TG: ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌ | Brs Leader Harishrao Comments On Congress Government Failures | Sakshi
Sakshi News home page

TG: ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

Published Mon, Oct 14 2024 4:07 PM | Last Updated on Mon, Oct 14 2024 4:35 PM

Brs Leader Harishrao Comments On Congress Government Failures

సాక్షి,మెదక్‌జిల్లా:తెలంగాణ ఉద్యమంలో అలయ్‌ బలయ్‌ ఎంతో స్ఫూర్తినిచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.ఆందోల్‌లో సోమవారం(అక్టోబర్‌14) మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మట్లాడారు.

‘కేసీఆర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు.సంగారెడ్డిలో కలుషిత నీళ్ళు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.మేము మిషన్ భగీరథ ద్వారా సురక్షిత నీళ్ళు ఇస్తే అది కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదు.రైతు బంధు లేదు,బతుకమ్మ చీరెలు లేవు,రుణ మాఫీ రాలేదు.డిసెంబర్ 9 పోయింది.

పంద్రాగస్టు పోయింది. నిన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ డిసెంబర్ 9కి రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్నాడు. ఏడాది కాలం గడిపారు.ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు.కేసీఆర్ ఇచ్చినవే ఇచ్చి డబ్బా కొట్టుకున్నారు’అని హరీశ్‌రావు విమర్శించారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌ హౌజ్‌అరెస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement