ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే? | Rayudu's CSK Playing XI: Conway to partner Gaikwad, Rachin Ravindra at 3 | Sakshi
Sakshi News home page

IPl 2025: ఓపెనర్లగా కాన్వే, రవీంద్ర.. సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవన్ ఇదే?

Mar 16 2025 12:27 PM | Updated on Mar 16 2025 12:58 PM

Rayudu's CSK Playing XI: Conway to partner Gaikwad, Rachin Ravindra at 3

ఐపీఎల్‌-2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అన్ని విధాల సిద్దమవుతోంది. చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో సీఎస్‌కే ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత సీజన్‌లో గ్రూపు స్టేజికే పరిమితమైన సీఎస్‌కే.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం అదరగొట్టాలన్న పట్టుదలతో ఉంది.

రికార్డు స్ధాయిలో ఆరో ఐపీఎల్ ట్రోఫీపై మెన్ ఇన్ ఎల్లో కన్నేసింది. అందుకోసం సీఎస్‌కే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం సామ్ కుర్రాన్‌, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు సీఎస్‌కే జట్టులోకి వచ్చారు. కెప్టెన్ రుతురాజ్‌​ గైక్వాడ్‌, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, ధోని వంటి ఆటగాళ్లతో సీఎస్‌కే బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కన్పిస్తోంది. 

బౌలింగ్‌లోనూ పతిరానా, నాథన్ ఈల్లీస్‌, నూర్ ఆహ్మద్‌​ వంటి యువ సంచలనాలతో సీఎస్‌కే బలంగా ఉంది. ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో సీఎస్‌కే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు అంచనా వేశాడు.

సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను  రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డెవాన్ కాన్వే ప్రారంభించాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్‌లో గైక్వాడ్‌కు ఓపెనింగ్‌ భాగస్వామిగా రచిన్ రవీంద్ర వచ్చాడు. కానీ గత సీజన్‌లో రవీంద్ర తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ క్రమంలోనే రవీంద్రను మూడో స్దానంలో బ్యాటింగ్‌కు పంపించాలని రాయుడు సూచించాడు. 

అదేవిధంగా నాలుగో స్ధానం కోసం దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్‌​ దూబే, సామ్ కుర్రాన్‌, రవీంద్ర జడేజాలకు అంబటి చోటు ఇచ్చాడు. 

ఫాస్ట్ బౌలర్లగా మతీషా పతిరాన, అన్షుల్ కాంబోజ్‌.. స్పెషలిస్టు స్పిన్నర్‌గా అశ్విన్‌కు తుది జట్టులో అతడు అవకాశమిచ్చాడు. కాగా  ఐపీఎల్‌-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ​కేకేఆర్‌-ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి.

రాయుడు ఎంపిక చేసిన సీఎస్‌కే ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), రవిచంద్రన్ అశ్విన్, సామ్ కర్రాన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్

బెంచ్: ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, జామీ ఓవర్టన్
చదవండి: IPL 2025: చ‌రిత్ర‌కు అడుగు దూరంలో ర‌హానే..


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement