ఖాళీ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం: ఆర్‌. కృష్ణయ్య | Telangana: MP Krishnaiah Questions Govt In Filling Job Vacancies | Sakshi
Sakshi News home page

ఖాళీ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం: ఆర్‌. కృష్ణయ్య

Dec 2 2022 1:41 AM | Updated on Dec 2 2022 1:41 AM

Telangana: MP Krishnaiah Questions Govt In Filling Job Vacancies - Sakshi

నిరుద్యోగ గర్జనలో పాల్గొన్న ఎంపీ ఆర్‌.కృష్ణయ్య తదితరులు 

చైతన్యపురి: ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉన్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏ సీ చైర్మన్‌ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

తెలంగాణలో 44 వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం కావటంతో లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement