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఇది 1947 ఏళ్ల నాటి టిక్కెట్. అంటే దాదాపు 76 ఏళ్ల క్రితం నాటిది. ఈ టిక్కెట్ చూస్తే ఒక కుటుంబం పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి అమృత్సర్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ టిక్కెట్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17, 1947లో సుమారు తొమ్మిది మంది రావల్పండి నుంచి అమృత్సర్ వెళ్లేందుకు కొనుగోలు చేసిన టిక్కెట్ అది. ఆ టిక్కెట్ ధర సరిగ్గా 36 రూపాయాల తొమ్మిది అణాలు. బహుశా ఆ కుటుంబం భారత్‌కి వలస వచ్చింది కాబోలు. ఐతే నెటిజన్లను మాత్రం ఈ టిక్కెట్ బాగా ఆకర్షించింది. గతం తాలుకా జ్ఞాపకం అని "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ మెచ్చుకుంటున్నారు. అదీగాక 76 ఏళ్ల క్రితం నాటి టిక్కెట్ చెక్కు చెదరకుండా ఉండటం చాలా గ్రేట్ అంటు పొగడ్తల జల్లు కురిపించారు. మరోక నెటిజన్ తన వద్ద 1949లో కొన్న ఉషా కుట్టు మిషన్ రసీదు నా వద్ద ఇంకా చెక్కు చెదరకుండా ఉందని చెబుతున్నాడు. అంతేగాదు ఈ టిక్కెట్ ధర ఆ సమయంలో ఖరీదైనదేనదేనని, ఎందుకంటే ఆరోజుల్లో సగటే లేబర్ చార్జీలు 15 పైసలు మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఈ టిక్కెట్ ఖరీదు ప్రకారం పాక్‌లోని రావల్పిండి నుంచి అమృత్‌సర్‌కి ఒక్కో వ్యక్తికి రూ. 4 అంటే అత్యంత ఖరీదేనని తేల్చేశారు నెటిజన్లు. (చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!) -
‘ట్విటర్ యూజర్లకు కోపం తెప్పిస్తుంది’.. విచిత్రమైన ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్!
ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా వైరల్‌గా మారుతుంది. ఇటీవల ట్విటర్‌ని హస్తగతం చేసుకున్నప్పటి ఆ సంస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మస్క్ పేరు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ ట్విటర్ సీఈఓ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఏది బెటర్.. మస్క్ ట్వీట్ ఎలాన్ మస్క్ రూటే సెపరేటు.. ఇది ఆయన చేసే పనులను చూస్తే అర్థమవుతుంది. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారు మస్క్. అంతేందుకు కొన్న సందర్భాల్లో తను తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ట్వీట్ రూపంలో నెటిజన్లను అడుగుతుంటారు. తాజాగా ఆయన ట్విటర్ వర్సెస్ ఇన్స్టాగ్రామ్ గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేశారు. Instagram makes people depressed & Twitter makes people angry. Which is better? — Elon Musk (@elonmusk) January 15, 2023 అందులో "ఇన్స్టాగ్రామ్ ప్రజలను నిరాశకు గురిచేస్తుంది.. మరోవైపు, ట్విట్టర్ ప్రజలకు కోపం తెప్పిస్తుంది. ఈ రెంటిలో ఏది బెటర్ అని అడిగారు. అయితే మస్క్ ఈ రకంగా ట్వీట్ ఎందుకు చేశారో తెలియదు. కానీ దీని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇన్స్టాగ్రామ్ కంటే ట్విటర్ బెటర్ అని చెప్పేదగినవి చాలానే ఉన్నాయి. ట్విటర్లో ఎటువంటి ఫిల్టర్లు లేనందున ఇది బాగుంటుందన్నారు. ప్రజలు ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చని’ ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు ట్విటర్లో ఉన్న అల్గారిథమ్స్‌ను సరిచేయాలని కోరగా. .. ప్రస్తుతం ఈ విషయంలో మీరు గతం కంటె మెరుగ్గా ఫీల్ అవతారని నెటిజన్ రిప్లైకి మస్క్ స్పందించారు. చదవండి: ర్యాపిడోకి గట్టి షాకిచ్చిన కోర్టు.. అన్ని సర్వీసులు నిలిపివేయాలని ఆదేశాలు! -
బాబు వాడుకున్నారు.. జనం ఆడుకున్నారు
సాక్షి, అమరావతి: జనాదరణ పోయింది. పిలిచినా సభలకు రావటం లేదు. దీంతో ఒకరోజు ఇరుకు సందుల్లోనే సభ పెట్టబోయారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ సాహసానికి.. పాపం 8 మంది అమాయకులు బలైపోయారు. జనం రద్దీ బాగా కనిపించే డ్రోన్షాట్ల కోసం ఇరుకు రోడ్లోకి వాహనాన్ని పోనిచ్చి... అక్కడ చంద్రబాబు మాట్లాడబోగా, అప్పటికే ఉన్న జనం వెనక్కివెళ్లే తొందర్లో ఒకరిపై ఒకరు పడి... పాపం ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాన్ని రప్పించడానికి వారికి కానుకల ఆశ చూపించారు చంద్రబాబు. విలువైన చీర, ఇతర సరుకులు ఇస్తామని నమ్మబలికి టోకెన్లు పంచి మరీ వేల మందిని రప్పించారు. కానీ చౌకబారు చీరలతో నాసిరకం కానుకలిచ్చారు. అది కూడా టోకెన్లున్న వారందరికీ ఇవ్వకపోవటంతో అక్కడా తోపులాట తప్పలేదు. పాపం.. మరో ముగ్గురు బలైపోయారు. ఎలాగైనా తమకు జనాదరణ తగ్గలేదని చూపించడానికి చంద్రబాబు ముఠా ఎల్లో మీడియా, సోషల్ మీడియా వేదికగా మరో దుస్సాహసానికి దిగింది. చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను ఈ ముఠా వైరల్ చేసింది. ‘కుప్పం గడ్డ.. ఇది చంద్రబాబు అడ్డా’ అనే నినాదాలతో విపరీతంగా జనం కనిపిస్తున్న ఆ ఫొటోలను కొన్ని ఎల్లో చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక సోషల్ మీడియాలో అయితే టీడీపీ బ్యాచ్ మొత్తం ఈ ఫొటోలను షేర్ చేస్తూ శివాలెత్తిపోయింది. బాబును ప్రభుత్వం ఎంతలా అడ్డుకున్నా జనం ఆయన వెంటే ఉన్నారంటూ కామెంట్లు కూడా ఊదరగొట్టేశారు. కానీ నిజమేంటో తెలుసా? ఆ ఫొటోలు కుప్పంలోనివి కాదు. అసలు చంద్రబాబుకే కాదు.. ఈ రాష్ట్రానికే సంబంధం లేని ఫొటోలు. కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖుడిగా గుర్తింపు పొందిన సిద్ధేశ్వర స్వామి సోమవారం మరణించగా.. ఆయన అంతిమ యాత్రకు దాదాపు 2 లక్షల మంది భక్తులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. లింగాయత్ సంప్రదాయానికి చెందిన సిద్ధేశ్వర స్వామి.. దశాబ్దాల పాటు సమాజానికి విశేష సేవలు అందించి కర్ణాటక వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందటంతో జనం తండోపతండాలుగా వచ్చారు. భక్తుల్లో చాలామంది పసుపు రంగు దుస్తులు ధరించి ఉండటం.. వాహనానికి కూడా పసుపు రంగు ఉండటంతో ఇది తమకు సరిగ్గా మ్యాచ్ అవుతుందనుకున్న టీడీపీ వర్గాలు.. ఆ ఫొటోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి తమ బాబు సభకు వచ్చిన జనం అంటూ వైరల్ చేసేశాయి. ఏకి పారేసిన నెటిజన్లు.. ఆ ఫొటోల లోగుట్టును నెటిజన్లు క్షణాల్లోనే పట్టేశారు. ఆ ఫొటోలు కుప్పంలో చంద్రబాబు పర్యటనవి కావంటూ నిజాన్ని నిగ్గు తేల్చారు. చుట్టుపక్కల పరిసరాలు, ఆ ఫొటోల్లో ఉన్న ప్రజల ఆహార్యాన్ని గుర్తించిన ప్రజలే.. ఇవి ఫేక్ అంటూ ఎండగట్టే సరికి పచ్చ గ్యాంగ్‌కు దిమ్మ తిరిగిపోయింది. ‘బాబు మరీ ఇంత ఫేకా’ అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. నిజానికి 1989 నుంచీ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం స్థానంలో ఇపుడు టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలున్న తరుణంలో మూడు రోజుల పర్యటనకు గాను చంద్రబాబు బుధవారం కుప్పంలో అడుగుపెట్టారు. బాబు వస్తున్నారని వారం పది రోజులుగా ఎంత ప్రచారం చేసినా, అక్కడి ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించ లేదు. దీంతో ఫొటోల మార్ఫింగ్‌కు దిగారు టీడీపీ ఘనులు. అయినా జనం వచ్చేది నాయకులు చేసే మంచిని చూసి. మరి చంద్రబాబు ఏం చేశారని వస్తారు?. -
పఠాన్ డిజాస్టర్ అయ్యిందిగా..! నెటిజన్ విమర్శకు షారుక్ స్ట్రాంగ్ కౌంటర్
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పఠాన్'. విడుదలకు ముందే ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్ రో' సాంగ్‌పై పలువురు రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఇటీవల సెన్సార్ బోర్డు సైతం ఈ సినిమాలోని పలు సన్నివేశాలు, పాటల విజువల్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో మార్పులు చేసి మళ్లీ యూ/ఏ సర్టిఫికెట్ కోసం రావాలని మూవీ టీంకు సూచించింది. చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్ ప్రస్తుతం పఠాన్ టీం సెన్సార్ సూచన మేరకు చిత్రంలో మార్పులు చేసే పనిలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా షారుక్ ట్విటర్ వేదికగా ఆస్క్ఎస్ఆర్కే(ASKSRK) లైవ్‌చాట్ నిర్వహించాడు. తాను ట్విటర్‌లోకి వచ్చి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ షారుక్‌పై వ్యతిరేకత బయటపెట్టాడు. ‘ఇప్పటికే పఠాన్ డిజాస్టర్ అయింది. ఇక మీరు రిటైర్మెంట్ తీసుకోండి’ అంటూ విమర్శించాడు. ‘బెటా పెద్ద వాళ్లతో అలా మాట్లాడకూడదు’ అంటూ సదరు నెటిజన్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు షారుక్. చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం ఇక మరో నెటిజన్ దీపికా గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడగ్గా.. ‘తను చాలా స్వీట్’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ ‘సర్ మీరు కశ్మీర్‌కు చెందిన ముస్లిం కదా. మీ పేరు వెనుక ఖాన్ అని ఎందుకు ఉంది? అని ప్రశ్నించాడు. దీనికి షారుక్ ‘ఈ ప్రపంచం మొత్తం నా కుటుంబమే. కుటుంబాన్ని బట్టి మనకు పేరు రాదు. మనం చేసే పనుల బట్టే మనకు పేరు, గౌరవం వస్తుంది. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి’ అని చెప్పాడు. కాగా ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా కనిపించనున్నాడు. Beta badhon se aise baat nahi karte!! https://t.co/G5xPYBdUCK — Shah Rukh Khan (@iamsrk) January 4, 2023 She is so nice it’s unbelievable… https://t.co/M8p3QsXtW6 — Shah Rukh Khan (@iamsrk) January 4, 2023 -
చాయ్, సమోసా రూ.490.. షాకవుతున్న నెటిజన్లు..!
వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు. ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్‌లా సమోసా తింటుంటారు. సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. డిసెంబర్ 28న రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్ టీ, ఒక వాటర్ బాటిల్ ధర 490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్ ఈ విధంగా క్యాప్షన్ జోడించింది. Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb — Farah khan (@farah17khan) December 28, 2022 ఇందులో ఇందులో సాధారణ సైజ్ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్ కప్పు కనిపిస్తోంది. చాయ్ సమోసాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్ రూ.490నా’ అంటూ షాక్ అవుతున్నారు. చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’ -
Zomato: కస్టమర్లకు జొమాటో రిక్వెస్ట్
వైరల్: సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్‌లలో.. ఆర్డర్ చేసేటప్పుడు కొందరు తమ టేస్టులకు తగ్గట్లుగా రెస్టారెంట్లకు కొన్ని సూచనలు చేస్తుంటారు. ఎక్స్ట్రా స్పైసీగా ఉండాలనో, ఉప్పు తక్కువగా ఉండాలనో లేదంటే ఇంకేదైనా సూచనను తమ అవసరాలకు అనుగుణంగా జత చేస్తుంటారు. అందుకే కస్టమర్లకు తగ్గట్లే.. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో కాలమ్స్‌ను పెడుతుంటాయి ఆయా యాప్‌లు. అయితే.. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు ఒక విజ్ఞప్తి చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో సర్వసాధారణంగా మారిపోయిన ఓ కుకింగ్ సూచనను దయచేసి చేయొద్దంటూ ట్వీట్ చేసింది. అదే.. ‘‘భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’’ అని. దయచేసి కుకింగ్ ఇన్స్ట్రక్షన్ ఈ సందేశాన్ని జత చేయొద్దంటూ విజ్ఞప్తి చేసింది జొమాటో. అయితే జొమాటో రిక్వెస్ట్‌గా చేసిన ఈ ట్వీట్‌కు నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వచ్చి పడుతున్నాయి. అలాంటప్పుడు ఆ సూచన కాలమ్ ఎందుకని, ఏం రాయాలనే కస్టమర్లకు స్వేచ్ఛ ఉండదా?అని జొమాటోని ఏకిపడేస్తున్నారు. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కంపెనీలు సేవలు అందించాలే తప్ప.. వాళ్లకు అడ్డు చెప్పడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. guys please stop writing “bhaiya accha banana” as cooking instructions 🤦♂️ — zomato (@zomato) December 22, 2022 -
‘నేను భారత్‌లో ఎప్పటికీ నెం.1 కాలేను’.. ఆనంద్ మహీంద్రా రిప్లైకి నెటిజన్లు ఫిదా!
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన ట్విటర్లో యాక్టివ్‌గా పలు అంశాలపై స్పందిస్తూ వాటిని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చమత్కారంగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే! ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో 10 మిలియన్ల ఫాలోవర్ల మైలురాయిని సాధించిన సందర్భంగా తన ట్విట్టర్లో ఈ అంశంపై నవంబర్ 10న ఒక ట్వీట్ చేశారు. అందులో.. తనకు ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితో ఓ నెటిజన్ మాత్రం మహీంద్రాను ఓ ప్రశ్న అడిగాడు. అందులో.. "భారత్‌లో ప్రస్తుతం అత్యంత ధనవంతుల్లో మీరు 73వ స్థానంలో ఉన్నారు. మరి మీరు ఎప్పుడు మొదటి స్థానానికి(నెం.1) చేరుకుంటారు (ఏక్ కబ్ ఆవోగే?) అని ట్వీట్ చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. “నిజం ఏమిటంటే నేను భారత్‌లో ఎప్పటికీ అత్యంత ధనవంతుడిని కాలేను. ఎందుకంటే అది నా కోరిక కాదని బదలిచ్చాడు. దీంతో ఇక నెటిజన్లు మహీంద్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్ 25 వేల కంటే ఎక్కువ లైక్‌లతో పాటు, వెయ్యికి పైగా రీట్వీట్లు అందుకుంది. My reaction when I saw this milestone in the number of followers. Hard to believe I have a family this large. (Clearly violating Family Planning guidelines!) A huge thank you to all for your interest and your belief in me. Let’s stay connected. 🙏🏽🙏🏽🙏🏽 pic.twitter.com/NEIKAlKh5I — anand mahindra (@anandmahindra) November 10, 2022 सच तो ये है कि सबसे अमीर कभी नहीं बनूँगा। क्योंकि ये कभी मेरी ख़्वाहिश ही ना थी… https://t.co/fpRrIf39Z6 — anand mahindra (@anandmahindra) December 11, 2022 చదవండి టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
రిషబ్ పంత్ పై నెటిజన్ల ఆగ్రహం
-
సుందర్‌ను చూసి నేర్చుకో పంత్.. ఇంకా జట్టులో అవసరమా?
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంత్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను నిరాశాజనక ఆట తీరుతో మొదలుపెట్టాడు. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 23 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఫెర్గూసన్ వేసిన 33 ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన పంత్.. రెండో బంతికి మళ్లీ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. ఇక వన్డే సిరీస్‌లోనూ అదే ఆటతీరును కనబరిచిన పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి నీవు మారవా పంత్ అంటూ భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైట్‌బాల్ క్రికెట్‌కు పంత్ సరిపోడాని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. "ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషింగ్టన్ సుందర్ చేసి నేర్చుకో పంత్' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ధావన్, అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఇక న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(72), శ్రేయస్ అయ్యర్(80), గిల్(50) పరుగులతో రాణించారు. అఖరిలో వాషింగ్టన్ సుందర్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: Ind Vs NZ: శ్రేయస్ అద్భుత ఇన్నింగ్స్.. అదరగొట్టిన ధావన్, గిల్! వాషీ మెరుపులు.. సంజూ ఓకే! I am telling you again and again Rishabh Pant is Not a White Ball Cricketer. #RishabhPant #TeamIndia pic.twitter.com/ERMtvWEdpj — @iSubhashChandra🏴 82* (@PunjabKings_Fan) November 25, 2022 #SanjuSamson #JusticeForSanjuSamson #RishabhPant BCCI give 66 matches for pant just for trails bcci give to pant 200 another t20..? pic.twitter.com/jW0wq9Yxv3 — Arvind (@arvi489) November 21, 2022 -
‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!
భారత్‌లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్‌గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్ యూజర్లు ట్విట్టర్లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ పే అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ యాప్ పనికి రాదు అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్ పే యాప్‌ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ ఇచ్చేది. మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్‌లైన్‌కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్‌పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్లో దీనిపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్‌లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. The main reason i shifted to another platforms for payment, pathetic #GPay pic.twitter.com/enJrZixExM — Vikz Karan (@VikzKaran1) November 15, 2022 use less..!!!! #GPay pic.twitter.com/7neORNwXZl — Nirmal Rangdal (@nirmal_rangdal) November 15, 2022 Always shows only this on #GPay full time pass pic.twitter.com/UxccW7khzA — Ketan Gandhi (@Coachketang) November 13, 2022 చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
భారత ఆటగాడిపై సెటైరికల్ ట్వీట్.. మింత్రాపై మండిపడుతున్న నెటిజన్స్!
ఇటీవల కంపెనీలు మార్కెటింగ్ కోసం కొత్త దారులను ఎంచుకుంటున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ కోసం కంటెంట్‌తో పాటు కాంట్రవర్శీని కూడా జత చేస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటివి బాగా పెరిగాయి.ఈ తరహాలో ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పాటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆన్లైన్ ప్లాట్‌పాం మింత్రా(MYNTR) కూడా చేరింది. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ వైఫల్యాలపై మింత్రా వ్యంగ్యంగా ఓ పోస్ట్ చేసింది. అందులో.. 'అవుట్ ఆఫ్ ది వరల్డ్' అని ప్రింట్ చేసిన టీ-షర్టులో.. కేవలం 'అవుట్' మాత్రం కనిపంచేలా ఉన్న టీ షర్ట్ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. ఆ ఫోస్ట్‌కు ‘కేఎల్ రాహుల్ ఇష్టమైన టీ-షర్ట్’ అంటూ సెటైరికల్‌గా క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ట్వీట్‌కు సంబంధించి నెట్టింట దుమారమే రేగుతోంది. మింత్రా చేసని పనికి సోషల్‌మీడియాలో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చీఫ్ పబ్లిసిటీ స్టంట్స్ ఆపాలంటూ మండిపడుతున్నారు. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు
బెంగళూరు: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్‌గా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసేటపుడు, షాపింగ్ చేసేటపుడు, హోటల్‌కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం. ఎక్కువ రేటింగ్, పాజిటివ్ రివ్యూలు ఉన్నవాటిని మరో ఆలోచన లేకుండా ముందుకు పోతాం. అయితే జొమాటో తన ప్లాట్‌ఫాంలో నెగిటివ్ రివ్యూలను డిలీట్ చేసిందట. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఒక మహిళా యూజర్ ఫిర్యాదు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..బెంగళూరుకు చెందిన దిశా సంఘ్వీ కోరమంగళలోని ఓ రెస్టారెంట్ కెళ్లి భోజనం చేశారు. అయితే ఆతర్వాత తనకు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందంటూ జొమాటోలో రివ్యూ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి అనుభవం కేవలం తన ఒక్కదానికి మాత్రమే పరిమితం కాలేదని ఆరోపించారు. తన సహోద్యోగి కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యాడని, గత కొన్ని నెలల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్న అనేక మంది తన దృష్టికి వచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ రివ్యూని తొలగించడం వివాదాన్ని రేపింది. (Bharti Airtel:అదరగొట్టిన భారతి ఎయిర్టెల్) తన రివ్యూని జొమాటో తొలగించడంపై దిశా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కంపెనీ తొలగించిన తన రివ్యూ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో ఆదివారం షేర్ చేశారు. అలాగే తన రివ్యూను తొలగిస్తూ జొమాటో అలర్ట్ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సరైన ప్లాట్‌ఫారమ్ కాదని జొమాటో ఇమెయిల్‌లో పేర్కొంది. ప్లాట్‌ఫారమ్‌లో వచ్చిన రివ్యూ తనిఖీలో భాగంగా కంటెంట్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు గమనించామని అందుకే ఆ రివ్యూని తొలగించామని వివరణ ఇచ్చినట్టు ఇందులో ఉంది. దీంతో కొన్ని గంటల్లోనే ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది. వేల కొద్దీ లైక్‌లు వందల కొద్దీ రీట్వీట్లు , కామెంట్ల వెల్లు వెత్తింది. ఇక తప్పక జొమాటో స్పందించింది. ఫోన్ నంబర్ / ఆర్డర్ ఐడీని ప్రైవేట్ మెసేజ్ ద్వారా షేర్ చేయాలని ఈ విషయాన్ని వెంటనే పరిష్కరిస్తాంటూ జొమాటో రిప్లై ఇచ్చింది. అయితే ఇంటర్నెట్ వినియోగదారులు కంపెనీ చెబుతున్నకంటెంట్ మార్గదర్శకాలపై మండిపడుతున్నారు. తమ అనుభవాన్ని షేర్ చేస్తే 'దుర్వినియోగం' అంటున్నారు. ఇక కమెంట్స్ ఆప్షన్ దేనికి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించారు."హలో జొమాటో! నేను చూడాలనుకుంటున్నది సరిగ్గా ఇలాంటి రివ్యూనే. ఆహారం యావరేజ్‌గా ఉంటే, అది కేవలం ప్రయత్నించి దాటవేయడం మాత్రమే. కానీ ఆ ఆహారం నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలిగితే, అది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన విషయం. సమాధానం చెప్పాలి అని మరొకరు రాశారు. "హే జొమాటో, అసలు మీ నిబంధనల్లోనే ఏదో తీవ్రమైన లోపం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలనే రిపోర్ట్ చేయాలి. వినియోగదారులకు అవగాహన కలగాలి. ఇది అన్యాయమైతే సదరు విక్రేతను ప్రతిస్పందించనివ్వండి" అని మరొకరు వ్యాఖ్యానించారు.వెంటనే జొమాటో లిస్టింగ్లోంచి ఆ రెస్టారెంట్‌ను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. A recent visit to a restaurant in Koramangala, B'lore left my colleague and me with a severe case of food poisoning. I wrote a review on @zomato and while doing so, found that many people had a similar experience in the last few months. Zomato took down the review citing this👏🏻 pic.twitter.com/O3V1lbpzN9 — Disha Sanghvi (@DishaRSanghvi) October 30, 2022 its funny when @zomato doesn't take down the restaurant listing based on the health code violation or get that inspected. Instead -- they take down your listing — swati poddar (@swatipoddar) October 30, 2022 @zomato does not care of a restaurant causes frequent food poisoning. This is an anti-consumer stance . As a customer I want to know if a restaurant has minimal hygiene standards. Censoring hygiene related reviews makes Zomato’s review system meaningless. https://t.co/ZmvkymoYy9 — MooseMan (@moosemaniam) October 30, 2022 -
ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పలు మీమ్స్, సెటైర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నెలకు 20 డాలర్లు (రూ.1600కుపై మాటే) చెల్లించడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. దీని బదులు నెలకు 1600 సిప్ (సిస్టంఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఒకరు మండిపడ్డారు. బ్లూటిక్కా? అసవసరమే లేదు. అదేమీ సర్టిఫికేట్ కాదుగా..అసలు నేను ఎపుడూ అడగలేదు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. (ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు) Blue Tick folks now be like “I will give it up, I never asked for it, yeh koi certificate nahi hai.” 😂 — Shiv Aroor (@ShivAroor) October 31, 2022 Now opening a SIP of Rs 1600 pm which I saved by not having a blue tick. — Gabbbar (@GabbbarSingh) October 31, 2022 I’ve got your Blue Tick right here pic.twitter.com/hlCOzOumwe — cosmic jester (@cosmicjester) October 31, 2022 కాగా బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు తరువాత సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ట్విటర్ చేతికి రాగానే సీఈవో పరాగ్ అగర్వాల్ సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్ సంస్థలో ఉద్యోగులను తొలగించే ప్రణాళిల్లోఉన్నట్టు పలు నివేదికలుకోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తలను మస్క్ తిరస్కరించినప్పటికీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. సరికొత్తగా బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వెర్జ్ రిపోర్ట్ చేసింది. నవంబర్ 7లోగా ఈ కొత్త వెరిఫికేషన్ రీవాంప్ను రూపొందించాలని, లేదంటే వేటు తప్పదని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. -
పవన్ నోట పూటకో మాట!
మరో ఉద్యమం రాదా? ‘కేవలం రాజధాని (అమరావతి) చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర ఏం కావాలి? రాయలసీమ ఏం కావాలి? ప్రకాశం జిల్లా ఏం కావాలి? తెలంగాణ ఉద్యమం వచ్చినట్లుగా ఇంకో ఉద్యమం రాదా?’ – 2018లో గుంటూరు జిల్లాలో పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు ఎందుకీ గర్జన..? ‘విశాఖలో ఎందుకీ గర్జన? మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? వలసలు ఆపలేకపోయినందుకా? రుషికొండను ధ్వంసం చేసి మీకోసం భవనం నిర్మిస్తున్నందుకా? వైఫల్యాలు దాచేసి కులాల మధ్య చిచ్చు రేపినందుకా? విద్యుత్ చార్జీలు భారీగా పెంచినందుకా?’ – తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్లు సాక్షి, అమరావతి: కేవలం అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏం కావాలని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశ్నలు కురిపించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖ గర్జన సభపై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో పవన్ జనసేన బహిరంగ సభలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లు వైరల్ అవుతున్నాయి. పవన్ మాట ఎందుకు మారుస్తున్నారంటూ పలువురు రీ ట్వీట్ చేశారు. మీపై ఏమి ప్రభావం చూపాయో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. 15 నుంచి పవన్ విశాఖ పర్యటన పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది. 15, 16, 17వ తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నాయకులతో సమావేశమవుతారు. 16న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
-
హీరోయిన్ని కాకుంటే ఆ పని చేసేదాన్ని : నిధి అగర్వాల్
కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఉన్నా.. అదృష్టం దక్కని నటీమణుల్లో నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. ఈమె తెరపై కనిపించిందంటే అందాల మోతే. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం సంచలన విజయం సాధించినా, నటి నిధి అగర్వాల్‌కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. అలాగే తమిళంలో నటుడు శింబుతో రొమాన్స్ చేసిన ఈశ్వరన్ ఆమెను నిరాశ పరిచింది. అయితే నిజ జీవితంతో శింబుతో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం మాత్రం హోరెత్తింది. ఆ ప్రచారం ఎంతవరకు సాగిందంటే శింబు, నిధి అగర్వాల్ ప్రేమ, పెళ్లి పీటలెక్కబోతోంది అన్నంతగా. అయితే ఇప్పుడు ఆ విషయం చడీచప్పుడు లేదు. అంతేకాదు కోలీవుడ్‌లో నటి నిధి అగర్వాల్‌కు అవకాశాలు కూడా దక్కడం లేదు. అయినా అవకాశాల ప్రయత్నంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తునే ఉంది. ఈక్రమంలో ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా నిధి అగర్వాల్ ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ తాను వర్కౌట్స్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని చెప్పింది. అదేవిధంగా తాను ఇంటర్ స్టేట్ ఛాంపియన్ అని తెలిపింది. నటి కాకుంటే ఏం చేసేవారు అన్న ప్రశ్నకు నిధి అగర్వాల్ బదులిస్తూ నటిగా సక్సెస్ కాకుంటే తనను ఇంటిలో ఊరికే కూర్చోనిచ్చేవారు కాదని సంపాదించడానికి ఏదో ఒకపని చేయమని చెప్పే వారని పేర్కొంది. తాను నటిని కాకుంటే ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించేదాన్నని చెప్పింది. తనకు ఫ్యాషన్ డిజైనింగ్ పరిచయం లేదని అయితే, శిక్షణ పొంది ఆ రంగంలోకి వెళ్లేదాన్నని చెప్పింది. తన కుటుంబానిది వ్యాపార నేపథ్యమని, తాను కచ్చితంగా ఆ నేర్పరితనాన్ని ఉపయోగించేదాన్నని చెప్పింది. -
టాయిలెట్లో భోజనాలు
సహరన్పూర్ (యూపీ): ఉత్తరప్రదేశ్‌లో వినడానికే రోత పుట్టించే ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో క్రీడాకారిణులకు ఇంకెక్కడా చోటు లేనట్టు టాయిలెట్లో భోజనాలు వడ్డించారు! సహరన్‌పూర్‌లోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ స్టేడియంలో సెపె్టంబర్ 16 నుంచి 18 దాకా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 డివిజన్ల నుంచి 300 మంది అమ్మాయిలు పాల్గొన్నారు. వారికి టాయిలెట్లో భోజనాలు వడ్డించడం తీవ్ర దుమారం రేపింది. అన్నం, కూరలతో పాటు పూరీలను టాయిలెట్లోనే నేలపై పేపర్లు పరిచి ఉంచారు. గత్యంతరం లేక బాలికలు అక్కడే వడ్డించుకొని తింటున్న వీడియో వైరల్‌గా మారింది. దాంతో యూపీ ప్రభుత్వం తీరును నెటిజన్లు అసహ్యించుకున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సహరన్పూర్ జిల్లా క్రీడల అధికారి అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేసింది. భోజనాలు తయారు చేసిన కేటరర్‌ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ‘‘వీడియోలో కనిపిస్తున్న ఆహారం సెపె్టంబర్ 15న వండినది. పాడైపోయిన ఆహారం కావడంతో భారీ వర్షాల వల్ల స్టేడియంలో ఎక్కడా చోటు లేక ఛేంజింగ్ రూమ్‌లో ఉంచాం. అంతే తప్ప బాలికలకు పెట్టడానికి కాదు’’ అంటూ సక్సేనా సమరి్థంచుకున్నారు. భోజనాలపై కోచ్‌లు, క్రీడాకారిణులు ఎలాంటి అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. 300 మందికి భోజనాన్ని ఇద్దరే చేశారని, అన్నం కూడా ఉడకలేదని సమాచారముందని కలెక్టర్ చెప్పారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మండిపడ్డారు. క్రీడాకారిణుల్ని ఈ స్థాయిలో అగౌరవపరచడం జాతికే అవమానమంటూ ట్వీట్ చేశారు. ఇంత దారుణంగా చూస్తారా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా దీనిపై మండిపడింది. -
అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్‌ను చూశారు కదా! వీటిని మన రైల్వే మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల్లో ఆదివారం పోస్ట్ చేసింది. పునరుద్ధరణ తరువాత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్డీఎల్ఎస్) ఇలా ఉండబోతోందని పేర్కొంది. ఆధునికంగా కనబడుతున్నా.. ఆ టవర్స్‌పై నెటిజన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 అంతస్తుల జంట భవనాల్లో మల్టీ లెవల్ పార్కింగ్, పికప్, డ్రాప్ జోన్స్, 91 బస్‌బేలు, 1,500 ఈసీఎస్ పార్కింగ్లు ఉంటాయని, షాపులు, ఆఫీసులు, ఓ పెద్ద హోటల్ నిర్వహణకు సరిపడా స్థలముంటుందని రైల్వే శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ను 5వేల మంది రీట్వీట్ చేశారు. ► ఓ రైల్వే స్టేషన్‌కు అంత సంక్లిష్టమైన డిజైన్ అవసరమా? ► నిర్మాణానికి ఎక్కువ టైమ్ తీసుకోవడమే కాదు.. ఆ అద్దాల నుంచి వచ్చే ఉష్ణోగ్రత వేసవిలో ఢిల్లీ టెంపరేచర్‌ను మరింత పెంచుతుంది. ► డిజైన్ బాగానే ఉంది కానీ.. చూడ్డానికి 2025 ప్లాన్‌లా ఉంది. దానికోసం భూసేకరణ ఎలా చేస్తారు? బయట ఉన్న పహడ్గంజ్ నివాసితులను ఏం చేస్తారు? ► హైప్డ్ డిజైన్‌తో అనవసరమైన ఖర్చు. సింపుల్‌గా ఎఫెక్టివ్‌గా కట్టలేమా? ఆధునికత పేరుతో ధరలు పెంచుతారు. ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ► మన నిర్మాణాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి. ఇది ఎక్కడినుంచో కాపీ కొట్టినట్టు ఉంది. అంటూ విమర్శల వర్షం కురిపించారు. చదవండి: ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112 -
క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
వచ్చిరాని మాటలు, తెలిసి తెలియని చేతలతో చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ చిచ్చరపిడుగు.. గోదావరి యాస, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల కంటపడ్డాడు. బుడ్డోడి మాటలకు, హావభావాలకు వీక్షకులు ఫిదా అవుతున్నాయి. ‘బల్లు బల్లు మని బాదెసడమ్మి.. తూస్తే ఏడుపొచ్చేత్తమ్మి’ అంటూ ముద్దుగా ముద్దుగా మాట్లాడిన చిన్నారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. టీచర్ అనవసరంగా తనను కొట్టాడంటూ గోదావరి యాసలో చెబుతూ చిన్నారి చూపించిన ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. ‘గట్టిగా కొట్టేశాడు ఎదవ. సార్‌దే తప్పు.. చిన్నపిల్లోడ్ని ఎందుకు కొట్టాడు’ అంటూ బుడ్డోడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అతడు మాట్లాడిన మాటలు చాలా మందికి అర్థంకాకపోయినా హావభావాలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. (క్లిక్: వైరల్ వీడియో.. హృదయానికి హత్తుకుంటోంది!) పెద్ద మనిషిలా మాట్లాడుతున్న ఈ చిన్నారి మంచి మాటకారి అవుతాడు. గోదావరి యాసను బతికిస్తున్నాడు. మంచి రెబల్ అవుతాడు. లవ్ యు రా బుజ్జి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ బాలుడు ఏ ఊరివాడు, ఈ వీడియో ఎప్పటిదనే వివరాలు వెల్లడికాలేదు. -
గోదావరి యాసతో కట్టిపడేస్తున్న చిన్నారి
-
చెత్త బ్యాగ్ రూ.లక్షా 40వేలు.. వైరలవుతోన్న మీమ్స్
అంతలేదని కొట్టి పారేస్తున్నారా? అది నిజం. లగ్జరీ బ్రాండ్ బలెన్సియాగా ఈ బ్యాగులను తయారు చేసింది. కంపెనీ ‘ట్రాష్ పౌచ్’గా పిలుస్తున్న ఈ బ్యాగులను దూడ తోలుతో తయారుచేసి.. గ్లాసీ కోటింగ్ ఇచ్చింది. నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో వీటిని తయారు చేసింది. బ్యాగును క్లోజ్ చేసేందుకు బ్యాక్‌పాక్‌కు ఉన్నట్టుగా త్రెడ్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతే లగ్జరీగా వింటర్–22 కలెక్షన్లో విడుదల చేసింది. ఆ వీడియోలు కాస్తా ట్విట్టర్లోకి వచ్చాయి. అంతే ఆ ధర చూసి కళ్లు తిరిగిన ట్విట్టర్ యూజర్స్ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. కొందరైతే తిట్ల దండకమే మొదలుపెట్టారు. ‘‘చెత్త బ్యాగుకోసం లక్షన్నర ఖర్చు చేయగలిగినవాళ్లకి దాన్నిండా నింపగలిగేంత క్యాష్ బ్యాంకులో ఉండే ఉంటుంది. అలా నింపేసి అవసరంలో ఉన్నవారికి చారిటీగా ఇచ్చేయొచ్చు కదా’’ అని ట్వీట్ చేశాడో యూజర్. ఇక ‘‘ఆ చెత్త బ్యాగ్‌ను తీసుకుని మీరు వెళ్తే... మిమ్మల్ని దోచుకోవడానికి కొంతమందిని పంపిస్తా’’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా లగ్జరీ ఐటమ్స్‌తో వివాదాస్పదం కావడం బలెన్సియాకు కొత్తేం కాదు... ఇదే ఏడాది మేలో ‘రబ్బిష్ బిన్’ పేరుతో చిరిగిపోయిన షూస్‌ను రూ.2 లక్షల లకు అమ్మి విమర్శలు ఎదుర్కొందీ కంపెనీ. -
నాన్నకు రోడ్డు ప్రమాదం..డెలివరీ బాయ్‌గా ఏడేళ్ల బాలుడు
ప్రమాదం అంటే ఓ వ్యక్తి రోడ్డున పడటం కాదు..ఒక కుటుంబం రోడ్డున పడటం. ఇంట్లో పెద్ద దిక్కు రోడ్డు ప్రమాదానికి గురై మంచనా పడితే ఆ బాధ వర్ణనాతీతం. కష్టాల్లో చేయందించే మానవ లోకంలో..అదే కష్టాలను చూస్తే కను చూపు తిప్పుకునే వాళ్లూ ఉన్నారు. అందుకే బడికెళ్లే ఏడేళ్ల బాలుడు డెలివరీ బాయ్‌గా మారాడు. కుటుంబ భారాన్ని మోస్తూ అందరి చేత శెభాష్ అనిపించుకుంటున్నాడు. అమ్మా..నాన్న..ఓ అబ్బాయి. అమ్మ చిన్నా చితాకా పనులు చేస్తుంటే.. నాన్న డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి బడికి వెళ్లే వాడు. అన్యోన్యమైన అనుబంధాలున్న ఆ పచ్చని కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో..ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీనితోడు ఆర్ధిక ఇబ్బందులు. ఓ వైపు నాన్న ట్రీట్మెంట్. ఆ పసి హృదయం తల్లడిల్లింది. అయితేనేం ఆ బాలుడు కుంగిపోలేదు. నాన్న వైద్యం, పోషణ కోసం కుటుంబ బారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లడం, సాయంత్రం 6గంటల నుంచి 11గంటల వరకు ఫుడ్ ఆర్డర్లు అందించే జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. This 7 year boy is doing his father job as his father met with an accident the boy go to school in the morning and after 6 he work as a delivery boy for @zomato we need to motivate the energy of this boy and help his father to get into feet #zomato pic.twitter.com/5KqBv6OVVG — RAHUL MITTAL (@therahulmittal) August 1, 2022 ఈ తరుణంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న రాహుల్ మిట్టల్ అనే యువకుడు ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. రాహుల్‌కు ఆ ఫుడ్‌ను అందించేందుకు సైకిల్‌పై ఆ బాలుడి రావడం.. అతడి గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురైతే తన తండ్రి ప్రొఫైల్ మీద డెలివరీలు అందిస్తున్నట్లు చెప్పాడు. ఆ సంభాషణను రాహుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ బాలుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్పందించిన జొమాటో కష్టకాలంలో డెలివరీ బాయ్స్‌కు అండగా ఉంటామని మరోసారి నిరూపించింది జొమాటో. కొద్ది నెలల క్రితం మద్యం మత్తులో కానిస్టేబుల్ జిలే సింగ్ చేసిన తప్పిదానికి జొమాటో డెలివరీ బాయ్ సలీల్ త్రిపాఠి మరణించాడు. ఆయన మరణంపై విచారం వ్యక్తం చేసిన జొమాటో అండగా నిలిచింది. ఆర్ధిక సాయం చేసింది. ఇప్పుడు చిన్న వయస్సులో కుటుంబ బారాన్ని మోస్తున్న ఏడేళ్ల బాలుడికి సాయం చేసేందుకు సిద్ధమైంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న బాలుడి వీడియోపై జొమాటో స్పందించింది. వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరింది. -
Viral Video:ఆనంద్ మహీంద్రా మరో సూపర్ వీడియో, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఇన్నోవేటివ్ కథనాలను, వీడియోలను పంచుకునే ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విటర్లో పంచుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతమైంది. అందమైంది. ఈ 'ప్రిమిటివ్' మెకానికల్ డివైస్ అద్బుతంగా, అందంగా ఉంది. సస్టైనబుల్, సమర్ధవంతమైంది మాత్రమే కాదు. కదులుతున్న శిల్పంలా ఉంది అంటూ ఆయన కమెంట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. లైక్‌లు,కమెంట్లు వెల్లువలా వస్తున్నాయి. దీంతో వావ్.. వండర్ ఫుల్ అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. గ్రామాల్లో పొలాల్లోని నీటిని తోడే యంత్రంలాగా, మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే దంపుడు సాధనం లాగా, పక్కనే నీటి ద్వారా విద్యుత్తును తయారు చేసేందుకుపయోగించేలా ఉన్న ఈ టెక్నిక్ చూసి యూజర్లు ఫిదా అవుతున్నారు. ‘‘నాకు డిజైనింగ్‌లో పెద్దగా నైపుణ్యం లేదు.. కానీ ఇది మాత్రం సూపర్ అని చెప్పగలను సార్. బరువు, మోషన్ కంట్రోలింగ్‌లో చాలా నైపుణ్యం ఉంది ఇందులో. అంతేకాదు ఈ వీడియోలోని మహిళఫోకస్, ప్లో మెచ్చుకోదగింది అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. వావ్.. పొలాల్లోకి నీటిని పంప్ చేయడానికి ఉపయోగించే చాలా పురాతనమైన పద్దతి ఇది. నా బాల్యాన్ని గుర్తుచేశారు. థ్యాంక్యూ సర్. ఇది చూసినందుకు సంతోషంగా ఉందని మరొకరు కమెంట్ చేశారు. అంతేకాదు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతోంది ఈ డివైస్. ఒకవైపు హైడ్రాలిక్ పవర్, మరోవైపు వాటర్ పంపింగ్.. అలాగే మహిళ ఒడ్లు లాంటివేవో దంచుతోంది. ఈ టెక్నాలజీ అదిరిపోయిందంటూ అబ్బురపడు తున్నారు. అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. यह उपकरण कुशल भी है और खूबसूरत भी। In an age where we’re surrounded by electronic gadgetry, this ‘primitive’ mechanical device is not just efficient & sustainable but also stunningly beautiful. Not just a machine but a mobile sculpture… pic.twitter.com/JzhDmYriCw — anand mahindra (@anandmahindra) July 28, 2022 -
వైరల్ వీడియో: రంగులు మార్చే పక్షిని చూశారా!
పరిసరాలకు అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చగలదని మనందరికీ తెలిసిందే. మరి ఓ పిట్ట రంగులు మార్చడాన్ని మీరెప్పుడైనా చూశారా? తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి చేతిపై వాలిన అన్నాస్ హమ్మింగ్ బర్డ్ అటూ ఇటూ తల తిప్పినప్పుడల్లా ముదురు ఆకుపచ్చ నుంచి నలుపు వరకు వివిధ రంగులను మార్చడం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఈ పిట్టల ఈకల్లో ప్యాన్ కేక్ ఆకృతిలో ఉండే పిగ్మెంట్లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హమ్మింగ్ బర్డ్ తల తిప్పినప్పుడల్లా ఈ పిగ్మెంట్లు కాంతికిరణాలను మళ్లించడం వల్ల అది రంగులు మారుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుందని పేర్కొన్నారు. The stunning colors of the Anna's hummingbird are iridescence caused by light scattering from nanoscale structures within their feathers.pic.twitter.com/BZzXuFnHag — Wonder of Science (@wonderofscience) July 21, 2022 -
Viral Video: అలియా భట్‌కు కవలలు? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ranbir Kapoor Says He Having Twins With Alia Bhatt: బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే రణ్‌బీర్‌తో యాంకర్ సరదాగా ఒక గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో 'రెండు నిజాలు, ఒక అబద్ధం' చెప్పాల్సిందిగా రణ్‌బీర్‌ను ఆ యాంకర్ కోరారు. ఈ గేమ్‌లో మూడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రణ్‌బీర్ కపూర్. యాంకర్ అడిగిన ప్రశ్నకు 'నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాను' అని మూడు ఆసక్తికర విషయాలు చెప్పాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. తన భార్య అలియా భట్‌తో కలిసి బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్‌బీర్ నటిస్తున్న విషయం తెలుసు కాబట్టి, పౌరాణిక చిత్రంలో భాగం కానున్నాను అనేది నిజమేనని ఊహించడం తేలికైంది. మిగతా రెండు విషయాలకొస్తే నిజంగా అలియా భట్‌కు ట్విన్స్ పుట్టనున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్ సుధీర్ఘ విరామం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే రణ్‌బీర్ సినిమా కెరీర్‌కు రెండేళ్లు గ్యాప్ (2018లో చివరి సినిమా విడుదలైంది) వచ్చింది. దీంతో మరోసారి నిజంగా గ్యాప్ తీసుకుంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'అతను తండ్రి కాబోతున్నాడు. విరామం తీసుకునే అవకాశం ఉంది' అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఈ ప్రశ్నలన్నింటికి అసలైన సమాధానం దొరకాలంటే అలియా భట్ డెలివరీ దాకా ఆగాల్సిందే. -
నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్
Mahesh Babu Dance To Nithin Song Goes Viral: హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ హీరో 'జయం' సినిమా హీరోగా నితిన్‌కు ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ యూత్‌ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్ 'వావ్' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పాటకు మహేశ్ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్‌తో చేసిన ప్రయోగం. నితిన్ తాజాగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ అంజలి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్‌ను రీమిక్స్ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్‌కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ స్పెషల్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త ట్రెండ్ అయింది. ఈ వీడియోకు నితిన్ 'వావ్.. సూపర్.. పర్ఫెక్ట్ సింక్' అంటూ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ చలరేగిపోతోంది. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t — nithiin (@actor_nithiin) July 12, 2022 -
ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు
Netizens Comments On Anasuya Latest Photos: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంది అనసూయ. అయితే అప్పుడుప్పుడు వాటితో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఆ విమర్శలకు తిరిగి దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్ యాంకర్. తాజాగా మరోసారి తను పెట్టిన ఫొటోలపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్. 'ముసలి దానిలా కనిపిస్తున్నావ్', 'ముఖంలో గ్లో తగ్గింది', 'మేకప్ సరిగ్గా వేసుకోలేదా ?', 'అసలైన వయసు బయటపడింది', 'మేకప్, డ్రెస్సింగ్ బాలేదు', 'ముడతలు కనిపిస్తున్నాయ్', 'కొంచెం ఏజ్డ్గా ఉన్నారు' అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వీటితోపాటు పలువురు అభిమానులు 'చాలా అందంగా ఉన్నారు', 'లుకింగ్ నైస్', 'వావ్', 'బ్యూటిఫుల్' అంటూ పొగుడుతున్నారు. మరీ ఈ కామెంట్స్‌పై అనసూయ ఏమైనా స్పందిస్తుందో చూడాలి. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్‌పోర్టులో ఎమోషనల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్
Surekha Vani Trolled By Netizens For Instagram Video: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన వివిధ రకాల వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ వీడియోపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ నటించి సరైనోడు చిత్రంలోని 'తెలుసా తెలుసా' సాంగ్‌కు లిప్ సింక్ చేస్తూ ఉయ్యాల ఊగుతూ వయ్యారంగా వీడియో చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్స్ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. 'ఆంటీ అవసరమా ఈ సాంగ్స్ మీకు', 'ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు', 'సురేఖ మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చేవాడు మిమ్మల్ని చూస్తే మిమ్మల్నే చేసుకుంటాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్.' అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు బ్యూటిఫుల్, నైస్, సూపర్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు. చదవండి: అతడెవరని అడిగిన నెటిజన్‌కి సుప్రిత స్ట్రాంగ్ కౌంటర్ View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
ట్రాఫిక్ జామ్‌పై నెటిజన్ వింత పోస్ట్.. వైరల్‌గా మారి నెట్టింట రచ్చ
బెంగళూరు: బెంగళూరు నగరం ఐటీ కంపెనీలకు, చల్లటి వాతావరణంతో పాటు నగరవాసుల బిజీబిజీ బతుకుల్లో ఒకటైన గజిబిజి ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి. ఒక్కోసారి అందులో ఇరుక్కంటే ఎప్పుడు బయటపడతామో కూడా క్లారిటీ ఇవ్వలేం. ఇంక వర్షాకాలం వస్తే ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీంతో అప్పడుప్పుడు కొందరు నెటిజన్లు ఈ ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో తమదైన శైలిలో విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ జామ్‌కి అద్దం పట్టేలా ట్విట్ చేస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా విమర్శించాడు. అందులో.. ‘బెంగళూరులో ఉన్న నా స్నేహితుడు తన కారులోని మూడు, నాలుగు, ఐదో గేర్లను అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతను వాటిని పెద్దగా ఉపయోగించడం లేదు కనుక అవి ఇంకా షోరూమ్ కండీషన్లో ఉన్నాయి’. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నారా? అని రాసి ఉన్న ట్విట్ని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌ని చూస్తే కారు నడిపే వాళ్లు అందులోని మూడు, నాలుగు, ఐదో గేర్లను బెంగళూరు రోడ్లపై వినియోగించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఆ నగరంలోని ట్రాపిక్ పరిస్థితిపై ఎద్దేవా చేసినట్లు ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘లక్షల్లో ట్యాక్్స కుడతున్నప్పటికీ ఈ సమస్యపై ఆందోళనలు చేయలేకపోవడం చాలా బాధాకరమని ఒకరు కామెంట్ చేయగా... ప్రౌడ్ సిటిజన్‌గా ఉండాలంటే మనం ఇలాంటి వాటిపై నోరు మెదపకూడదని మరొకరు కామెంట్ చేశారు. Any buyer in Bangalore? 🤔 pic.twitter.com/cWZreP06v7 — Shrikant 🇮🇳 (@sdjoshi55) May 25, 2022 చదవండి: పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. మహారాష్ట్ర ఏకీకరణ సమితి దాడి -
బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు.. హీరోయిన్ ఘాటు రిప్లై
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్. తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ 'పెట్టా', విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమాలతో అలరించింది. ఇటీవల ధనుష్ కలిసి నటించిన 'మారన్' ఓటీటీలో విడుదలైంది. కానీ అంతగా విజయం సాధించలేదు. ఈ మూవీలో పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక ఇటీవల 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది మాళవిక. 'మారన్ సినిమాలోని బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు' అని అడిగిన ప్రశ్నకు మాళవిక స్పందిస్తూ 'నీ తలలో ఏదో పాడైనట్టుంది' అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. మాళవిక మోహనన్ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలనుందని సోషల్ మీడియా వేదికగా మాళవిక చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జుయాల్‌తో కలిసి 'యుధ్రా' సినిమాలో నటిస్తోంది. చదవండి: విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్ -
మగజాతి పరువు తీస్తున్నారు: దిమ్మతిరిగేలా అనసూయ కౌంటర్
Anasuya Bharadwaj Strong Counter To Netizen On Her Clothes: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు యాంకరింగ్.. ఇటు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోంది. యాంకరింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలు, కుటుంబంతో కలిసి ఆడిపాడిన క్షణాలను పోస్టుల రూపంలో పంచుకుంటుంది. అప్పుడప్పుడు తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకుంటుంది. వాటిని పలువురు విమర్శిస్తే కొంతమంది అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక్కొక్కసారి నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు కూడా ఇస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా ఇలాంటి రిప్లై మళ్లీ ఇచ్చింది ఈ బ్యూటీఫుల్ యాంకర్. ఓ నెటిజన్ ట్విటర్లో 'అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా.. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు' అంటూ అనసూయను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు అనసూయ స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ 'దయచేసి మీరు మీ పని చూసుకోండి.. నన్ను నా పని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని అనసూయ దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అనసూయ దర్జా, ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు 🙏🏻🙂 https://t.co/Uy4P00bmAE — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 4, 2022 చదవండి: అనసూయను టచ్ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది -
ట్విటర్లో ఫోటో షేర్.. పోలీసులకే పంచ్ వేసిన నెటిజన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులు, గుట్కాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే వీటి అక్రమ దందాలపై పోలీసులు డేగకన్ను వేసి ఉంచుతున్నారు. తరచుగా దాడులు చేస్తూ ఇవి కలిగి ఉన్న, విక్రయిస్తున్న వా రిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఓపక్క ఈ చర్యలు కొనసాగిస్తూనే మరోపక్క ఈ ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహనకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పోలీసు అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో సోమవారం ఓ ఫొటోను షేర్ చేశారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు విక్రయించే ఓ పాన్ డబ్బా ఫొటోను పొందుపరిచారు. అందులో సదరు డబ్బాపై ది క్యాన్సర్ హబ్ అని రాసి ఉంది. ఈ హబ్‌కు సరైన పేరు సూచించండి అంటూ నెటిజనుల్ని పోలీసులు కోరారు. ఈ పోస్టు నో గుట్కా, నో టొబాకో హ్యాష్ టాగ్స్‌తో వైరల్ అయింది. దీనికి స్పందించిన అనేక మంది పలు ఆకర్షణీయమైన, చిత్రమైన పేర్లు సూచించారు. దీనిపై ఘాటుగా స్పందించిన నెటిజనులు ఉన్నా రు. ఓ ట్విట్టర్ వినియోగదారు.. ‘ఆర్టీఏ, రిజిస్ట్రేషన్ ఆఫీసు వంటి ప్రభుత్వ కార్యాలయాల వద్ద కరప్షన్ హబ్ అనే బోర్డు పెట్టాలి’ అని సూచించారు. నగరంలో వీటి విక్రయంపై నిషేధం ఉండటంతో ఈ ఫొటో ఎక్కడదనే సందేహం అనేకమందికి కలుగుతోంది. ఈ వివరాలు సిటీ పోలీసులు తమ పోస్టులో ప్రకటించలేదు. చదవండి: విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..? -
ఎంతో టాలెంట్ ఉంది.. కానీ ఏం లాభం.. చూస్తే బాధేస్తోంది!
ఆనంద్ మహీంద్రా మరోసారి ట్విట్టర్లో ఆసక్తికర చర్చకు తెర లేపారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అయ్యింది. అందులో సైకిల్ నడిపే వ్యక్తి హ్యాండిల్స్ వదిలేసి తలపై బరువైన మూట పెట్టుకుని ఎంతో సునాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా బరువెక్కిన హృదయంలో తన స్పందన తెలిపారు. ట్విట్టర్లో ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఈ వ్యక్తి ఓ హ్యుమన్ సెగ్వేలా ఉన్నాడు. జైరోస్కోప్ అతడి వంటిలోనే ఉన్నట్టుగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. బ్యాలెన్స్ చేయడంలో అతడికి ఉన్న సెన్స్ నమ్మశక్యం కానిదిగా ఉంది. అయితే ఈ వీడియో చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. ఇండియాలో టాలెంట్ కలిగిన వారెందరో ఉన్నారు. వీరంతా మంచి జిమ్నాస్టులుగా స్పోర్ట్స్ పర్సన్స్‌గా మారాల్సిన వాళ్లు. కానీ వీళ్లు వెలుగులోకి రాలేక శిక్షణ పొందలేకపోతున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. Sir, this gentleman too is nothing but spider man ! pic.twitter.com/QSQ59hhCyn — Qasid Siddiqui (@qasid4you) March 29, 2022 వీడియో ఆకట్టుకునేలా ఉండటం దానిపై ఆనంద్ మహీంద్రా స్పందన మన దేశంలోని పరిస్థితికి అద్దం పట్టేలా ఉండటంతో నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి మట్టిలో మాణిక్యాలకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుండగా మరికొందరు ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలంటూ సూచిస్తున్నారు. -
బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్ రిప్లైకి షాక్ అయ్యాడు
Disha Patani Hilarious Reply Who Asked Her Bikini Photo: డ్యాషింగ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫిట్నెస్ బ్యూటీ దిశా పటానీ. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా ఆడి పాడి తన గ్లామర్‌తో అలరించింది. తర్వాత బాలీవుడ్లో ఫుల్ బిజీగా మారింది. ఎంఎస్ ధోనీ, భాగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు కూడా ఎదుర్కొంటోంది. కాగా దిశాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హాట్ ఫొటోస్, వర్క్ అవుట్ వీడియోస్‌తో అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. చదవండి: హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు ! ఈ క్రమంలోనే తన ఇన్‌స్టా హ్యాండిల్లో 'ఆస్క్ మీ ఎనిథింగ్ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు నవ్వు తెప్పించేలా రిప్లై ఇచ్చింది దిశా పటానీ. ఈ సెషన్లో ఆ యూజర్ దిశాను 'బికినీ వేసుకున్న మంచి ఫొటో'ను పోస్ట్ చేయాల్సిందిగా కోరాడు. దానికి దిశా బికినీ వేసుకున్న ఒట్టర్ (పాండాలాంటి జంతువు) ఫొటోను పెట్టి వ్యంగంగా సమాధానం ఇచ్చింది. దీంతో షాక్‌కు గురవడం ఆ యూజర్ వంతైంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన పులువురు నెటిజన్స్ దిశా స్పాంటెనిటీకి ఫిదా అవుతున్నారు. ఇవే కాకుండా తనకు ఇష్టమై బీటీఎస్ సాంగ్, గ్లామర్ సీక్రెట్ వంటి తదితర ప్రశ్నలకు సమాదానాలిచ్చింది దిశా పటానీ. -
ఐదేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఐసీయూ బెడ్‌పై ఉంది.. ఈ సినిమాతోనే ఆక్సిజన్ దొరికింది
Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్లు పెట్టి ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ. అయితే ఈ ట్వీట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్ అవ్వండి.' అని నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్‌కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. If you want someone to congratulate you for the ‘success’ of your efforts.. maybe don’t spend the last five years shitting on their heads.. 💁🏾♀️ #justsaying — Swara Bhasker (@ReallySwara) March 13, 2022 మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్ దాదాపు ఐసీయూ బెడ్‌పై ఉంది. ఈరోజు బాలీవుడ్‌కు అతనే ఆక్సిజన్ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, హన్సల్ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి. He deserve to be Congratulated @ReallySwara Since 5 years Bollywood has almost in ICU Bed, Today he gave Oxygen for Bollywood.. You were deleted from people brain, he reminded.. If you not support him by thinking he's not Terrorists gang, then read comments@vivekagnihotri https://t.co/EOSyiB3jc3 — RaMesh Chauhan #BJP_Only (@RameshChauhanM) March 14, 2022 People are talking about big Bollywood stars .. U can chill..Nobody is expecting anything from you.. #TheKashmiriFiles https://t.co/WtX3whFLjn — Upadhya Dr 🇮🇳 (@LonelyStranger_) March 14, 2022 -
పైకి మంచిగనే ఉంటది.. కానీ ఒక్కోసారి.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే!
సాక్షి,నేరడిగొండ(అదిలాబాద్): ప్రస్తుతం విద్య నుంచి మొదలు సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, శుభాకాంక్షల వరకు.. ఇలా అన్నింటికి కేరాఫ్ అడ్రస్‌గా సోషల్ నెట్వర్కింగ్ నిలుస్తోంది. స్నేహ బంధాలకు కాస్తా సాంకేతికతను జోడిస్తే వచ్చిందే ఫేస్బుక్. యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న సైట్లలో ఇదొకటి. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఫేక్‌ఐడీలు సృష్టించి తప్పుడు పోస్టులు చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయి. జిల్లాలో గతంలో ఫేస్బుక్లో తప్పుడు పోస్టులు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదైన సంఘటనలు ఉన్నాయి. సోషల్ నెట్వర్కింగ్ రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోషల్నెట్ వర్కింగ్ సైట్లు కాలం మారినకొద్ది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ను ఉర్రూతలూపుతున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లు యువతను కట్టిపడేస్తున్నాయి. తమ మనసులోని మాటలు, అభిప్రాయాలు ఏ రోజుకారోజు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోకుండా నిద్రపోని వారు ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు. ఫేస్బుక్లో లాగిన్ అయి ఏదో ఒకటి పోస్ట్ చేస్తేనే కాసంత సరదా లభిస్తుందని చెబుతున్నారు. (చదవండి: Viral Video: క్షుద్రపూజలో వాడిన కోడిగుడ్లు, నిమ్మకాయ తిన్న పోలీస్.. హిజ్రాతో పాటు ముగ్గురిని.. ) అద్భుతమైన ఫామ్‌గా ఫేస్బుక్ సుదూర తీరాల్లో ఉన్న స్నేహితులను కలుపుతూ జీవితంలో మధుర జ్ఞాపకాలు పంచుకునేందుకు అద్భుతమైన ఫామ్‌గా ఫేస్బుక్ నిలుస్తోంది. స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుపుకోవడం, మనసులోని మాటలను రాతపూర్వకంగా చెప్పగలడంలో ఫేస్బుక్ ప్రధానంగా నిలుస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా నిరంతర మార్పులు చేసుకుంటూ కొత్త హంగులతో ముందుకు సాగుతోంది. స్నేహితులందరూ కమ్యునిటీ పోర్టల్‌గా ఏర్పడి సభ్యత్వం తీసుకుంటే ఉత్తర, ప్రత్యుత్తరాలు చేసుకోవడం ఫేస్బుక్లో చాలా సులభం. విదేశాలతోపాటు ఇత ర రాష్ట్రాల్లో ఉండే స్నేహితులు, బంధువులకు క్షణా ల్లో సమాచారాన్ని చేరవేసే సాధనంగా పనిచేస్తుండడంతో రోజురోజుకు అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. ఫేస్బుక్ మిస్ అయిన ఫ్రెండ్స్‌ను కలవచ్చు. స్నేహితులు, బంధువులతో నిత్యం కాంటాక్ట్‌లో ఉండవచ్చు. ఫేస్బుక్ ద్వారా వివిధ సంఘటనలు, విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. విష వలయంలో.. లక్షల మంది ఫ్రెండ్స్.. కొన్ని మిలియన్లు సభ్యులున్న ఫేస్బుక్ ఓ మాయలోకం. కొందరు దీనిని మంచితోపాటు చెడు కోసం కూడా వినియోగించుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్లో సరదాగా మొదలైన బ్రౌజింగ్‌తో తెలియకుండానే యువత విష వలయంలో చిక్కుకుంటోంది. ఫ్రెండ్స్‌తో ఫేస్బుక్లో సరదా అంశాలే తప్ప వ్యక్తిగత అంశాలు ప్రస్తావించకుండా ఉంటేనే మంచిదని వ్యక్తమవుతుంది. జాగ్రత్తలు పాటిస్తే మేలు ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్న సమయంలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత విషయాలు ఫేస్బుక్లో పెట్టడంతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఆన్లైన్ వెబ్‌కెమెరాల ఎదుట జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్ వరల్డ్ పేజీలో ఉన్న సమాచారాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం. పర్సనల్ ఫొటోలు పెట్టకపోవడమే ఉత్తమం. సోషల్నెట్వర్క్కు బానిసలుగా మారకూడదు. ఫేస్బుక్ ద్వారా జిల్లా వాసికి రూ.1.80 లక్షల టోకరా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామానికి చెందిన పెందూర్ నరేందర్ అనే యువకుడు గత నెల 28న ఫేస్బుక్లో ట్రాక్టర్ విక్రయానికి సంబంధించిన సమాచారం చూశాడు. ఆ ట్రాక్టర్ తనకు కావాలని యజమానితో ఫేస్‌బుక్‌లోనే కామెంట్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఆర్మీ అధికారి అని చెప్పి పాన్‌కార్డు, ఆర్మీకార్డ్ చిత్రాలను ఫోన్ ద్వారా చూపించాడు. రూ.2 లక్షల విలువైన ట్రాక్టర్ అని చెప్పి రూ.1.60 లక్షలకు విక్రయించడానికి బేరం కుదిరింది. విడతల వారీగా ఆయన బ్యాంక్ ఖాతాలో వేశాడు. ట్రాక్టర్ బీమా కోసం ఇంకో రూ.24 వేలు కావాలని ఆ వ్యక్తి అడగడంతో అనుమానం వచ్చి నాకు నీ ట్రాక్టర్ అవసరం లేదని, డబ్బులు తిరిగి పంపించాలని యువకుడు చెప్పాడు. చివరకు నిండా మునిగానని తెలుసుకుని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
త్రివిక్రమ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్
Sai Rajesh Strong Counter To Netizen Tweet On Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ గురించి ఏ తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్‌లు ఆడియెన్స్ చెవుల్లో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అనేకమందిని ఆలోచింపజేస్తాయి. తెలుగు మాటలు, తెలుగు పదాలు, తెలుగు భాష అంటే అమితమైన గౌరవం, ఇష్టం. స్టేజీపైనా కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఆయన చెప్పే మాటలు ఆచరించేలా ఉంటాయి. హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉండటం కామన్. కానీ డైరెక్టర్లకు, వారి డైలాగ్‌లకు సైతం ఫ్యాన్స్ ఉంటారని చెప్పిన అతి కొద్దిమంది దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించి హిట్ కొట్టారు త్రివిక్రమ్. ఈ సినిమా గురించి ఆపాదిస్తూ త్రివిక్రమ్‌పై తాజాగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ''అల వైకుంఠపురంలో మూవీ తర్వాత త్రివిక్రమ్ ఏ చిత్రానికి దర్శకత్వం చేయలేదు.. కానీ రెండేళ్లలో డైలాగ్స్ రాసి రూ. 50 కోట్లు సంపాదించాడు'' అంటూ ఒక వెబ్సైట్ వార్త రాసింది. ఈ న్యూస్‌కు ఒక నెటిజన్ తనదైన శైలీలో రిప్లై ఇస్తూ 'ఇదిరా లైఫ్ అంటే..' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'రూ. 1500లతో రూమ్ షేర్ చేసుకుని, 50కిపైగా మూవీస్‌కి ఘోస్ట్ రైటర్‌గా పనిచేసి, మొదటి బ్రేక్ కోసం పదేళ్లు ఎదురుచూసిన అతనికి ఇది ఊరికే రాదు' అని సమాధానమిచ్చాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
బొద్దుగా ఉందని ట్రోలింగ్! పదకొండు కిలోలు తగ్గిన నటి!
ఆ సమీరా.. ఈ సమీరాయేనా? అనేంతగా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాక సమీరా రెడ్డి బాగా లావయ్యారు. మరీ ఇంత బొద్దుగానా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా. అప్పుడు సమీరా ‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం’’ అంటూ తల్లయ్యాక బరువు పెరిగి, బాధపడే అమ్మాయిలను ఉద్దేశించి, నాలుగు మంచి మాటలు కూడా చెప్పారు. అలాంటి సమీరా బరువు తగ్గే పని మీద పడ్డారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం. ఏడాదిలో దాదాపు పది కిలోలు తగ్గారామె. ‘‘గత ఏడాది ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాను. అప్పుడు 92 కిలోలు బరువు ఉండేదాన్ని. ఇప్పుడు 81కి చేరుకున్నాను’’ అన్నారు సమీర. అంటే.. బరువులో పదకొండు పోయే పోచ్ అన్నమాట. ఇక బరువు తగ్గడం వల్ల ఎలా ఉంది? ఎలా తగ్గాలో సమీర చెప్పారు. ► బరువు తగ్గాక నా ఎనర్జీ లెవల్స్ బాగా పెరిగాయి. అలాగే ఏకాగ్రత పెరిగింది. ఇంతకుముందు కంటే చురుకుగా ఉంటున్నాను. నేను బరువు తగ్గడానికి ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ చాలా ఉపయోగపడింది. అంటే.. అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం, రాత్రిపూట అల్పాహారం తీసుకోవడం వంటిది. ► క్రమం తప్పకుండా చేసిన వ్యాయామాలు నేను తగ్గడానికి బాగా ఉపయోగపడ్డాయి. ► ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండటానికి మానసికంగా చాలా కృషి చేశాను. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉంటాయో అప్పుడు మన శరీరం తేలికగా ఉంటుంది. ► బరువు తగ్గాలనుకుంటే ఏదైనా ఒక ఆటను ఎంచుకోవాలి. ఆటలు ఆడితే ఫిట్నెస్కి ఫిట్నెస్.. ఫన్‌కి ఫన్ దొరుకుతాయి. ∙మన జీవిత భాగస్వామి మన బెస్ట్ ఫ్రెండ్‌గా మారి, ప్రతి వారం మన ఫిట్నెస్ ప్రోగ్రెస్‌ని చెక్ చేస్తూ ఉంటే.. మనకు ఆశాజనకంగా ఉంటుంది. ► అమాంతంగా బరువు తగ్గడం ప్రమాదం. ఇన్ని నెలల్లో ఇన్ని కిలోలు తగ్గితే మంచిది అని తెలుసుకుని, మన టార్గెట్ అన్ని నెలలపై పెట్టాలి. ► చివరిగా చెప్పేదేంటంటే... మీపై మీరు నమ్మకాన్ని కోల్పో వద్దు. అనవసరంగా ఒత్తిడికి గురి కావొద్దు. -
‘గెడ్డం తెల్లబడుతోంది.. పెళ్లి చేస్కో’.. నెటిజన్‌కి నవదీప్ స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో నవదీప్ ఒకరు. ఒకప్పుడు వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరొందిన నవదీప్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా అలరిస్తున్నాడు. ఆ మధ్యలో ‘అల వైకుంఠపురములో ’చిత్రంలో బన్నీ ఫ్రెండ్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘మోసగాళ్లు’చిత్రంలోనూ హీరో విష్ణు స్నేహితుడిగా కనిపించారు. ప్రస్తుతం సన్నీ లియోని ప్రధాన పాత్రలో నటిస్తున్న వీరమాదేవి చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. దాదాపు 35 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లికి మాత్రం ఇంకా టైమ్ ఉంటుంది అంటున్నాడు నవదీప్. అయితే నెటిజన్స్ మాత్రం ‘ఇంకెప్పుడు పెళ్లి బాబు..’అంటూ ప్రతిసారి కామెంట్ చేస్తుంటారు. వాటికి చాలా ఫన్నీగా ఆన్సర్ ఇస్తుంటాడు నవదీప్. తాజాగా ‘గడ్డం నెరిసిపోతుంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకో’ అని సలహా ఇచ్చి ఓ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. 'అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా’అని నవదీప్ కౌంటర్ ఇచ్చాడు. Oddhu ra sodhara :) pic.twitter.com/IYKSAGFDVE — Navdeep (@pnavdeep26) January 23, 2022 -
వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. లక్షల్లో రోజువారీ కేసులు వెలుగు చూస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ ఉద్ధృతి పెరడగంతో రాష్ట్రాలన్నీ అలెర్ట్ అయ్యాయి. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ దిశగా ఆంక్షలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింత దారుణంగా ఉంది. అయితే పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ఈ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుంది. Keeping #COVID19 in mind, Weekend Curfew shall be imposed in Delhi tomorrow onwards. If you have any questions related to it, #DelhiPolice will answer them. Please drop your queries in comments or tweet it us using #CurfewFAQ@CPDelhi#DelhiPoliceCares pic.twitter.com/CySSo1tipu — #DelhiPolice (@DelhiPolice) January 6, 2022 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఇంట్లోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అయితే వీకెండ్ కర్ఫ్యూపై ప్రజల మెదల్లో ఎన్నో సందేహాలు మెదులుతున్నాయి. ఈ క్రమంలో కర్ఫ్యూపై ఏమైనా సందేహాలుంటే సోషల్ మీడిమా వేదికగా తమను ప్రశ్నించవచ్చని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ వింత సందేహం వ్యక్తం చేశాడు. ‘వీకెండ్లో మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ క్రికెట్ ఆడొచ్చా’ అని పునీత్ శర్మ అనే ట్విట ర్యూజర్ పోలీసులను ప్రశ్నించాడు. చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు That’s a ‘Silly Point’, Sir. It is time to take ‘Extra Cover’. Also, #DelhiPolice is good at ‘Catching’. https://t.co/tTPyrt4F5H — #DelhiPolice (@DelhiPolice) January 7, 2022 నెటిజన్ విచిత్ర ప్రశ్నకు పోలీసులు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా క్రికెట్ భాషలోనే పంచ్‌లతో రిప్లై ఇచ్చారు. ‘అది 'సిల్లీ పాయింట్' సార్. ఇప్పుడు 'ఎక్స్ట్రా కవర్' అవసరం. అంతే కాదు. ఢిల్లీ పోలీసులు బాగా 'క్యాచింగ్' (పట్టుకోగలరు) చెయ్యగలరు’ అని బదులిచ్చారు. పునీత్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో పోలీసుల ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: పెద్దయ్యాక ఏమవుతావ్.. రిపోర్టర్ ప్రశ్నకు పిల్లవాడి దిమ్మతిరిగే సమాధానం -
ఇది బాధ్యతారాహిత్యమంటూ డైరెక్టర్‌పై ట్రోల్స్, నెటిజన్లకు హరీశ్ శంకర్ ఘాటు రిప్లై
ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను షేర్ చేసిన ఓ వీడియోపై సదరు నెటిజన్ స్పందించిన తీరుకు ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కాగా ‘ఒమిక్రాన్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేయవద్దు. కేసులు పెరుగుతున్నాయి. కానీ మరణాలు మత్రం నమోదు అవ్వడం లేదు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసంర లేదు’ అంటూ ఓ వైద్యుడు చెప్పుకొచ్చిన వీడియోను హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. చదవండి: హీరోయిన్‌కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ.. ఒమిక్రాన్ వెరియంట్ పట్ల ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన సదరు వైద్యుడు వీడియో పంచుకున్న హరీశ్ శంకర్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మరికొందరూ నెటిజన్లు ‘హరీశ్ శంకర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ వెరియంట్‌పై ప్రజల్లో ఆందోళన, భయం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అయితే ప్రజల్లో భయం పోయి విచ్చలవిడిగా వ్యవహరిస్తారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారికొ హరీశ్ శంకర్ తనదైన శైలితె ఘాటుగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ ‘ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారు’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కాగా హరీశ్ శంకర్ సోషల్ మీడియాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ నెటిజన్లతో పంచుకోవడంతో పాటు పలు సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. అలాగే ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు.. దేశలోని రాజకీయ పరిణామాలపై ట్విట్టర్ వేదికగా స్పదిస్తుంటారు. అంతే కాదు వింతలు విశేషాలను పంచుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించే వీడియోలను తరచూ తన పేజ్ ద్వారా నెటిజన్లకు, తన ఫాలోవర్స్‌కు అందిస్తుంటాడు. Am glad that stupids like u disappointed because guys like u never wanna give a hope to people even when an expert says something good and also he insists on precautions repeatedly !! https://t.co/tD5v3m80C5 — Harish Shankar .S (@harish2you) January 8, 2022 -
ఆ సీక్రెట్ చెప్పమన్న నెటిజన్.. నటి రిప్లైకి నోట మాట రాలేదు!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్ బజ్వా. టాలీవుడ్లో ‘మొదటి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు. ఆ తర్వాత బాస్ , పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో తెలుగు తెరపై నెమ్మదిగా కనుమరుగైంది ఈ బ్యూటీ. దీంతో తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. అడపా దడపా ఈ భాషల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన అందచందాలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది పూనమ్. సాధారణంగా ఫోటోలతో తన ఫాలోవర్లకు పిచ్చేక్కించే ఈ బ్యూటీ.. ఈ సారి ముచ్చటించాలని అనుకుంది. దీంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నుంచి ఓ చిలిపి ప్రశ్న పూనమ్‌కు ఎదురైంది. అతను.. "మీ సెక్సీ స్ట్రక్చర్ వెనుకు దాగున్న రహస్యం ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి "పూనమ్" ఏమాత్రం తడబడకుండా, కూల్‌గా... నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేస్తాను అని బదులిస్తూ తాను యోగ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో అమ్మడు ఇచ్చిన రిప్లేకి సదరు నెటిజన్‌కు నోట మాట రాలేదు. చదవండి: Bigg Boss 5 Telugu: ఆ వైరల్ వీడియోపై షణ్ముఖ్ క్లారీటీ -
మైనస్ 1 డిగ్రీ చలిలో.. షర్ట్ తీసేసి పరుగులు పెడుతున్న హీరో.. వీడియో వైరల్
గతంలో సినిమా హీరోలు నటన, డాన్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. ట్రెండ్ మారుతుండడంతో కాలానుగుణంగా హీరోలలోనూ మార్పులు వచ్చాయి. ప్రస్తుతం హీరోలు తమ శరీరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఒకప్పుడు సిక్స్ ప్యాక్ హీరోల జాబితాలో ఒకరో ఇద్దరో ఉంటే ప్రస్తుతం చాలా మంది ఆ జాబితాలో చేరిపోయారు. ఇక ప్రత్యేకంగా బాలీవుడ్లో.. టైగర్ ష్రాఫ్ తన బాడీ ఫిట్‌గా ఉంచడంలో ఏ మాత్రం రాజీ పడడన్న విషయం తెలిసిందే. అలా శ్రద్ధ తీసుకుంటున్నాడు కాబట్టే బీ టౌన్లో రకరకాల స్టంట్స్ చేస్తూ యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా టైగర్ ‘గణ్‌పత్’ సినిమా షూటింగ్ యూరప్‌లో జరుగుతోంది. యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం ఉంటుందన్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్ అంతటి చలి వాతావరణంలో కూడా ఉదయాన్నే లేచి షర్టు లేకుండా కేవలం షార్ట్స్ ధరించి అలా జాగింగ్ చేశాడు. ఆ వీడియోని తన ఇన్‌స్టా అకౌంట్లో షేర చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వాళ్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అందులో దిషా పటానీ.. ‘లోల్’, రకుల్.. ‘వావ్! అంత చలిలో ఎలా?’ అంటూ స్పందించారు. ‘గణ్‌పత్’ చిత్రంలో టైగర్ సరసన కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ చిత్రం జాకీ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఇది వరకే వీరిద్దరు హీరోపంతీ అనే సినిమాలో కలిసి నటించారు. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) చదవండి: Vicky Kaushal-Katrina Kaif: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకొచ్చిన కత్రినా, విక్కీ కౌశల్ -
ముందు జిప్ వేసుకో.. బాలీవుడ్ నటి డ్రెస్సింగ్‌పై విపరీత ట్రోలింగ్
ఇటీవల సెలబ్రిటీలు వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తారలు తమ అభిమానులతో చాట్ చేయడంతో పాటు వారి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. కొందరు షేర్ చేసే వీడియోలు.. ఒక్కోసారి పాజిటివ్ కామెంట్స్ రాగా కొన్ని సార్లు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ నటి తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇంకేముంది ఆ వీడియో చూసిన నెటిజన్లు ఈ హాట్ బ్యూటీని విపరీతంగా ఆడేసుకుంటున్నారు. అసలీ అమ్మడేం చేసింది. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే...? బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే పెద్దగా తెలియదేమో కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే మైండ్‌లో టక్కున గుర్తు వస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లిన ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ట్రెండీ హీరోయిన్గా మారింది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగారు. తాజాగా ఈ బ్యూటీ ఓ డ్రెస్ వేసుకొని కనిపించింది.దాదాపు 10 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఒక డ్రెస్సులో కనిపించిన ఉర్ఫీ ఆ తరువాత జిప్ ఓపెన్ చేసి ఉన్న డ్రెస్సులో ప్రత్యక్షమవుతుంది. అయితే ఆ డ్రెస్ కాస్త అభ్యంతకరంగా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు. ఉర్ఫీ మరీ ఇలా కనిపిస్తుందని ఊహించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి ‘డ్రెస్ ఓకే గానీ.. జిప్ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రెస్ అంటారా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Urfi (@urf7i) చదవండి: ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి -
బాలయ్య ‘అఖండ’ ట్రైలర్: నెట్టింట మొదలైన మీమ్స్ రచ్చ..అన్నీ అరాచకాలే!
టాలీవుడ్లో నటసింహం నందమూరి బాలక్రిష్ణ, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగా మాస్ కాంబో వినే ఉంటాం అయితే వీరిద్దరిది ఊర మాస్ కాంబో. ప్రస్తుత రోజుల్లో బాలయ్యతో పక్క యాక్షన్ చిత్రం తీయాలంటే అది తనతోనే సాధ్యమని నిరూపించుకున్నారు బోయపాటి. పైగా ఇప్పటి వరకు ఈ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడమే కాక సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కలయికలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమాపై అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉండడంతో బాలయ్య ఫ్యాన్స్‌కు దీపావళి మళ్లీ వచ్చినట్లు ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోపై కోటి వ్యూస్‌ను తెచ్చుకొని యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది. మరో వైపు ఈ సినిమా ట్రైలర్‌పై సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు, నెటిజన్లు సినిమాలోని సన్నివేశాలపై మీమ్స్ క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘అఖండ’ ట్రైలర్ మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. అందులో.. ట్రైలర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఇలా ఏ ఒకదాన్ని వదలకుండా మీమ్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ ట్రైలర్‌పై ఫన్నీగా మీమ్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. Bulldozer Balayya Babu🔥🔥🔥 #AkhandaTrailerRoar #NandamuriBalakrishna pic.twitter.com/NIjlLfmMIx — Prabhas (@Prabhas280) November 14, 2021 Typical Indian mother's waking up kids by changing time be like:#AkhandaTrailerRoar pic.twitter.com/iaCrPHUoCe — Prasanth🎶 (@EvarSirMeeru) November 14, 2021 Theaters situation on December 2nd🔥💥🥁 Maass Jathare 🥁🔥💥#AkhandaTrailerRoar pic.twitter.com/1ffrMvUWrG — Balayya Trends (@NBKTrends) November 14, 2021 Me in theater #AkhandaTrailerRoar pic.twitter.com/uSINv0pTkW — Deepika (@Deepika__DC) November 14, 2021 -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నిజంగా ఈ వీడియోలో ఉన్నది ఎర్ర తేళ్లేనా?
కరోనా మహమ్మారికి చైనాలోనే మూలాలున్నాయని.. చైనా ప్రజల అడ్డమైన ఆహారపు అలవాట్ల వల్లనే కరోనా వ్యాధికి మూలమని ఇప్పటికే ఎన్నో విమర్శలు వచ్చాయి. పాముల నుంచి మొదలు తేళ్లు, గబ్బిలాలు, పిల్లులు, కుక్కలు.. ఇలా ఒకటా రెండా భూమిపై ఉండే ప్రతి జీవినీ చైనీయులు లాగించేస్తారు. కొన్నింటిని ఉడికించి, మరికొన్నింటినైతే పచ్చిగా ఆ జీవి ప్రాణాలతో ఉండగానే కరకరమని నమిలేస్తారు. దీని వల్లనే కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయని చైనాపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తన ఇంటి టెర్రస్‌పై ఏకంగా తేళ్లను సాగు చేస్తున్న వీడియో ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. సాధారణంగా ఇంట్లో కోళ్లను, కుక్కలను పెంచుతున్నట్లు ఆ యువతి తన ఇంటిపై ఎర్ర తేళ్లను పెంచుతోంది. ఒకటో రెండో ఉంటే ఒకవేళ సరదా కోసం అనుకుంటాం. కానీ తన ఇంటి టెర్రస్‌పై వేల సంఖ్యలో తేళ్లు సాగవుతున్నాయి. ఈ తేళ్ల సాగుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోపై.. చైనీయులు మరో కొత్త వైరస్‌కు పునాది వేస్తున్నారని కొందరు, ఎందుకు చైనీయులు అన్నిటినీ తేలిగ్గా తీసుకుంటారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఇవి తేళ్లేనా? అని ఇంకొంత మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nature | Travel | animal (@naturelovers_ok) ఈ వీడియోను చూసిన నెటిజెన్లు నోరెళ్లబెడుతున్నారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుంటే మరో కొత్త వ్యాధి తప్పదని అభిప్రాయపడుతున్నారు. కరోనా మళ్లీ విరుచుకుపడే అవకాశముందని వాపోతున్నారు. తాజాగా వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న యువతి చైనాకు చెందినదిగా ఇంకా ధృవీకరణ కాలేదు. తను చైనా యువతి అనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కానీ చాలా మంది నెటిజన్లు మాత్రం తను ఖచ్చితంగా చైనా యువతే అని అభిప్రాయపడున్నారు. ఇలాంటి పనులు చైనాలో కాకుంటే ఇంకెక్కడ జరుగుతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచం ఇంకెన్ని భయంకరమైన కొత్త వ్యాధులను చూడాల్సి వస్తుందోనని సోషల్ మీడియా వేదికగా విమర్షిస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్ కథపై నెటిజన్ సందేహం.. అదిరిపోయే రిప్లై వచ్చిందిగా
టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానోఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి టేకింగ్ , మరో వైపు టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు లేదు. గతంలో రాజమౌళి మనకు తెలిసిన కథ కాకుండా ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు చెప్పక్కనే చెప్పారు. అయితే జక్కన సినిమా అంటే రకరకాల ఉహాగానాలు రావడం సహజమే. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమాపై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో.. 1920 లో స్వాతంత్ర సమరయోధులు ఇంటి నుంచి వెళ్లిన వాళ్ళు రెండేళ్ళ అనంతరం తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ రెండేళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్ ని ఫిక్షన్ గా తెరకెక్కించాలని రాజమౌళి అనుకున్నాడని చెప్పాడు. అయితే జక్కన్న మనకు తెలిసిన కథని కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేసి చూపిస్తున్నారా అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు ఆ నెటిజన్ . దీనికి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీటర్ లో ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ‘ ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా క్లియర్ గా.. మీకు తెలిసిన స్టోరీ ఏదీ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఉండదు. మైండ్ లో నుండి అవ్వన్నీ తీసేసీ హాయిగా సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు. Ori Mee Dumpalu Thega…. Meeerekkada Dorikaaru ra… Director press meet petti cheppaaru kada clear ga… Meeku thelisina story edi kudaa cinema lo undadu. Mind lo nunchi avanni theesesi enjoy the euphoria and film!! — RRR Movie (@RRRMovie) November 10, 2021 చదవండి: Anasuya: అవసరమైతే గుండు కొట్టించుకోడానికి రెడీ అంటున్న యాంకర్ అనసూయ -
చిప్స్ ప్యాకెట్లో అది చూసి షాక్ అయిన కస్టమర్..!
లండన్: ఇటీవల ఆన్లైన్లో వస్తువులు కొంటున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలా కొనుగోలు చేసిన వాటిలో ఒకటికి బదులు వేరొక వస్తువులు కస్టమర్లు అందుకున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఆనలైన్‌లోనే కాకుండా కొన్ని సార్లు ఆఫ్‌లైన్ కస్టమర్లకు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆలూ చిప్స్ ప్యాకెట్ కొని తెరిచి చూడగా అందులో చిప్స్‌కు బదులు ఒక ఆలుగడ్డ ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. లింకన్షైర్లోని ఉప్పింగ్‌హామ్ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడైన డేవిడ్ బాయ్స్ ఈ నెల 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్ తినాలని ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో ఒక బంగాళదుంప గడ్డ మాత్రమే ఉండడం చూసి ఖంగుతిన్నాడు. షాక్‌లోంచి తేరుకుని దాన్ని ఫొటో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో పాటు ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌గా.. ‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్ తెరిచాను. అందులో క్రిప్స్ కనిపించలేదు. కేవలం బంగాళాదుంప గడ్డ మాత్రమే ఉందని తెలిపాడు. దీనిపై సదరు సంస్థ స్పందిస్తూ అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని.. ఆ ప్యాకెట్‌ను వారికి అందజేస్తే తమ బృందం నుంచి వివరాలు సేకరిస్తామంటూ రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారి సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. So I opened a bag of @KETTLEChipsUK today to find no crisps. Just a whole potato. 😮 pic.twitter.com/PGEqGMqIWF — Dr David Boyce (@DrDavidBoyce) October 16, 2021 చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి.. -
వైరల్: నక్క తోక తొక్కిన కుక్క ! వీఐపీలా..
సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులంటే ముఖ్యంగా కుక్కనే ఎక్కువ మంది పెంచుకుంటారు. ఆ జాబితాలో కొందరు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. కొందరు వీటిని అల్లారు ముద్దుగా కూడా పెంచుకునే వాళ్లు ఉన్నారు. ఇటీవల తన పెంపుడు కుక్క కోసం ఓ మహిళ ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: Funny Video: ఏయ్ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు ) తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం రైలులోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేశాడు. అంతేనా ఆ పెట్ డాగ్ రైలు జర్నీపై ఓ వీడియోని చిత్రీకరించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణీకుడు లాబ్రడార్లు, బాక్సర్లు వంటి చిన్న లేదా పెద్ద కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. కానీ పెంపుడు జంతువులు మాత్రం ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. మరొక నిబంధన ఏమిటంటే తమ పెంపుడు జంతువుల కోసం సదరు వ్యక్తి రైలులోని మొత్తం కంపార్ట్మెంట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న కుక్క పిల్లలు అయితే వాటి కోసం కొన్ని కంపార్ట్మెంట్లలో బాక్స్‌లు ఉంటాయి. వాటికి ఆహారం యజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by Rio (@alabnamed_rio) చదవండి: చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే.. -
ఆ రాయి అలా ఎందుకుందో అర్థంకాక తలలుపట్టుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పాలి. ఇటువంటి తరహాలో ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఓ పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో అది. ఆ బండరాయి సరిగ్గా మధ్యలో చీలిపోయి ఉంటుంది. ఇందులో వింత ఏమిటంటే.. మధ్యలో చీలిన ఆ రాయి అలా కట్ చేయడం మనుషుల వల్ల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్‌లో మనం చూడవచ్చు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి కారణంగా పలు సిద్ధాంతాల పేర్లను కామెంట్ చేస్తున్నారు. ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదేనా ఆ రహస్యం బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గౌరవ పరిశోధనా సహచరుడు అయిన లూయిస్ ఈ రాయి వెనుక రహస్యాన్ని చేధించినట్లు తెలిపారు. 'ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే బండరాయి ఆ రకంగా సగానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు. చదవండి: Old Couple Love story: డేటింగ్ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి -
ఈ ట్రెండ్ సామాన్యులను కూడా క్రియేటర్స్‌గా మారుస్తోంది..
ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు ఇప్పుడు సృజనాత్మక వారధులు. యువ విజయాలకు సారధులు. ఈ ట్రెండ్ సామాన్యులను కూడా క్రియేటర్స్‌గా మారుస్తున్న నేపధ్యంలో చక్కని కంటెంట్‌ని సృష్టిస్తున్న క్రియేటర్లకు విభిన్న మార్గాల్లో చేయూతని అందించేందుకు ఆయా సోషల్ మీడియా వేదికలు పలు కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయి. అందులో భాగంగా ‘క్రియేటర్స్ డే’ పేరిట ఒక సరికొత్త ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పేస్బుక్ డైరెక్టర్ పరాస్ శర్మ సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా.. ఇంటర్నెట్ సేవలు ధరల పరంగా కూడా అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచీ క్రియేటర్స్ వెల్లువెత్తుతున్నారు. మహారాష్ట్రలోని జల్నా, హర్యానాలోని హిసార్, అసాన్సోల్, షోలాపూర్ వంటి చోట్ల నుంచి కూడా క్రియేటర్స్ వస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. క్రియేటివ్ కంటెంట్‌కు సంబంధించి సెలబ్రిటీలైనా, సామాన్యులైనా మాకు క్రియేటర్స్ అంతా సమానమే. క్రియేటివిటీకి...తోడ్పాటు.. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల ద్వారా ఇప్పటికే పేరొందిన లేదా ఔత్సాహిక క్రియేటర్ అయినా సరే... పలు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కొత్త వారి కోసం శిక్షణ అవకాశాలు, పేరొందిన వారి కోసం బిజినెస్ మోడల్, కమ్యూనిటీస్ ఏర్పాటుకు మేం సహకరిస్తున్నాం. క్రియేటర్ల కోసం క్రియేటివ్, మోనెటైజేషన్ టూల్స్ అందిస్తున్నాం. అదే విధంగా లెర్నింగ్, మెంటర్ షిప్, కొలాబరేషన్ అవకాశాలు కూడా. అలాగే కమ్యూనిటీని నిర్మించుకోవాలనుకునే క్రియేటర్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌కు పలు అనుబంధ సేవలు ఉన్నాయి. ఎవరైతే తమ ఉత్పత్తిని విక్రయించాలనుకోరో.. దాని కోసం ఇన్–స్ట్రీమ్ యాడ్స్ వంటి మోనెటైజేషన్ టూల్స్ ఉన్నాయి. అలాగే క్రియేటర్స్ కెరీర్ కోసం కొన్ని లెర్నింగ్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తున్నాం తాజాగా బార్న్ఆన్ ఇన్స్టాగ్రామ్ పేరుతో లాంచ్ చేసిన ఇ లెర్నింగ్ ప్రోగ్రామ్ కూడా అలాంటిదే. క్రియేటర్స్ డే ఎందుకంటే.. క్రియేటర్లకు సహకరించేందుకు డిజైన్ చేస్తున్న కార్యక్రమాల్లో ఇదొక భాగం. సృజనాత్మక కంటెంట్‌ను సృష్టిస్తున్నవారు ఇతర క్రియేటర్లతో పరిచయాలు, భావాలను పంచుకోవాడాలను కోరుకుంటున్నారు.. ఈ నేపధ్యంలో వృద్ధి పధంలో ఉన్నవారి కోసం వారి కి చక్కని కెరీర్ నిర్మాణం దిశగా నడిపించేందుకు వేలాది మంది పాల్గొనేటా క్రియేటర్స్ డేని నిర్వహిస్తున్నాం. ఏడాది మొత్తం క్రియేటర్స్ కోసం వర్క్‌షాప్స్, ట్యుటోరియల్స్ కూడా నిర్వహంచనున్నాం. ఏడాదిలోపు కనీసం 2వేల మంది క్రియేటర్లతో కలిసి పనిచేయాలని ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నాం. తెలుగుప్రజలు..సృజనశీలురు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సృజనశీలురు ఉన్నారు. అందుకే ఇవి మాకు కీలకంగా మారాయి. ఎక్కడెక్కడ వారో నిరంతరం తమ క్రియేటివిటీకి పదను పెడుతూ సోషల్ మీడియా ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. సూపర్ ఉమన్‌గా పేరొందిన మహాతల్లి... ఇందుకో ఉదాహరణ. అలాగే బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకున్న అలేఖ్య హారిక కూడా మరో నిదర్శనం. వినోదం, విజ్ఞానం కూడా.. ఆహార విహారాల నుంచి మరెన్నో అంశాలపై క్రియేటివ్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయి. ఉదాహరణకు హ్మ్, విలేజ్ ఫుడ్ ఫ్యాక్టర్... వంటి పేజీల ద్వారా అద్భుతమైన వంటకాలు, వండే విధానాలు ప్రజలకు చేరుతున్నాయి. ఇక కరోనా సందర్భంగా ఈజీ కుక్ రిసిపీలు కూడా వెల్లువెత్తాయి. వరల్డ్ మరాఠా ఆర్గనైజేషన్, గుర్గావ్ హెల్ప్‌లైన్ వంటివి ఏర్పాటై పలు ప్రాంతాల్లో వైద్య సేవలు కూడా అందించాయి. చదవండి: వైరల్: 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం? -
ఓ పక్క ఫోన్.. మరో పక్క కొండ చిలువ.. భళా బాలిక అంటున్న నెటిజన్స్
పాములంటే అందరికీ భయమే. అవి కంటికి కనపడితే చాలు పరుగుల పందెంలో పోటీలా పరుగెత్తుతాము. అయితే కొంతమంది పాములను కూడా పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అలాంటి పెంపుడు పాములు ఆ ఇంటి వారికి ఎటువంటి హాని కలిగించవు. అలా అని వాటితో ఏమరుపాటుగా ఉండి అవి హాని కలిగించిన ఘటనలు ఉన్నాయి. ఇందులో అంత రిస్క్ ఉండగా ఓ అమ్మాయి ఏకంగా పామును పెంచుకుంటుంది. అంతేనా తన ఒడిలో కూడా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ బాలిక తన ఇంటి వెలుపల కూర్చొని మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఓ పెద్ద కొండ చిలువ ఆ ఇంటి ప్రాంగణంలో పాకుతూ ఆ బాలిక ఒడిలో తల పెడుతుంది. ఆ బాలిక కూడా ఎలాంటి భయం, బెరుకు లేకుండా.. ఒక చేత్తో ఫోన్ ఆపరేట్ చేస్తూ మరో చేత్తో పసి పాపను తడిమినట్లుగా ఆ కొండచిలువను తడుముతూ ఉంది. ఈ వీడియో సోషల్‌మీడియోలో షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే గాక ఆ పాప ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. View this post on Instagram A post shared by Travel | Nature | Adventure (@yournaturegram) చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ -
మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది
ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటుంటే బోర్ కొట్టడం ఖాయం. అందుకే రోజూ కొత్త కొత్త వంటలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల సోషల్‌మీడియలో కొత్త వంటకాల హవా పెరిగిందనే చెప్పాలి. పిజ్జా అంటే తెలియని వాళ్లే కాదు తినని వాళ్లు కూడా ఉండరేమో, అంతలా నచ్చుతుంది మనకి ఆ వంటకం. ఇక ఇందులో బోలెడు వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే మనం రెగ్యులర్‌గా తినే విదేశీ పిజ్జా లాంటిది కాకుండా చిన్న మట్టి కప్పులో అదిరపోయే పిజ్జాను తయారు చేస్తామంటున్నారు సూరత్‌కు చెందిన ఫుడ్ స్టాల్. తాజాగా ఆ పిజ్జా మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మొక్కజొన్న, టమాటా, వెన్న, సాస్ వంటివి కుండలో వేసి... మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసి... ముంత పిజ్జాను తయారుచేస్తున్నారు. దానికే కుల్లడ్ పిజ్జా లేదా కుల్హడ్ పిజ్జా అనే పేరు పెట్టారు. కుల్లడ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. ఈ పిజ్జాని తయారీని ఓ వీడియోలో చిత్రీకరించగా దాన్ని ఆమ్చీ ముంబై ఛానెల్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది నెటింట చక్కర్లు కొడుతూ నెటిజన్ల నోరూరిస్తోంది. చదవండి: బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు! -
ఐఫోన్- 13 రిలీజ్..! విపరీతంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..! అందులో జోమాటో కూడా..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను ఆపిల్ మంగళవారం రోజున లాంచ్ చేసిన విషయం తెలిసిందే. లాంచ్ ఈవెంట్లో భాగంగా బాలీవుడ్ క్లాసిక్ దమ్ మారో దమ్ సాంగ్‌ను ప్లే చేసింది. ఐఫోన్-13 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ అనే నాలుగు వేరియంట్లను ఆపిల్ రిలీజ్ చేసింది. ఐఫోన్-13 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్-17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చునని ఆపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 24 నుంచి ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...! తాజాగా ఐఫోన్-13 సిరీస్ స్మార్ట్ఫోన్లపై కొంత మంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐఫోన్-12, ఐఫోన్-13 రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదంటూ ట్విటర్లో నెటిజన్లు మీమ్సీ షేర్ చేస్తున్నారు. నెటిజన్లే కాకుండా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కూడా ట్విటర్లో ఐఫోన్-12, ఐఫోన్-13 మోడళ్లపై తన దైన శైలిలో ట్రోల్ చేసింది. జోమాటో తన ట్విటర్లో ఐఫోన్-13 విషయంలో కెమెరాలను సమాంతరంగా కాకుండా, డయాగోనల్‌గా ఏర్పాటుచేసిందంటూ ట్విట్ చేసింది. ట్విటర్లో..ఐఫోన్-13 లో కేవలం ఒక చిప్‌నే మార్చగా... మిగతా హర్డ్వేర్స్కు ‘న్యూ’ జోడించి న్యూ ఎక్స్పీరియన్స్ పేరిట ఆపిల్ లాంచ్ చేసినట్లు ఓ నెటిజన్ తెలిపాడు. మరో నెటిజన్ మీ దగ్గర ఐఫోన్-12 ఉండి ఉంటే ఐఫోన్-13 మీకు కోసం కాదు అంటూ..ఐఫోన్-13 డిజైన్ విషయంలో ఫోటోషాప్ చేసిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. భిన్నంగా కన్పించపోయినా.. ఐఫోన్ 12తో ఐఫోన్-13 భిన్నంగా కనిపించకపోయినా, ఐఫోన్ 13 లోపల వేగవంతమైన ప్రాసెసింగ్, మెరుగైన బ్యాటరీ జీవితం, కొత్త కెమెరా , వీడియో రికార్డింగ్ మోడ్లతో సహా అనేక అప్గ్రేడ్లను కలిగి ఉందని ఆపిల్ తన లాంచ్ ఈవెంట్ పేర్కొంది.భారత్‌లో ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ ధర రూ. 69,900. 256జీబీ మోడల్ రూ .79,900 , 512జీబీ మోడల్ రూ .99,900 లకు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .79,900, 256జీబీ ధర రూ .89,900 , 512జీబీ మోడల్ ధర రూ. 109,900 గా ఉండనుంది. iPhone 12 vs iPhone 13 pic.twitter.com/V3hzWb0eSQ — zomato (@zomato) September 14, 2021 Here are some big differences between the iphone 12 and 13. What about "new experience"? 😂 #iPhone13 #AppleEvent pic.twitter.com/MgkLWoSsy6 — Dexignko Studio (@dexignko) September 15, 2021 pic.twitter.com/5ynxAV2fky If you currently have iPhone 12, iPhone 13 isn't for you. Save your money.#iPhone13 #AppleEvent — Ƙɑɾɑղ (@karanverma__) September 15, 2021 చదవండి: iPhone: భారీగా తగ్గిన ధరలు, ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త! -
వైరల్: మ్యాగీ మిల్క్‌షేక్.. ‘ఈ గతి పట్టించిన వాడిని చంపేస్తా’
మ్యాగీ అనడం కంటే టూ మినిట్స్ మ్యాగీ అంటే సులువుగా అందరూ గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఏదైనా పుడ్ చేయగలమంటే అది మ్యాగీ న్యూడుల్స్ మాత్రమే అని చెప్పాలి. ఇది సింపుల్ అండ్ ఫాస్ట్ మాత్రమే కాదు టేస్టీ కూడా. అందుకే దీన్ని బోలెడు మంది ఇష్టపడుతుంటారు. ఇక ప్రతి ఒక్కరికీ ఈ పాపులర్ నూడుల్స్ తయారు చేయడంలో ఎవరి సొంత వెర్షన్ వాళ్లకి ఉంటుంది. కొంతమంది సింపుల్ న్యూడుల్స్గా చేసుకోగా, మరికొందరు సూప్‌గా, ఇంకొందరు ఎగ్ న్యూడుల్స్గా.. ఇలా చాలా రకాలే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మ్యాగీ మీద ప్రయోగాలు చేసి ఓ వింత వంటకం చేసి అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటుగా కోపం కూడా తెప్పించాడని చెప్పాలి. ఇంతకీ అతను ఏం చేశాడంటే... రొటీన్ మ్యాగీ తిని బోర్ కొట్టిందేమో పాపం. కాస్త కాదు కాదు.. చాలా డిఫరంట్‌గా ఆలోచించి మ్యాగీ న్యూడుల్స్‌ను మిల్క్‌షేక్ కాంబినేషన్ కలిపి తయారు చేశాడు. ప్రస్తుతం ఈ విచిత్ర పుడ్ కాంబినేషన్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. మ్యాగీ ప్రేమికులంతా ఈ ఫోటోపై వ్యంగ్యంగా స్పందిస్తూ కామెంట్ పెడుతున్నారు. ‘ఓ వెధవ నాకు ఈ ఫోటో షేర్ చేశాడు.. మ్యాగీ మిల్క్ షేక్.. ఇది ఎవడు చేశాడో గానీ వాడు దొరకాలి అని’.. ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరోకరు.. ‘ఎక్కడ నుంచి వస్తార్రా బాబు‘ అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే ఏకంగా కొట్టినంత పని చేశాడు. ‘నోరూరించే మ్యాగీకి ఈ గతి పట్టించినవాడిని చంపేస్తా’ అంటూ ఫైర్ అయ్యాడు. Some idiot share this with me... Maggie Milk-shake.... Jinda pakadna hai in banane waalo ko... 🤢🤢🤢 pic.twitter.com/m0BV8m7zyI — Mayur Sejpal | मयूर सेजपाल 🇮🇳 (@mayursejpal) September 11, 2021 చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం.. -
Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!
'Please don't leave': ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో అనేక మంది ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఫోర్డ్ డోంట్ గో అంటూ సోషల్ మీడియాలో ఫోర్డ్‌తో తమకున్న ఎమోషనల్ బాండింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 9న ఫోర్డ్ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది. - మెయినుద్దీన్ షేక్ అనే వ్యక్తి స్పందిస్తూ ఫోర్డ్ అస్పైర్ కారు కొనుక్కోవడం తన లక్క్ష్యమని, దానికి సంబంధించిన డబ్బును కూడబెట్టానని, ఈ ఏడాది చివరికల్లా కొనుక్కుందామని ప్లాన్ చేశానని పేర్కొన్నాడు. ఫోర్డ్ తాజా నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని, ఫోర్డ్ ప్లీజ్ డోంట్ గో అంటూ కోరాడు No more EcoSport and Endeavour #FordIndia pic.twitter.com/gWRGunXA19 — Car Stuff (@carrelatedstuff) September 9, 2021 - భార్గవ్ పెదకొలిమి అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ... 12 ఏళ్ల నుంచి ఫోర్డ్ కారు కొనుక్కోవాలనేది తన కలని, ఇప్పుడు ఆ కల తీరే సమయం వచ్చినప్పుడే ఫోర్డ్ ఇండియాను వీడి వెళ్లిపోతుందని తెలిసి హార్ట్‌బ్రేక్ అయ్యిందటూ పేర్కొన్నాడు. క్వాలిటీ, కంఫర్ట్, పవర్ఫుల్ ఇంజన్ అందివ్వడంలో ఫోర్ట్ మేటి అని చెబతూ.. ఇండియాను వదిలి వెళ్లొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. - నాకు ఆరేడేళ్ల వయసు నుంచి ఫోర్డ్ కారు సొంతం చేసుకోవాలనే కల ఉండేదని, ఇప్పుడు ఫోర్డ్ ఇండియాను వీడి వెలుతుందనే వార్తలతో నా కల చెదిరిపోయిందంటూ సిద్ధార్థ్ నౌతియాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. I'm at a loss of words. I dreamt of owning a Ford since I was 6 or maybe 7 years old. A childhood dream just got crushed. I wish you had updated your budget vehicles (Figo/Freestyle/Aspire). They were enthusiast's choice and had so much potential. 😢 — Siddharth Nautiyal (@1998_Siddharth_) September 9, 2021 నాట్ లీవింగ్ ఇండియా ఇండియాను వీడి పోతున్నట్టు ప్రకటించగానే నెటిజన్ల నుంచి వెల్లువెత్తున్న ఎమోషనల్ ట్వీట్స్‌కి ఫోర్డ్ ఇండియా స్పందించింది. ఇండియాను తాము వీడి వెళ్లడం లేదంటూ లైట్ బిజినెస్ మోడల్ని అప్లై చేయబోతున్నట్టు తెలుపుతోంది. దీని వల్ల లాంగ్ రన్లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇస్తోంది. Hello, Kunal: Ford is NOT leaving India. A new, asset-light business model is being created with the reforms we announced today. This business model will be more profitable in the long run. ^VG — Ford India Service (@FordIndiaHelp) September 9, 2021 -
వైరల్: అదిరిపోయే స్టెప్పులతో మాధురి దీక్షిత్‌ను దించేసిన బామ్మ
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హడావిడీ చేస్తున్నాయి. ఏ కార్యక్రమం అయిన తమ డ్యాన్స్‌తోనే జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. పెళ్లికూతురు, పిల్లలు, ఆంటీలు, అంకుల్స్ ఇలా ఎవరికి వారే నెట్టింట్లో పాలపులారిటీని సంపాదిస్తున్నారు. అయితే యుక్త వయసులో ఉన్న యువకులు, యువతీలు హుషారుగా డ్యాన్స్ చేయడం తెలిసిందే. అదే వయసు మీదపడిన బామ్మలు సైతం అదే జోరులో కాలు కదిపితే ఎలా ఉంటుంది. ఆ మజానే వేరు కదా.. అచ్చం ఇలానే అనుకుంది ఓ బామ.. చదవండి: బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా.. ఇంకేముంది బాలీవుడ్ నటి మధురి దీక్షిత్ నటించిన దిల్ తో పాగల్ హై సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘కోయి లడ్కి హై’కు హుషారైన స్టెప్పులేసింది. 62 ఏళ్లలోనూ చిన్న పిల్లలా రెండు జడలు వేసుకొని లేత గులాబీ రంగు కుర్తా, తెలుపు పలాజో ధరించిన 62 ఏళ్ల రవి బాల శర్మ అనే బామ్మ ఎంతో ఉల్లాసంగా డాన్స్ చేసింది. అదిరిపోయే స్టెప్పులతో అచ్చం మాధురి దీక్షిత్‌ను దించేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూవ్స్ సంపాదించింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘బామ్మకు బాల్యం తిరిగి వచ్చింది. నువ్వు సూపర్ బామ్మ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: వైరల్: ఆనంద్ మహీంద్రా ట్వీట్లో పొరపాటు.. ‘నేను అమ్మాయిని కాను’ View this post on Instagram A post shared by Ravi Bala Sharma (@ravi.bala.sharma) -
స్వరా భాస్కర్ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు
ముంబై: పాత ఇంట్లో కొత్తగా గృహ ప్రవేశం చేశారు బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్. రెండున్నర సంవత్సరాల తరువాత గత నెలలో స్వరా తను పునర్నిర్మించిన( రినోవేటెడ్) పాత ఇంటిలోకి మారారు. కొత్త ఇంటికి మారిన శుభ సందర్భంగా ఆమె వినాయకునికి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గృహ ప్రవేశ పూజలో పాల్గొన్న ఫోటోలను స్వరా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. వీటిలో ఆమె సంప్రదాయబద్దంగా చీర ధరించి దేవతల ముందు కూర్చొని పూజారుల సాయంతో పూజ చేశారు. ‘దేవుళ్లు ఆమోదించారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. స్వరా భాస్కర్ గృహ ప్రవేశ ఫోటోలను చూస్తుంటే నటి ముఖంలో భక్తి భావన కొట్టొచ్చినట్ల కనిపిస్తోంది. అయితే వీటిని చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం ఆమె గృహ ప్రవేశ పూజ నిర్వహించడమే. ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టే స్వరా ఇప్పుడు ఇలా భక్తి పారవశ్యంలో మునిగిపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ‘మీరు ఎథిస్ట్ అనుకున్నాం కానీ ఇలా పూజలు చేస్తున్నారు వావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) ఇక మరో ఫోటోలో స్వరా భాస్కర్ పూర్తి సరదా మూడ్‌లో మునిగిపోయారు. స్వరా తలపై మట్టి కుండను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఆమె ముఖమంతా సంతోషం వెదజల్లుతుంది. కాగా స్వరా పోస్టులపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొత్త ప్రారంభానికి ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వరా గత నెలలో తన ఇంటికి వస్తున్నట్లు ఓ పోస్టు ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: తాలిబన్లపై పోస్ట్.. ‘స్వరాను 6 నెలలు ఆఫ్గనిస్తాన్‌కు పంపండి’ వావ్! వాట్ ఏ బ్యాలెన్స్..సోనూ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
నెటిజన్ రూ. కోటి డిమాండ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సోనూసూద్
Sonu Sood: సోషల్ మీడియాతో ద్వారా సోషల్ సర్విస్ ఎంత గొప్పగా చెయ్యొచ్చో నిరూపించాడు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని వేగవంతంగా పరిష్కరించి ‘రియల్’హీరోగా నిలిచాడు ఈ రీల్ విలన్. కరోనా ఫస్ట్‌వేవ్ లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు. (చదవండి: మేయర్ అభ్యర్థిగా సోనూసూద్.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్ హీరో’!) అయితే అందరి మాదిరే సోనూ సూద్‌కు కూడా సోషల్ మీడియాలో వింత ప్రశ్నలు, ఎగతాళి కామెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. వాటికి సోనూ భాయ్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చి నవ్వులు పూయిస్తాడు. తాజాగా ఓ నెటిజన్ సోనూసూద్ సర్ నాకు రూ. కోటి రూపాయలకు కావాలని కోరాడు. దీనికి సోను కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు. కేవలం ఒక కోటి రూపాయలే సరిపోతాయా? కొంచె ఎక్కువ అడగండి’అంటూ నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. 2022 లో జరిగే బృహత్ ముంబై ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా సోనూ సూద్ దిగబోతున్నారని టాక్ వినిపించింది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. ‘ఇది నిజం కాదు. నేను సాధారణ వ్యక్తిగా చాలా సంతోషంగా ఉన్నాను’అని ట్వీట్ చేశాడు. बस 1 करोड़ ?? थोड़े जायदा ही मांग लेता 😂 https://t.co/5h3KkCrrEA — sonu sood (@SonuSood) August 23, 2021 -
అడగాల్సినవి ఎన్నెన్నో..!
వీలు కుదిరినప్పుడల్లా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూ వారిని అలరిస్తుంటారు శ్రుతీహాసన్. తాజాగా మరోసారి తన అభిమానులు, నెటిజన్లతో శ్రుతి చాట్ చేశారు. ఈ చాట్ సెషన్లో భాగంగా ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోనున్నారు’ అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ బదులిస్తూ – ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల (కరోనాను ఉద్దేశిస్తూ) నుంచి బయటపడాలి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అడగాల్సిన ప్రశ్నలూ ఎన్నో ఉన్నాయి’’ అన్నారు. ఇక.. ఈ చాట్ సెషన్లోనే ‘సెక్స్ లేదా ఫుడ్?’ దేనికి ప్రిఫరెన్స్ అంటూ అడిగిన మరో నెటిజన్ ప్రశ్నకు.. ‘ఆహారం లేకపోతే మనం బతకలేం’ అని శ్రుతీహాసన్ బదులు చెప్పారు. ఇంకా తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టమని, పాములంటే భయమని, మ్యూజిక్‌లో ఉన్న మ్యాజిక్ తనకు ఇష్టమని నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం శాంతను అనే చిత్రకారుడితో శ్రుతి ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
ఫోటోషూట్‌లో ఆ ఫోజుకు సిగ్గుపడి.. వరుడిని కొలనులో తోసేసింది
ప్రస్తుతం పెళ్లంటే వధూవరుల ఫొటోషూట్ కంపల్సరీగా మారింది. ఇక వీటి కోసం ఎవరి అభిరుచికి తగ్గట్లు వారు లొకేషన్ల ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అడవులను, ఆకాశాన్ని కూడా వెడ్డింగ్ ఫొటోషూట్లకు వాడేసుకుంటున్నారు. కొందరు మితిమీరిన పైత్యానికి పోయి సోషల్ మీడియాలో ట్రోల్ కాగా, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోషూట్ జరుగుతుండగా పలు సందర్భాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆ తరహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ కొలను మధ్యలో ఉన్న వేదికపై వెడ్డింగ్ ఫొటోషూట్ జరుగుతోంది. ఆ ఫొటోగ్రాఫర్ వధూవరులను రకరకాల ఫోజులలో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్‌కి ఓ ఫోజు గుర్తించింది. అది వధూవరులిద్దరూ ఒకరినొకరు అల్లుకుని నిలబడాల్సిన రొమాంటిక్ ఫోజు. ఇంకేముంది వెంటనే ఎలా నిలబడాలో వివరించడానికి వరుడి దగ్గరగా వెళ్లి చేసి చూపిస్తున్నాడు. అది చూసిన వధువు సిగ్గు ఆపుకోలేకపోయింది. ఫొటోగ్రాఫర్‌ను, వరుడిని ఇద్దరినీ కలిపి కొలను నీళ్లలోకి తోసేసింది. వాళ్లిద్దరూ నీళ్లలోపడిపోగానే పగలబడి నవ్వకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న బండ్ల గణేశ్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. అయితే సోషల్ మీడియాని ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా... పేద ప్రజలకు సాయం అందించేందుకు వాడుతుంటాడు. ట్విటర్ ద్వారా తనను అభ్యర్థిస్తే చాలు... వెంటనే స్పందించి, తోచిన సాయం అందిస్తుంటాడు. అలా ఇప్పటికే చాలా మందికి సాయం అందించిన బండ్లన్న.. తాజాగా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓ నెటిజన్ అభ్యర్థన గమనించిన ఆయన స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ నెటిజన్ తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, వైద్యానికి ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ, వీలైన సాయం చేయాల్సిందిగా ట్వీటర్ ద్వారా అందరినీ అభ్యర్థించాడు. దీనిపై బండ్ల గణేశ్ స్పందిస్తూ.. `మీ గూగుల్ పే నంబర్ ఇవ్వండి. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మ గారిని కాపాడేందుకు ప్రయత్నిద్దామ`ని తెలిపారు. దీంతో బండ్ల గణేశ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్‌కు సాయిధరమ్‌తేజ్ ఫన్నీ రిప్లై
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినిమా షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో సెలెబ్రిటీలందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో తారలు వాళ్ల అభిమానులతో తరచూ మాట్లాడటమే గాక వారి వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు. ఈ జాబితాలో.. కొందరు లైవ్‌లోకి వచ్చి మాట్లాడుతుంటే.. మరికొందరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెడుతూ...వారి ఫాలోవర్లతో సమయం గడుపుతున్నారు. కాగా ఈ లిస్ట్‌లో మొదటిసారిగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టారు. ఇందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు మనోడు. గతంలో నెట్టింట మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మాత్రమే ఇలాంటి సెషన్స్ పెట్టేవారు. కానీ తాజాగా సాయిధరమ్ తేజ్ తన ఫాలోవర్ల కోసం ఇన్స్‌స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ పెట్టారు. ఇందులో అనేక ప్రశ్నలను నెటిజన్లు అడగగా.. ఈ హీరో తనదైన శైలిలో సమాధానాలు చెప్పుకొచ్చాడు. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానంగా.. చిరంజీవి పవన్ కళ్యాణ్‌లు ఇన్సిపిరేషన్ అని, పవన్ కళ్యాణ్ గురువు అని, నవ్వడం నేర్పించింది నాగబాబు అని ఇలా చెప్పుకొచ్చారు. అలా సరదాగా సాగుతుండగా.. ఓ నెటిజన్ మీకు పెద్ద వీరాభిమాని అని చెబుతూ నంబర్ ఇవ్వండి అన్నా అని అడిగాడు. దీనికి బదులుగా సాయి ధరమ్ తేజ్... నాగార్జున నటించిన ‘శివమణి’ సినిమాలో ఎమ్మెస్ నారాయణకు సంబంధించిన సన్నివేశపు మీమ్‌ను సమాధానంగా షేర్ చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే నంబర్ ఇస్తే తన పరిస్థితి అలానే మారుతుందని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. -
అలాంటి చీప్ పనులు చేయకండి .. నెటిజన్లపై నిధి అగర్వాల్ ఫైర్
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ఆమె అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే ఎప్పుడూ ఫోటో షూట్స్‌తో రచ్చ చేసే.. నిధి తాజాగా ఓ విషయం మీద బాగా సీరియస్ అయింది. అలాంటి ఫోటోలు షేర్ చేయకండి అంటూ నెటిజన్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ‘నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వవల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.. అది అనసరం. అవి చీప్ పనులే అవుతాయి. దిగజారకండి’అంటూ నిధి ఫైర్ అయింది. ఆమె అంతలా ఫైర్ కావడానికి కారణమైన ఫోటో ఏదో మాత్రం చెప్పలేదు. ఇక నిధి సినిమాల విషయానివస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. అలాగే అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంలో నటిస్తున్నారు. -
తన బాడీలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు రిప్లై ఇచ్చిన నటి
విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా సమయమే పట్టింది. నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా ఎదుగుతూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా ఈ అమ్మడు తన అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్ సమాధానమిచ్చింది. ఎక్కువ ఆ పార్ట్‌కు ఖర్చు చేశాను.. సినీ పరిశ్రమలో కొంచెం గ్యాప్ తరువాత రీఎంట్రీలో సక్సెస్ సాధించడం అంత సులువు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఇది శ్రుతి హాసన్ వీటిని మార్చిందనే చెప్పాలి. తెలుగులో వకీల్‌సాబ్, క్రాక్ సినిమాలతో హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటిస్తోంది. ఈ రకంగా శ్రుతి స్పీడ్ చూస్తుంటే కాస్త విరామం వచ్చినప్పటికీ తిరిగి తన కెరీర్లో దూసుకెళ్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ ముద్దు గుమ్మ ఓ అభిమానితో ముచ్చటిస్తుండగా ఆ వ్యక్తి .. ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు.అందుకు ఈ అమ్మడు సమాధానంగా.. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటూ’ ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో క్రాక్ నటి ఇచ్చిన రిప్లైకి షాక్‌లోకి వెళ్లాడు ఆ నెటిజన్. కాగా ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. -
పెళ్లి సంబంధం చూసిన నెటిజన్.. శ్రీముఖి షాకింగ్ రిప్లై!
ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా, మరో వైపు వెండితెరపై నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది అందాల ముద్దు గుమ్మ శ్రీముఖి. ఇక బుల్లితెరపై పటాస్ షో శ్రీముఖిని టాప్ ప్లేస్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇటీవల నెటిజన్లతో పర్శనల్ విషయాలను షేర్ చేసుకుంటూ, వారి కామెంట్లకు తనదైన శైలిలో సమాధానాలిస్తోంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌తో ముచ్చటిస్తుండగా శ్రీముఖికి ఓ వింత ప్రశ్న ఎదురైంది. గత కొన్నేళ్ల నుంచి తరచూ శ్రీముఖికి సంబంధించిన పెళ్లి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందుకు ఆమె పలు షోలలో చేసిన కామెంట్లు కూడా ఇలాంటి వార్తలు రావడానికి కారణమవుతున్నాయి. యాంకర్‌గా పటాస్ షో తరువాత ఈ అమ్మడు చేసిన షోలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదనే చెప్పాలి. ఇటీవల ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌తో ముచ్చటిస్తుండగా.. ఆ వ్యక్తి శ్రీముఖికి పెళ్లి సంబంధం చూసినట్టుగా చెప్పుకొచ్చాడు. ‘అక్క నీకు ఒక మంచి మ్యాచ్ ఉంది మాట్లాడమంటావా.. నీకు సరిగ్గా సరిపోతాడని తెలిపాడు. దీనకి శ్రీముఖి నవ్వుతూ ఎవరిదంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఈ ప్రపోజల్ తెచ్చిన నెటిజన్ ఎవరనేది చెప్పకపోవడంతో శ్రీముఖికి నెటిజన్ చూసిన సంబంధంపై సస్పెన్స్ కొనసాగుతోంది. -
అలాంటివాళ్లు పక్కనున్నా నచ్చదంటోన్న రష్మిక
జీవితంలో ఏదీ ఊరికే రాదనీ, కష్టపడి సాధించుకోవాలనీ అంటున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘గుడ్ బై’ షూటింగ్లో పాల్గొంటున్న రష్మిక షూటింగ్ గ్యాప్‌లో సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘మీరు స్మోక్ చేస్తారా?’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘‘నేనా.. స్మోకింగా? నాకు స్మోకింగ్ అంటే అసహ్యం. స్మోక్ చేస్తున్న వారి పక్కన నిలబడాలన్నా నాకు ఇష్టం ఉండదు’’ అని పేర్కొన్నారు రష్మిక. ఇంకా తనకు ఆరు భాషలు వచ్చనీ, ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదనీ.. తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనీ చెప్పిన రష్మిక.. హీరో విజయ్ దేవర కొండ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం. -
వైరల్: అంగవైకల్యం ఉన్నా.. స్టెప్పులు ఇరగదీసిన యువతి
ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ ఓ యువతి డాన్స్‌ని ఇరగదీసింది. ఆ యువతి తనకున్న ఒక్క కాలుతో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వికలాంగ డాన్స్‌ర్ సుభ్రీత్ కౌర్ ఘుమ్మన్ అగ్నిపత్లోని హిట్ సాంగ్ 'చికినీ చమేలీ' డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఆమె చేసిన డాన్స్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుభ్రీత్ మొదటి సారి.. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె ఈ షోలో రెండో రౌండ్‌కు అర్హత కూడా సాధించింది. ఇటీవల సుభ్రీత్ అప్పట్లో తాను డాన్స్ చేసిన పాటకు మళ్లీ అదే ఎనర్జీతో స్టెప్పులేసిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో... " నా మొదటి టీవీ నృత్య ప్రదర్శనను 7 సంవత్సరాల తరువాత మళ్లీ చేస్తున్నాను ... మీకు ఇది నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను" అనే క్యాప్షన్తోటి ఈ వీడియోను అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఇప్పటికే 28 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టింది. నెటిజన్లు ఆమె డాన్స్‌కు , ఆత్మధైర్యానికి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by subhreet Kaur Ghumman (@subhreet.ghumman) -
పెళ్లి చేసుకుంటావా? నెటిజన్ ప్రశ్నకు శృతి దిమ్మతిరిగే ఆన్సర్
హీరోయిన్ శృతీహాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఇక శృతి లైవ్‌లోకి రాగానే.. నెటిజన్లు తమ మనసులోని ప్రశ్నలన్నింటిని ఆమె ముందు ఉంచారు. ప్రభాస్ సలార్‌లో మీ పాత్ర ఏమిటి? అందులో క్రాక్ సినిమాలో మాదిరిగా ఫైట్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ సమాధానం ఇస్తూ.. సలార్‌లో నాది మంచి పాత్ర. ఇప్పుడు వివరాలు వెల్లడించలేను. అయితే నాకు ఫైట్స్ లేవు. ప్రభాస్‌తో ఫైట్ చేయలేను అని చెప్పారు. ఇక ఓ తుంటరి నెటిజన్.. మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి అంటూ అడిగితే.. అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో అని చెప్పారు. అలాగే లైవ్‌లో మరో నెటిజన్ నన్ను పెళ్లి చేసుకొంటావా? అని ప్రశ్న వేస్తే.. చేసుకొను అంటూ సున్నితంగా తిరస్కరించింది. మీరు నటించిన ఓ మై ఫ్రెండ్ చిత్రం అంటే ఇష్టం. మీకు ఆ మూవీ గుర్తుందా అని మరో నెటిజన్ అడిగితే నాకు ఇష్టమైన సినిమా అది అని జవాబు ఇచ్చారు. అలాగే వైజాగ్‌కు ఎఫ్పుడు వస్తున్నారు అని అడిగితే.. చిన్నప్పటి నుంచి వైజాగ్‌తో అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాను అని శృతి చెప్పారు. చదవండి: ప్రేమలో పడిపోయా.. రష్మిక పోస్ట్ వైరల్ అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్ -
గూగుల్ నిర్వాకం.. కన్నడ ప్రజలు ఫైర్
బెంగళూరు: కన్నడ భాషకు సంబంధించి గూగుల్ సెర్చ్ ఫలితాలు నెట్టింట దుమారం రేపుతోందనే చెప్పాలి. ఇటీవల మనకి ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేయడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏంటని గూగుల్‌లో సెర్చ్ చేస్తే సమాధానంగా.. భారతదేశంలో వికారమైన భాష ఏమిటి? దీనికి సమాధానం కన్నడ, దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాషని చూపించింది. దీనిపై కన్నడ ప్రజలు, రాజకీయ ప్రతినిధులు కూడా గూగుల్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని పై బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. ఆయన తన ట్వీట్లో.. విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కూడా ఒకటని తెలిపారు. 14 శాతాబ్దంలో జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయన్నారు. అయినా ఇలా ఓ భాషను అవమానించడం గూగుల్ లాంటి ప్రముఖ సంస్థకు తగదని సూచించారు. ఇందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు. కన్నడ కంటే మంచి భాషా ఎదో చెప్పాలని అని ఒకరు ప్రశ్నించగా.. మరికొందరు గూగుల్‌ను భారత్‌లో బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. Home to the great Vijayanagara Empire, #Kannada language has a rich heritage, a glorious legacy and a unique culture. One of the world’s oldest languages Kannada had great scholars who wrote epics much before Geoffrey Chaucer was born in the 14th century. Apologise @GoogleIndia. pic.twitter.com/Xie927D0mf — P C Mohan (@PCMohanMP) June 3, 2021 Show me a beautiful and better language than #Kannada i will wait 😇#KannadaQueenOfAllLanguages pic.twitter.com/muPkrn9Ik2 — Hemanth Shaiva 2.0 (@Hemanth__Shaiva) June 3, 2021 చదవండి: అక్కడ 295 గ్రామాల్లో కరోనా కేసులు లేవు.. ఇదే కారణమట -
లైవ్‌లో ఫోన్ నెంబర్ అడిగిన నెటిజన్.. వెంటనే ఇచ్చేసిన శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేయడం, హాట్ హాట్ ఫొటోషూట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక ఈ బ్యూటీ లైవ్‌లోకి వచ్చిందంటే చాలు.. నెటిజన్లు తమ ధర్మ సందేహాలన్నింటిని బయటపెడతారు. శ్రీముఖి కూడా ఓపికగా, తనదైన శైలీలో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా లైవ్ చిట్ చాట్ చేసిన ‘రాములమ్మ’ఏకంగా ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాలు ఇండియాలో బ్యాన్ కాబోతున్నాయని వార్తలు రావడంతో వెంటనే లైవ్ లోకి వచ్చింది శ్రీముఖి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఓపెన్‌గా అడిగేయండి అంటూ ఆఫర్ ఇవ్వడంతో నెటిజన్లు రెచ్చిపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ బ్యాన్ అయితే మీతో మాట్లాడటం ఎలా అక్కా? ఎస్సెమ్మెస్లొ మాట్లాడుకుందాం అక్క టోల్ ఫ్రీ నెంబర్ చెప్పు అని ఓ నెటిజన్ అడిగాడు. దీంతో వెంటనే ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పిన 9848032919 నెంబర్ ను శ్రీముఖి ఇచ్చింది. వీటితో పాటు తన పెళ్లి, రిలేషన్‌షిప్‌పై అడిగిన ప్రశ్నలకు కూడా శ్రీముఖి ఫన్నీ సమాధానాలు ఇచ్చి నవ్వులు పూయించింది. -
ఆ మెస్సేజ్‌ల వల్ల ప్రాణాలు పోతున్నాయి.. రేణూ దేశాయ్ ఫైర్
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది నెటిజన్లు పెట్టే సరదా సందేశాల వల్ల సాయం అందక కరోనా రోగులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణూ దేశాయ్.. కరోనా కష్టకాలంలో తనకు దోచిన సాయం అందిస్తుంది. ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా కోవిడ్ బాధితులకు ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి వివరాలను అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. తన ఇన్‌స్టా ఖాతాలో మెసేజ్ ఇన్ బాక్స్‌లో మెసేజ్ పెట్టిన వారికి సమయానికి సరైన వైద్యం అందేలా చూస్తున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆమెకు హాయ్, హలో అంటూ సరదా మెసేజ్‌లు పంపిస్తున్నారు. వీటిపై రేణూ ఫైర్ అయింది. తనకి హాయ్, హలో, లేదా ఏదైనా సరదా మెస్సేజ్‌లు పంపించవద్దని, దాని వల్ల కొంత మంది ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ‘దయచేసి నాకు హాయ్, హలో అనే మెస్సేజ్‌లు పంపించకండి. మీరు పంపించే మెస్సేజ్‌ల కారణంగా సాయం కోరుతూ పంపుతున్న వాళ్ల మెస్సేజ్‌లు కిందకు వెళ్లిపోతున్నాయి. దానివల్ల నేను ఆ మెస్సేజ్‌లు చూడడానికి కూడా వీలు కావడం లేదు. మీరు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల కారణంగా సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రస్తుతానికి నేను ఎవరికీ ఆర్థిక సాయం చేయడం లేదు. కొవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను. ఇకనైనా మారండి. దయచేసి నాకు సరదా మెస్సేజ్‌లు పెట్టకండి’ అని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. అలాగే తనకు ట్విటర్ అకౌంట్ లేదని, తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారని, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. View this post on Instagram A post shared by renu (@renuudesai) -
వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్లు షాక్!
-
వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్లు షాక్!
రోమ్: సోషల్ మీడియా.. మన భావాలను పంచుకోవడానికి చక్కని వేదిక. దీనిలో మంచి, చెడు, నిజం, అబద్దం అన్నీ చక్కర్లు కొడతాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 3.96 బిలియన్ల (58.11% శాతం) మంది సోషల్ మీడియాలో విహరిస్తున్నట్లు అంచనా. వీరు రోజుకు సగటున 2 గంటల సమయం ఇందులోనే గడుపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియా దాదాపు దశాబ్ద కాలం కిందట మాత్రమే పుట్టుకొచ్చింది. ఈ రోజుల్లో మనుషులు ప్రతిదీ దీనిలో పంచుకుంటున్నారు. తాజాగా ఇటలీకి చెందిన జోష్, లిసా ఫేస్బుక్ పేజీలో షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ హాక్ స్టెప్ ట్యుటోరియల్ ద్వారా రెండు డబ్బాల పాస్తా సాస్ పోసి సాస్‌పై మీట్‌బాల్స్, బ్రెడ్, సలాడ్స్ ఇంకా కొన్ని పదార్థాలను కలిపి స్పఘెట్టి పాస్తాను తయారు చేసింది. అయితే ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 27 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ విధంగా బల్లపై తయారు చేసే ఈ ఆహారాన్ని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. "నేను మీ ఇంటికి విందు కోసం వస్తే..మర్యాదగా నాకు వద్దని చెప్తాను. అయినా దీన్ని ఎవరూ కూడా తినరు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. " మీరు తయారు చేసిన విధానం చాలా అపరిశుభ్రంగా ఉంది. మీకు నాస్టీస్ట్ డిన్నర్ అవార్డు ఇవ్వాలి" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. "నా కళ్ళు! నా కళ్ళు!" అంటూ మరొకరు ఆందోళన చెందుతున్నట్టు పోస్ట్ చేశారు. (చదవండి: ఈ ఐడెంటికల్ ట్విన్ సిస్టర్స్ ప్రతిభ అదుర్స్) -
అభిషేక్ బచ్చన్ ట్వీట్: ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరూ లేరు
ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటున పరంగా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించి ఉన్నత స్థానంలో ఉండే నటులో అమితాబ్ బచ్చన్ ఒకరని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన వారసుడిగా అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం గడిచినప్పటికీ అతని కెరీర్ అంత సాఫీగా సాగడం లేదనే చెప్పాలి. అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల పరంగా ఎక్కువగా నెటిజన్ల ట్రోలింగ్‌కు గరైయ్యేవాడు కానీ ఈ సారి మాత్రం ప్రశంసలు అందుకున్నాడు. నటన పరంగా బిగ్ బి మించిన వారు లేరు స్టాక్ మార్కెట్‌ను గతంలో ఒక ఊపు ఊపిన హర్షద్ మెహతా జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రంలో నటించాడు. అందులో అభిషేక్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్ అందరికి ఆశ్చర్యం కలిగించేలా ట్వీట్ చేశారు. ‘అభిషేక్.. మీ బిగ్ బుల్ చిత్రం చూశాను. ఇందులో మీ నటన మీ తండ్రి అమితాబ్ బచ్చన్ కన్నా గొప్పగా ఉందంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన అభిషేక్.. మీ ప్రశంసలకు ధన్యవాదాలు. ఆయన కన్నా గొప్ప నటులు ఎవరు లేరంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఎదో అడపాదడపా హిట్స్ తప్ప తండ్రికి ఉన్న స్టార్ ఇమేజ్ను అందుకోలేక పోతున్నాడని బాలీవుడ్లో అభిషేక్‌పై బహిరంగానే విమర్శలు వినిపించేవి. అదీ కాక ఆయన నటించిన సినిమాలు విజయాల కన్నా అపజయాలే ఎక్కువ ఉండడంతో నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ కూడా ఎక్కువగానే వచ్చేవి. ( చదవండి: ప్రియురాలితో ఎయిర్‌పోర్టులో రాహుల్.. ఫోటోలు వైరల్ ) Thank you very much for your compliment sir. But nobody, NOBODY can be better than him. 🙏🏽 — Abhishek Bachchan (@juniorbachchan) May 8, 2021 -
పిచ్చిదానిలా ఉన్నా..నీకు హాట్‌గా కనిపించానా : నటి హేమ
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన నటి హేమ. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కేబీఆర్ పార్కుకు వాకింగ్‌కు వెళ్లిన హేమ..అక్కడే ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. లైవ్ చాట్‌లో కరోనాపై జాగ్రత్తలు చెబుతూ సెకండ్ చాలా తీవ్రంగా ఉందని అందరూ మాస్కులు ధరించాలని కోరింది. కూతురితో కలిసి చింత చిగురు కోసిన నటి..తనకన్నా తన కూతురే ఫేమస్ అని, తనకు సోషల్ మీడియాలో తనకంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ లైవ్‌లోనే హేమను హాట్ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన ఆమె..'నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్నా. ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్‌గా కనిపిస్తున్నానా' అంటూ ఫన్నీగా బదులిచ్చింది. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా స్పోర్టివ్‌గా రిప్లై ఇచ్చిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు , తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించిన హేమ.. కరోనా వల్ల కొన్ని సినిమాలు ఆగిపోయాయని పేర్కొంది. త్వరలోనే పరిస్థితి అదుపులోకి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఇక గతంలో బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని మొదటి వారమే ఎలిమినేట్ అయి హౌస్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో గొడవలతో కాస్త అపఖ్యాతి కూడా మూటగట్టుకుంది. View this post on Instagram A post shared by Hema_Kolla (@urshemakolla) చదవండి : ఒక్క నెలలోనే 6కేజీలు తగ్గిన పాయల్.. ఏం చేసిందంటే.. -
లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల
-
లేగదూడ వీడియో : ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల
యాంకర్ సుమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ.. తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌కు గురయిన సంగతి తెలిసిందే. లేగ దదూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి కట్టడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారేంటి? ఇంతటి క్రూరత్వమా అంటూ సుమను తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరో వర్గం మాత్రం సుమను సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని ట్రోలర్స్‌కు బుదులిచ్చారు. అయినప్పటికీ కొందరు సుమపై నెగిటివి మాత్రం ఆగలేదు. తాజాగా తనపై వస్తోన్న ట్రోల్స్‌పై సుమ స్పందించింది. అక్కడి పాలేరు వద్దకు వెళ్లి రాముడి(లేగ దూడ)మూతికి మొన్న చిక్కం (వెదురు బుట్టి) ఎందుకు కట్టారు? అని సుమ అడగ్గా.. అది మట్టిని తినకుండా ఉండేందుకు అలా కట్టాను అని అతను సమాధానమిచ్చాడు. అలాగే ఆవును పెంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ..గోమూత్రంతో మంచి ఎరువు వస్తుందని, ఆవు అంటే శుభం అనే ఉద్దేశంతో ఆవును పెంచుకుంటున్నామనే తప్పా వ్యాపారం కోసం కాదు అని పేర్కొన్నారు. ఈ వీడియోను సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తనపై వస్తోన్న నెగిటివికి చెక్ పెట్టారు. 'లేగదూడ మూతికి వెదురు బుట్టి కట్టడంపై చాలా మందికి అనుమానాలు తలెత్తాయి. ఈ వీడియాతో మీ అందరికి సమాధానం దొరికొందని ఆశిస్తున్నాను.. మనం ప్రకృతితో పాటు జంతు ప్రేమికులం కూడా..' అంటూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. చదవండి : మొదటిసారి సుమను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే! HBD Ajith : బైక్ మెకానిక్ నుంచి సూపర్ స్టార్‌గా.. -
మొదటిసారి సుమపై నెటిజన్ల ఫైర్.. కారణం ఏంటంటే!
సుమ కనకాల.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పుట్టి పెరిగింది కేరళలో అయినా టాలీవుడ్ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్‌లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్‌గా సుమ ఉండాల్సిందే. తన మాటలతో చిన్న నుంచి పెద్దల వరకు అందరిని ఆకట్టుకుంటున్నారు. సుమ వేసే పంచులు, మాటలతో షో ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరి అభిప్రాయం. ఇప్పటి వరకు తన కెరీర్‌పై ఎలాంటి నెగటివ్ లేకుండా హాయిగా ఉన్న సుమ.. తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌కు గురయ్యారు. సుమపై కొందరు ఫైర్ అవుతూ.. క్రూరత్వం కనిపించలేదా అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తనకు సంబంధించిన కొన్ని విషయాలను సుమ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఆమెకు మూగజీవులు అంటే ఇంకా ఇష్టం. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆవు, దూడతో సరదాగా గడిపిన వీడియోను పోస్టు చేసింది. ఇందులో రాముడు అంటూ ఆవు దూడను ప్రేమగా దగ్గరకు పిలుచుకుంటోంది. వీడియోలో దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి లాంటిది పెట్టారు. అయితే ఇది కొంతమంది నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి క్రూరత్వం మీకు కనిపించడం లేదా అని సుమపై ఫైర్ అవుతున్నారు. కానీ మరో వర్గం వారు.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని సుమకు అండగా నిలుస్తున్నారు. సుమ తొలి యాంకరింగ్ ప్రోగ్రాం ఏంటో తెలుసా? -
ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్
భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జర్మనీ, ఇటలీ, ఇరాన్, సింగపూర్, నెదర్లాండ్ , బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్ నుంచి వచ్చే విమానాలు రద్దు చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి మాల్దీవులు చేరింది. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే అన్ని విమానలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు మాల్దీవులు పర్యాటక మంత్రిత్వశాఖ ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 ఆ ఆంక్షలు ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత పర్యాటకులెవరూ మాల్దీవుల్లోని హోటళ్లు, రిసార్ట్లు, గెస్ట్ హౌజ్‌ల్లో బస చేయవద్దని నిషేధం విధించింది. తమ పర్యాటక రంగాన్ని సురక్షితంగా ఉంచడానికి చేస్తున్న ఈ ప్రయాత్నానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్లో పేర్కొంది. అయితే బీటౌన్ తారలు, జాన్వీ కపూర్, దిశా పటాని, టైగర్ ష్రాఫ్‌తోపాటు మరికొంత మంది ఇటీవల వెకేషన్‌కు మాల్దీవులకు వెళ్లొచ్చారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా కోవిడ్ -19 నుంచి కోలుకున్న వెంటనే మాల్దీవులు చుట్టొచ్చారు. అక్కడ దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. మాల్దీవుల ప్రకటన అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ వినోదాల కోసం హాలీడే ట్రిప్పుల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ట్రిప్పులు కవాల్సి వచ్చిందా అని విమర్శిస్తున్నారు. ఇండియా టూరిస్టులను మాల్దీవులు బ్యాన్ చేయడం మంచిపని అయ్యిందంటూ సంబరపడుతున్నారు. చదవండి: ‘తిండి లేక అల్లాడుతుంటే.. డబ్బులు నీళ్లలా ఖర్చుపెడుతున్నారు’ కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్! With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 Maldives restricts entry of tourists from India Bollywood celebs rn: pic.twitter.com/Pa5ZU83lRu — Mawa_Jalebi 🦄 (@HighnPositive) April 26, 2021 Bollywood celebrities rushing for the Maldives while watching people in India die... #CovidIndia pic.twitter.com/KUFrVUixm1 — Delhi Decoded (@DelhiDecoded) April 26, 2021 Bollywood celebrities planning for tourism in Maldives Le Maldive's government suspends tourists from India :) pic.twitter.com/HYsTufAY2S — Anant (@Bihariladka_) April 26, 2021 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) -
Bandla Ganesh: మళ్లీ తప్పులో కాలేసిన బండ్ల గణేష్, నెటిజన్ల కౌంటర్
బండ్ల గణేష్.. ప్రస్తుతం ఈ పేరు సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. స్టేజ్ ఎక్కితే చాలు ఆపకుండా తన వాక్ చాతుర్యం ప్రదర్శించే గణేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. ట్విటర్లో క్లారిటి లేని పోస్టులు పెట్టి తప్పులో కాలేస్తుంటాడు. అలా నెటిజన్లకు దొరికిపోవడంతో ఈ పోస్టులను డిలీట్ చేస్తుంటాడు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ తప్పులో కాలేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఆయన ప్రకటించాడు. తాను ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇస్తున్నానని ఇన్‌స్టా ఐడీ ఇదేనంటూ ట్వీట్ చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇన్‌స్టా ప్రొఫైల్‌కు సంబంధించిన లింక్ మాత్రం షేర్ చేయడం మరిచిపోయాడు. అది గమనించి ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి మళ్లీ పోస్టు చేశాడు. రెండోసారి కూడా లింక్ షేర్ చేయడం మరచిపోయి మళ్లీ ఆ ట్వీట్ చేశాడు. ఇక మూడోసారి కూడా అదే తప్పు చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు బండ్ల గణేశ్‌ను తమదైన శైలిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా? ఇన్స్టాగ్రామ్ లింక్ ఏది.. ఎందుకు ట్వీట్స్ డిలీట్ చేస్తున్నావ్.. మళ్లీ ఎందుకు ట్వీట్లు పెడుతున్నావ్’ అంటూ కామెంట్లు పెడుతు కౌంటర్లు వేస్తున్నారు. -
కేటీఆర్‌కు మంచు లక్ష్మి సలహా.. నెటిజన్ల కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కరోనా అందరిపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ నాయకులను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌తో సహా ఎంతో మంది మహమ్మారి కోరల్లో చిక్కుకోగా శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఆరోగ్యంపై సినీ నటి లక్ష్మి మంచు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే.. కేటీఆర్, మంచు లక్ష్మి మంచి సన్నిహితులన్న విషయం తెలిసిందే. అయితే మంత్రికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఆమె.. ‘త్వరగా కోలుకోవాలి బడ్డీ.. ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూడు’ అంటూ పేర్కొంది. ఇక దీనిపై నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. అదే గనుక జరిగితే మంత్రి కేటీఆర్‌కు అసలు ఊపిరాడుతుందా అక్కా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి.. ‘‘నీ సినిమాలు చూడటం కంటే కరోనాతో ఉండటం బెటర్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘బడ్డీ ఏంది.. కేటీఆర్ గారు నీ దోస్తా.. ఒక రాష్ట్రానికి మంత్రి. గౌరవంగా మాట్లాడటం నేర్చుకో’’ అని ఉచిత సలహాలిస్తున్నారు. కాగా మంచు లక్ష్మి సరాదాగా వేసిన ఈ పంచ్‌లు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మీరూ చదివేయండి.. చదవండి: జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి సీఎం కేసీఆర్ కుటుంబంలో కరోనా కల్లోలం @KTRTRS get well soon buddy. Watch all my movies now 😇 — Lakshmi Manchu (@LakshmiManchu) April 23, 2021 -
రెమిడెసివిర్ అడిగిన ప్రముఖ దర్శకుడు: ఊహించని స్పందన
సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రకంపనలు మామూలుగా లేవు. ఒకవైపు రోజురోజుకు రికార్డు స్తాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మరోవైపు కోవిడ్-19 రోగులకు ఆసుపత్రులలో మందుల కొరత, సరిపడినన్ని బెడ్లు లేక, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక దేశవ్యాప్తంగా అనేకమంది రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. అటు రాజకీయవేత్తల నుంచి ఇటు సామాన్యుల దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిఇలా ఉంటే కరోనా చికిత్సలో కీలకమైన రెమిడెసివిర్ ఔషధం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు హన్సాల్ మెహతా కరోనా బారిన పడిన తన కుమారుడి చికిత్సకోసం రెమిడెసివిర్ మందు దొరకడం లేదని సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వేడుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఈ పోస్ట్‌కు ఆయన అభిమానులు, ఇతర నెటిజనుల నుంచి అపూర్వ స్పందన రావడం విశేషం. పలువురు నెటిజన్లు ఈ ఔషధం లభ్యత తదితర వివరాలతో మెహతాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. (ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌కు కరోనా: పరిస్థితి విషమం) ‘కోవిడ్‌తో బాధపడుతున్న నా కుమారుడు పల్లవ కోసం రెమిడెసివిర్ ఔషధం కావాలి. ఎక్కడ దొరుకుతుంది..సాయం చేయగలరు’ అంటూ ట్వీట్ చేశారు. ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని క్రిటికేర్ హాస్పిటల్లో ఉన్నాడని పేర్కొన్నారు. దీంతో నెటిజనుల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఒక గంట వ్యవధిలో దర్శకుడికి కావలసిన మెడిసిన్ లభించింది. దీంతో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పల్లవకు సాయం చేయడానికి ఇంతమంది నుంచి అద్భుత స్పందన రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. పల్లవకోసం ప్రే చేయండి అంటూ పాత ట్వీట్‌ను తొలగించారు.. కాగా, భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉందా లేదా అధ్వాన్నంగా ఉందా అంటూ హన్సల్ మెహతా ట్విటర్లో వ్యంగ్యంగా అడగడం వివాదాన్ని రేపింది. పాకిస్తాన్లో బావుందని భావిస్తే శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ కొంతమంది ఘాటుగా స్పందించారు. ఏకంగా ఒక నెటిజన్ దుబాయ్ ద్వారా పాకిస్తాన్‌కు వన్-వే టికెట్‌ను కూడా పంపారు. Am overwhelmed that so many wonderful people reached out to help Pallava. Have deleted the tweet as his requirement is being met. Thank you so much for all the love. Keep him in your prayers. Love. — Hansal Mehta (@mehtahansal) April 20, 2021 KK Pharma 9892869090 it is in Andheri. Try it out Sir. — Dev Mehta (@Dev73513666) April 20, 2021 -
న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్.. అలా చేస్తే ఓకే అన్న ప్రియమణి
ప్రియమణి.. అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సమయంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుథి వీరన్ సినిమాకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తెలుగులో నాగార్జున, ఎన్టీఆర్‌తో పాటు పలువురు స్టార్ హీరోల సరసన నటించింది.హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుంది. మూవీస్‌తో పలు వెబ్ సీరీస్లలో కూడా నటిస్తుంది.వీటితో పాటు పాటు బుల్లితెరపై ఓ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా కూడా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దు గుమ్మ..ఇటీవల తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో బ్లాక్ డ్రెస్‌లో ఉండే ఫోటోలని షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతంది. ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపించగా.. ఓ నెటిజన్ మాత్రం బిత్తిరి ప్రశ్న అడిగి అభాసుపాలయ్యాడు. మీ న్యూడ్ ఫోటో షేర్ చేయండంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ప్రియమణి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. నా కంటే ముందు మీ సోదరిని లేదా మీ తల్లి గానీ అలాంటి ఫోటో అడిగి షేర్ చేయండి.. అప్పుడు నేను కూడా పెడతా’అని జవాబిచ్చింది. ప్రియమణి సమాధానం చూసి ఆ నెటిజన్ షేమ్‌గా ఫీలై.. క్షమాపణలు కోరాడు. కాగా, ప్రియమణి ఇచ్చిన సమాధానంపై పలువులు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సరైనా సమాధానం ఇచ్చావంటూ మెచ్చుకుంటున్నారు. చదవండి: వైరల్ అవుతున్న బాలకృష్ణ న్యూ లుక్ రెండోపెళ్లి నాకు ఓకే : నాగబాబు.. పోస్ట్ వైరల్ -
ఈ బనానా రంగు, రుచి సెపరేట్!
