
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక, అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్ లోని జలసౌథలో ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ సమావేశానికి హాజరయ్యారు.
అయితే బోర్డు సమావేశంలో ఎలాంటి వాదనలు వినిపించకుండా ఏపీ అధికారులు వెళ్లిపోగా, తెలంగాణ మాత్రమే తమ వాదనను వినిపించింది. దాంతో నీటి ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు రేపు(మంగళవారం) సమావేశం కానున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న పంటలు, త్రాగునీటి అవసరాలపై వివరాలతో రావాలని ఇరు రాష్ట్రాలను కృష్ణ నదీ యాజమాన్య బోర్డు కోరింది. చీఫ్ ఇంజనీర్ల సమావేశం అనంతరం ఎల్లుండి మరోసారి బోర్డు ముందు ఇరు రాష్ట్రాల అధికారులు.మరోసారి భేటీ కానున్నారు.