CWC 2023 IND VS PAK: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌.. గిల్‌ రీఎంట్రీ | CWC 2023 IND VS PAK: India Won The Toss And Choose To Bowl, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

CWC 2023 IND VS PAK: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌.. గిల్‌ రీఎంట్రీ

Oct 14 2023 1:48 PM | Updated on Oct 14 2023 2:00 PM

CWC 2023 IND VS PAK: India Won The Toss And Choose To Bowl, Here Are Playing XI - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 14) భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. డెంగ్యూ కారణంగా వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఈ ఒక్క మార్పు మాత్రమే ఉంది. మరోవైపు పాక్‌ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడు (భారత్‌), నాలుగు (పాక్‌) స్థానాల్లో కొనసాగుతున్నాయి.

తుది జట్లు..
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement