
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు అత్యంత అంగరంగ వైభోవోపేతంగా జరిగాయి. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత క్వాటామా ఎలిమెంటరీ స్కూల్‌లో (Quatama Elemantary School)లో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ పండుగలకు అమ్మాయిలు, మహిళలు తెలుగు తనం ఉట్టి పడే విధంగా సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగు రంగుల బతుకమ్మలతో వచ్చి ఆట పాటలతో హోరెత్తించారు.
దసరా వేడుకని వేదం మంత్రాలని అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజని నిర్వహిచారు. జమ్మి (బంగారయం), ఇచ్చి పుచ్చుకొని అందరు అలయ్ బలయ్ చేసికున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల వేడుకలలో పాల్గొన్న వారందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియచేశారు.
బతుకమ్మ పండుగ అత్యంత ఘనంగా జరగడానికి సహకరించిన మహిళలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఈ వేడుకలని వైభవోపేతంగా నిర్వహించి విజయవంతం కావడంలో కృషి చేసి ముఖ్య భూమికను పోషించిన పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వలంటీర్స్ - వీరేష్, సురేష్, మధుకర్, నరేందర్, అజయ్, ప్రవీణ్ ఏ, రఘు, జయకర్, రాజ్, శ్రీపాద్, శ్రీకాంత్, వెంకట్ , అరుణ్, శ్రీని ఎం, ప్రదీప్, శ్రీని జీ, రవి, కిషన్, నవీన్, మహేష్ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ప్రశంసలు తెలియ చేశారు.