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతోంది. వింతలు విడ్డూరాలకు కొదవేలేదు. మనకు తెలియని ఎన్నో అద్భుత విషయాలు క్షణాల్లో తెలుస్తున్నాయి. తాజాగా తియ్యతియ్యని అరటి పళ్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరటిపళ్లు ఏంటీ? గొప్పదనం ఏం ఉంది? మామూలే కదా అనుకుంటున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. ఎందుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అరటి పళ్లు సాదాసీదావి కావు. రంగూ రుచిలోనూ చిత్రంగా అనిపించేవే ‘బ్లూ జావా బనానా లేదా నీలం రంగు అరటిపళ్లు’. ఆగ్నేయాసియాల్లో విరివిగా పండే బ్లూ జావా అరటిపళ్లు ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలోని హవాయి, ఫిజీ వంటి ప్రాంతాల్లో ఇవి పండుతాయి. వెనీలా రుచిని కలిగి ఉండే ఈ నీలం అరటి పళ్లను బనానా ఐస్‌క్రీమ్, హవాయి బనానా అని కూడా పిలుస్తారు. మొదట్లో దక్షిణాసియా దేశాల్లోనే వీటిని ఎక్కువగా పండించేవారు. నీలం రంగు అరటిపళ్లు హైబ్రిడ్ అని చెప్పవచ్చు. ఆగ్నేయాసియాలో పండే ‘ముసా బాల్బిసియానా, ముసా అక్యుమనిటా’ అనే రెండు అరటి మొక్కల నుంచి ఉద్భవించిందే హైబ్రిడ్ నీలం రంగు బనానా. మొదట్లో ఈ అరటిపళ్లు నీలం రంగులో ఉన్నప్పటికీ అవి పక్వానికి వచ్చాక క్రమంగా నీలం రంగు మసక బారుతుంది. సాధారణ అరటి పళ్ల కంటే ఇవి కాస్త పెద్దగా ఉండడమే గాక, ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి. పైకి నీలంగా కనిపించే ఈ బనానా లోపల మాత్రం అన్నింటిలాగానే తెల్లగా ఉంటుంది. నలుపు రంగులో ఉన్న చిన్న విత్తనాలు ఉంటాయి. దీనిలో పొటాషియంతో పాటు ఇతర రకాల ఖనిజ పోషకాలు అధికంగా ఉండడం వల్ల మంచి స్నాక్‌గా దీన్నీ తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది బాగా ఉపయోగపడుతుంది. అరటిపండును వంద గ్రాములను తీసుకుంటే దానిలో ఫ్యాట్ 0.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 22.8 గ్రాములు, 89 కేలరీలు ఉంటాయి. పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల రోజువారి ఆహారంలో ఈ బనానా తీసుకోవడం వల్ల బరువును అదుపులో కూడా ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడంతో మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక బ్లూ బనానా చెట్టు ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలను వేడిగా, ఫ్రెష్‌గా ఉంచేందుకు వాడే అల్యూమినియం ఫాయిల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఈ బనానా ఆకులను వాడవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న విచిత్ర బ్లూ బనానాను వీలైతే ఒక్కసారైనా టేస్ట్ చేసి చూడండి. l -
ప్రెస్‌మీట్‌కి ముందస్తు కసరత్తా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాక గురువారం నిర్వహించిన తొలి మీడియా సమావేశం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఆయన నోట్స్ చూసుకుంటూ సమాధానాలు ఇవ్వడంతో అందరూ విస్తుపోయారు. 78 ఏళ్ల వయసున్న బైడెన్ ఎన్నో ప్రశ్నలకు రాసుకొని వచ్చిన సమాధానాల్ని చూసి చదివారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తూ కామెంట్లతో హోరెత్తించారు. బైడెన్ సమావేశంలోని ఒక ఫొటోలో ఆయన చేతిలో ఉన్న పేపర్లో కొందరి విలేకరుల ఫొటోలు రౌండ్ ఆఫ్ చేసి ఉండడంతో, కొంత మంది ఎంపిక చేసుకున్న జర్నలిస్టులకే ప్రశ్నలు వేయడానికి ఆయన అవకాశం ఇచ్చినట్టుగా ట్విట్టర్ వేదికగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పేపర్లో మార్క్ చేసి ఉన్న విలేకరుల పేర్లనే ఆయన పిలిచారని, వారేం ప్రశ్నలు అడుగుతారో ఆయనకు ముందే తెలుసునని పలువురు నిందించారు. ‘‘ఇది మీడియా సమావేశం కాదు. సూడో ప్రజాస్వామ్యంలో జరిగిన ఒక నాటకం’’అని న్యూయార్క్ టైమ్స్ కాలమిస్టు కాండెస్ ఓన్స్ విరుచుకుపడ్డారు. బైడెన్ ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్, సరిహద్దు సమస్యలు, వలస విధానంపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బైడెన్ పదవీ ప్రమాణం చేసి రెండు నెలలు గడిచిపోయినా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. -
వైరల్: ఆకలేస్తే అంతేమరీ!
-
వైరల్: ఆకలేస్తే అంతేమరీ!
పాట్నా: కరోనామహమ్మారి కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసుకునే అవకాశం కల్పించాయి. ఈ క్రమంలో చాల మంది కంపెనీల మీటింగ్స్, స్నేహితులతో , ఇంట్లోవారితో మాట్లాడటానికి వీడియో కాల్నే ఉపయోగిస్తున్నారు. అయితే, ఇది కొన్నిసార్లు నవ్వును కూడా పుట్టిస్తుంది. తాజాగా, పాట్నాకు చెందిన ఒక న్యాయవాది , సోలీసిటరీ జనరల్‌ల మధ్య వీడియోకాల్‌లో సెషన్ జరుగుతొంది. ఈ క్రమంలో లాయర్‌కు బాగా ఆకలేసినట్టుంది. వెంటనే తనకు నచ్చిన చపాతి తెప్పించుకొని తినడం మొదలెట్టేశాడు. అయితే వీడియోకాల్ ఆఫ్ చేయడం మరిచిపోయాడు. అప్పుడు ఆన్లైన్లో జడ్జి ప్రత్యక్ష మయ్యాడు. లాయర్‌ను చూసి నవ్వుకుంటూ నాక్కుడా చపాతి పంపు అని సరదాగా కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతొంది. దీన్ని చూసిన నెటిజన్లు బుర్ర పనిచేయాలంటే తిండి కూడా ముఖ్యమే...ఆకలేస్తే అంతే మరీ! అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: నల్లపులి, చిరుతల ఫైటింగ్! -
‘కుక్కలా ఉన్నావ్’ : బిగ్‌బాస్ ఫేమ్‌పై ట్రోలింగ్
ముంబై: ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలు తరచూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. నెటిజన్లు శ్రుతిమించి మరీ వారిపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేమ్, ఎఫ్ఐఆర్ నటి కవితా కౌశిక్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెను కొందరు నెటిజన్లు ‘నువ్వు కుక్కలా ఉన్నావంటూ’ అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన కవితా కౌశిక్ ముంబై పోలీసులు, మహరాష్ట్ర సైబర్ సెల్ అధికారులకు ఆశ్రయించింది. ఆ చాట్లను స్క్రీన్‌షాట్ తీసి వాటిని పోలీసులకు చూపించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు ట్రోలింగ్‌కు గురవ్వడం కొత్తేం కాదు.. ఇదివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, పరిణితి చొప్రా, తాప్సీ పన్ను, ఈషాగుప్తా, మల్లికా షెరావత్లు నెటిజన్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. కాగా, కవితా కౌశిక్ బిగ్ బాస్-14 రియాలిటి షోలో రుబినా దిలైక్, అభినవ్ శుక్లాతో తరచు వివాదాలతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఈ సీజన్ రుబీనా దిలైక్ ట్రోఫితో పాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ ఐదో సీజన్: టాప్ కంటెస్టెంట్లు వీళ్లేనా! -
నోరుపారేసుకున్న నెటిజన్.. అనసూయ గట్టి కౌంటర్
సెలబ్రిటీలకు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి ఎక్కువగా చూపుతుంటారు. వారిని నేరుగా కలుసుకునేందుకు కుదరకపోవడంతో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఫాలో అవుతుంటారు. తాము ఆరాధించే వారు మంచి పని చేసినప్పుడు పొగడ్తలతో ముంచెత్తడంతోపాటు నచ్చని పనులు చేసినా ఎలాంటి మొహమాటం లేకుండా తిట్టిపారేస్తుంటారు. ఈ క్రమంలోనే బుల్లితెర యాంకర్ అనసూయకు ఓ నెటిజన్ కారణంగా చేదు అనుభవం ఎదురైంది. బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకొని అటు వెండితెరపై తన టాలెంట్ చూపిస్తూ దూసుకుపోతున్న అనసూయ సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో అనసూయకు చెందిన ఓ ఫోటోపై పోస్టుపై అభిమాని ఫైర్ అయ్యాడు. మూడేళ్ల క్రితం నాటి ఫోటోపై స్పందిస్తూ ఓ నెటిజన్ రంగమత్తను అసభ్య పదజాలంతో దూషించాడు. టీవీ షో ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అనసూయ లోబీపీ కారణంగా కళ్లు తిరిగిపడిపోయింది. ఈ ఫోటోను పట్టుకొని అందరి అటెన్షన్ కోసం అనసూయ ఇలా చేస్తుందని నెటిజన్ ట్వీట్లో పేర్కొన్నాడు. సాధారణంగా ఇలాంటి ట్రోల్స్‌ను లైట్ తీసుకొనే ఈ భామ దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడటం కూడా దండగ. కానీ నువ్వు మొదలు పెట్టావు. ఇలాంటి వాటికి కౌంటర్ ఇవ్వకపోతే.. ముందు ముందు నీలాంటి వాళ్లు మా పై మరింత బురద జల్లే అవకాశం ఉంది. అందుకే నీకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు’.. అంటూ సదురు నెటిజన్ తీరును కడిగిపారిసేంది. కాగా సోషల్ మీడియాలో అనుసూయకు అండగా నిలుస్తున్నారు. మేడమ్ మీకు మేమున్నాం.. ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటూ మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. చదవండి: అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్ Its easy to comment isn’t it? Having punched out two babies and in the process developed low blood pressure and this particular “attention seeking” incident took place at 5:30am where we shot straight for 22 hours.. what exactly do you know to even notice Mr.Aditya..?? https://t.co/FyrR4CW9Ou — Anasuya Bharadwaj (@anusuyakhasba) February 7, 2021 -
మహిళా ఎస్ఐ మానవత్వం
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఆమె ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ ఫొటోలను ట్విట్టర్, ఏపీ పోలీస్ ఫేస్బుక్ పేజీలలో ట్యాగ్ చేసి, ‘మహిళా ఎస్ఐ.. మానవీయ కోణం’ అంటూ ప్రశంసించారు. ఆమెకు ప్రçశంసపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హోం మంత్రి సుచరిత సైతం ట్విట్టర్లో శిరీషకు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న అడవి కొత్తూరులోని పంటపొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉన్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్ధించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలోమీటర్‌కు పైగా మృతదేహాన్ని మోసుకెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక, ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. -
బిగ్‌బాస్: మాస్టర్‌ను ఇంటికి పంపించాల్సిందే..
బిగ్‌బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్ల ప్రయాణం సగం ముగిసింది. మిగిలిన రోజుల్లో వారి ఆట మరింత కఠినంగా ఉండనుందని బిగ్‌బాస్ ముందే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఎన్నడూలేని విధంగా బిగ్‌బాస్ హౌజ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్ మాస్టర్ నియంతలా మారి హౌజ్మెట్స్కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు పిల్లిలా ఉన్న మాస్టర్ ఇప్పుడు పులిలా పంజా విసురుతున్నారు. తన మాట శాసనం అనేలా ప్రవర్తిస్తున్నాడు. పనుల విభజనలో భాగంగా తనకు నచ్చని వారికి ఎక్కువ పనులు అప్పజెప్పుతూ, తన స్నేహితులైన అరియానా, మెహబూబ్, అవినాష్‌కు చిన్న పనులు చెప్పాడు. ఈ క్రమంలో హౌస్‌లో పెద్ద రభస చోటు చేసుకుంది. మాస్టర్ ఇచ్చిన పనులపై ఇంటి సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. తాము ఆ పనులు చేయలేమని ముఖం మీద కొట్టినట్లు చెప్పారు. అయినప్పటికీ మాస్టర్ తన పంతా మార్చుకోకుండా అలాగే ప్రవర్తించాడు. దీంతో ఇంట్లోని వాతావరణం మరింత వేడిగా మారింది. చదవండి: 'మాస్టర్' ప్లాన్: ఇక హారిక, అభిలకు చుక్కలే.. అయితే మాస్టర్ కెప్టెన్సీ విధానంపై ఇంటిలోని సభ్యులతోపాటు నెటిజన్లు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మాస్టర్‌పై తీవ్ర ట్రోలింగ్ చేస్తున్నారు. కెప్టెన్సీ టాస్కులు అన్ని పరమ చెత్తగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేందుకు ఈ టాస్క్‌లు డైరెక్ట్ అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్ ఇవ్వండి అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. అసలు కెప్టెన్సీ టాస్క్ విషయంలోనే మాస్టర్‌ను తప్పుపడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయికి ఫిజికల్ టాస్క్ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక మగవారికి టాస్క్ ఇవ్వడం వల్ల అమ్మాయిలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మా ఆయన లేకపోతే బిగ్‌బాస్ షో లేదు కాగా పల్లెకు పోదాం ఛలో టాస్క్ అనంతరం రింగులో రంగు అనే కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా ఇందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్ మాస్టర్ పోటీదారులుగా ఉన్నారు. చేతికి గంతలు కట్టుకొని చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు రంగును అంటించుకోవాలి. ఈ టాస్క్‌లో అత్యధిక రంగు హారిక టీషర్ట్‌పై, తరువాత అరియానా మీద కూడా కొద్దిగా రంగు పడింది. అసలు రంగు పడకుండా తప్పించుకున్న మాస్టర్ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. కెప్టెన్ అనంతరం మాస్టర్ ప్రవర్తనలో మరింత మార్పు వచ్చింది. ఈ క్రమంలో హౌజ్‌లో అందరి కంటే మాస్టర్‌పై నెగిటివిటీ పెరిగిపోతుందని, అతన్ని ఎలిమినేట్ చేయకుండా ఎందుకు సేవ్ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇలా చేయడం వల్ల షోపై జనాలు ఆసక్తి తగ్గిపోతుందని అంటున్నారు. కొంతమంది కంటెస్టెంట్లపై ఫేవరిజం చూపిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవారం ఎలాగైనా తనను ఇంటికి పంపిచేయాల్సిందేనని వాదిస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్: కెప్టెన్‌గా మాస్టర్, మరి ఎలిమినేషన్? Ringu lo rangu bongu lo tasku Ani pettandra...captaincy tasks anni parama chettane ee season. Direct ga amma gadiki icheyandi — Vıη†aɠε ཞơω∂ყ (@vintagerowdy) November 6, 2020 trp ratings are dropping down. People losing interest in the show. Why don’t u eliminate people whom people don’t like? Enduku saving AR master? Shown genuinity is lost . No point in watching this useless scripted show showing favouritism towards particular contestants — phoenix (@phoenix69403196) November 6, 2020 Blindfold chesi #AmmaRajasekhar and two girls ni ringloki pampadam bongula undhi. Ekkada touch avutadho ane tension undadhaa girlski.#Abijeet task design ni question chesthe close friend journey videolo kuda cut chesav. Idhem task design now audience asking#BiggBossTelugu4 — sri2tweet (@sri2tweet1) November 6, 2020 -
‘కోవాక్సీన్’ బిహార్ కోసమేనట!
సాక్షి, హైదరాబాద్: ‘కేటీఆర్ గారూ ఇటీవల మీరు భారత్ బయోటెక్‌ను సందర్శించినప్పుడు కరోనా టీకా అయిన ‘కోవాక్సీన్’వేసుకున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతగా జనంలో తిరుగుతున్నా మీకు ఏమీ కాలేదు. లేదా ఇంకేదైనా కారణం ఉందా’అని ట్విట్టర్లో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. దానికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. నేను కోవాక్సీన్ టీకా వేసుకోలేదు. అది బిహార్ కోసమే రిజర్వ్ చేశారట’అని సమాధానం ఇచ్చారు. బిహార్‌లో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. -
ఇడ్లీ బోరింగ్ అని ట్వీట్.. నెటిజన్లు ఫైర్
ఇడ్లీ.. అత్యధిక మంది అల్పాహారంగా తీసుకునే వంటకాట్లో ఒక్కటి. ముఖ్యంగా దక్షిణ భారత్‌లో ఇడ్లీ ప్రియులు ఎక్కువగా ఉంటారు. నిరు పేద నుంచి ధనవంతుల వరకు ఇడ్లీను అల్పాహారంగా తీసుకుంటారు. అలాంటి ఇడ్లీలపై ఓ బ్రిటీష్ లెక్చరర్ చేసిన ట్వీట్.. దక్షిణ భారతీయుల కోపాన్ని చవి చూసింది. ఇడ్లీలు ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ అల్పాహారం అని ట్వీట్ చేశారు. దీంతో ఇండ్లీ ప్రియులు అతన్ని వేసుకున్నారు. ప్రజలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారో తెలియని ఒక వంటకం పేరు చెప్పండి’ పుడ్ డెలివరీ సంస్థ జొమాటో ట్వీట్ చేసింది. దీనికి చాలా మంది రిప్లై ఇచ్చారు. చోల్ భతురే, రాజ్మా చావల్, బిర్యానీ, మోమోస్, ఇడ్లీ వంటి ప్రసిద్ధ ఇష్టమైన వంటకాల పేర్లను పేర్కొన్నారు. అయితే ఒక బ్రిటిష్ లెక్చరర్ మాత్రం ‘ప్రపంచలో అత్యంత బోరింగ్ అల్పాహారం ఇడ్లీ’ అంటూ వివాదస్పద ట్వీట్ చేశారు. నార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన హిస్టరీ లెక్చరర్ ఎడ్వర్డ్ ఆండర్సన్ ఈ ట్వీట్ చేశారు. అయితే దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇష్టపడే ఇడ్లీని బోరింగ్ అంటావా అంటూ నెటిజన్లు అతనిపై ఫైర్ అవువున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా తిన్నావా? నీకేం తెలుసు ఇడ్లీల రుచి’, ఇడ్లీల గురించి నీకేం తెలుసు..బిర్యానీ మాత్రమే కాదు.. ఇడ్లీల విషయంలో కూడా దక్షిణ భారతీయులు ఐక్యంగా ఉంటారు’, ‘ఇడ్లీలు కాదు నువ్వే బోరింగ్’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో కంగుతున్న హిస్టరీ లెక్చరర్.. ‘దక్షిణ భారతీయులు నాపై ట్వీట్ల దాడి చేసే ముందు నాకు దక్షిణ భారత్ వంటకాలైనా దోశ, అప్పం లాంటి వంటకాలు నచ్చుతాయని తెలుసుకోండి. కానీ ఇడ్లీలు అంటే అంతగా ఇష్టం ఉండదు’ అని ట్వీట్ చేశారు. అయినప్పటికీ నెటిజన్ల దాడి ఆగలేదు. దీంతో చివరికి ఆయన క్షమాపణలు చెప్పడంతో ట్వీట్ల దాడి నిలిపివేశారు. Idli are the most boring things in the world. https://t.co/2RgHm6zpm4 — Edward Anderson (@edanderson101) October 6, 2020 Edward, that rumbling you hear is the South Indians mobilising the army. What have you done?!!!! — Rajesh Mehta (@RajeshBKDM) October 6, 2020 YOU ARE BORING. how dare you https://t.co/K4NTH3JUK5 — dr nabila 🌹 (@nmunawar) October 7, 2020 Not just Biriyani...whole of South India is united through idli😂😂 https://t.co/Ljp4uwiooa — S.R.Prabhu (@prabhu_sr) October 7, 2020 Having accidentally enraged the entirety of South India (and its omnipresent diaspora) on twitter, it was only right to order idlis for lunch. I'm very sorry to report that my unpopular - or "blasphemous", as some have said - opinion remains unchanged. #sorrynotsorry https://t.co/qx2VRJw6EO pic.twitter.com/TmIvxNWaYx — Edward Anderson (@edanderson101) October 7, 2020 -
సల్మాన్‌పై నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏది చేసినా సంచలనమే. బాలీవుడ్లో రూ.100 కోట్ల కలెక్షన్ల సినిమాలకు చిరునామాగా మారిన సల్మాన్, తాజాగా సైకిల్ తొక్కుతున్న ఫోటోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేశాడు. అయితే తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చాడు(స్టే స్టేఫ్ అని ఇంగ్లీషులో). కాగా సల్మాన్ సలహాపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. సల్మాన్ సైకిల్ తొక్కుతున్నప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. మీరు ఫుట్‌పాత్‌పై సైకిల్ తొక్కొద్దంటు మరో నెటిజన్ సల్మాన్‌కు సూచించాడు. అయితే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించాలని ఓ నెటిజన్ సల్మాన్‌ను కోరాడు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మీరు సైకిల్ తొక్కుతున్న దృష్యాలను పోస్ట్ చేయడంలో ఆంతర్యమేమిటని ఓ నెటిజన్ ప్రశ్నించారు. అయితే బాలీవుడ్ మీకు జీవితానిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని మరో నెటిజన్ సల్మాన్‌కు సూచించాడు. (చదవండి: కత్రినా కోసం ఆనవాయితీకి బ్రేక్) -
మీకు 20 సార్లు ట్వీట్ చేశాను: సోనూ సూద్
కష్టం, సహాయం అనే మాటలు వినిపిస్తే చాలు అక్కడ క్షణంలో వాలిపోతున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.. లాక్ డౌన్ కాలంలో వలస కూలీలను ఆదుకొని వారి పాలిట దేవుడు లాగా నిలిచిన సోనూ సూద్ ఇప్పటికీ ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సినిమాల్లో అయన విలన్ అయినప్పటికీ ఇప్పుడు సోనూ రియల్ హీరో అనిపించుకుంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. (నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి) అయితే సోనూ చేస్తున్న సాయాన్ని కొందరు ఆకతాయిలు ఆసరాగా తీసుకొని మితిమీరి ప్రవర్తిస్తున్నారు.. ఏ సాయం అడిగిన చేస్తాడని భావించి వింత కోరికలు కోరుతున్నారు. మందు కావాలని, లవర్ దగ్గరికి పంపండి, వీడియో గేమ్ ఆడుకోడానికి ఫోన్ కావాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ ట్విటర్ యూజర్.. ‘వీ సినిమా చూడాలి. ఏడాదికి సరిపడా అమెజాన్ ప్రైమ్ ఇప్పించండి’ అని కోరాడు. కాగా దీనిపై స్పందించిన సోనూ సూద్ నెటిజన్‌కు సమాధానమిచ్చారు. ‘అమెజాన్ ప్రైమ్ సరిపోతుందా లేదా టీవీ, ఏసీ, పాప్‌కార్న్ కూడా కావాలా’ అని సరదాగా బదులిచ్చారు. (విద్యార్థుల లైఫ్‌ను రిస్క్‌లో పెట్టలేం: సోనూ సూద్) ఇదిలా ఉండగా మరో నెటిజన్.. తనకు ఐఫోన్ కావాలని కోరాడు.. ‘నాకు ఐఫోన్ కావాలి. దీని గురించి ఇప్పటి వరకు మీకు 20 సార్లు ట్వీట్ చేశాను’ అని విజ్ఞప్తి చేశాడు.వస్తున్నాడు. ఇక ఈ కామెంట్‌పై సోనూ స్పందిస్తూ..‘నాకూ ఓ ఫోన్ కావాలి. దాని కోసం నేను మీకు 21సార్లు ట్వీట్ చేయగలను’..అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఏదైమైనా అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తూ తన సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు సోనూ సూద్. (సోనూ సూద్ మనసు బంగారం)