
- వరల్డ్ లివర్ డే సందర్భంగా కాలేయ ఆరోగ్యంపై అవగాహన
- అవగాహనతో లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్న ఆలివ్ హాస్పిటల్
హైదరాబాద్: ఆరోగ్యకరమై, సురక్షితమైన జీవనానికి కాలేయ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాలేయ ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉంటే కాలేయ వ్యాధుల నియంత్రణ కష్టమేమి కాదనీ ఆలివ్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్. పరాగ్ దశత్వార్ అన్నారు. అంతర్జాతీయ కాలేయ దినోత్సవం సందర్భంగా ఆలివ్ హాస్పిటల్ యాజమాన్యం కాలేయ వ్యాధులపై పౌరులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. గ్యాస్ట్రో, హెపటాలజీ వైద్య బృందంతో కాలేయాన్ని సంరక్షించుకునే అంశాలపై చర్చించారు. శరీర జీవక్రియలలో కీలక పాత్ర పోషించే కాలేయంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు సూచించారు.
కాలేయ వ్యాధులు, నివారణ, నియంత్రణ చర్యలపై అవగాహన కలిగి ఉంటే ప్రాణప్రాయ పరిస్థితులే దరిచేరవని ఆసుపత్రి కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ పరాగ్ దశత్వార్ అన్నారు. ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ, కాలేయ వ్యాధులు, ఇన్ ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్, జీఐ మాలిగ్నెన్సీ వంటి వ్యాధులకు చికిత్స చేయడంలో అనుభవం కలిగి కాలేయ ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయన మాట్లాడారు. " కాలేయం నిర్విషీకరణ, జీర్ణక్రియ, పోషక నిల్వ, రక్తం గడ్డకట్టడం వంటి ముఖ్యమైన విధులకు బాధ్యత వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి. ఏటా లక్షలాది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. హెపటైటిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్, సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురౌతున్నారు. పోషకాహారం, కొవ్వు, చక్కెర, సోడియంను పరిమితం చేస్తే కాలేయ వాపు గణనీయంగా తగ్గుతుంది.
మెడిటరేనియన్ డైట్ వంటి ఆహారాలు నాన్-ఆల్కహాలిక్ ప్యాటీ లివర్ వ్యాధులను తిప్పికొట్టవచ్చు. కాలేయ సంబంధిత వ్యాధుల ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. నగరీకరణ జీవనశైలి, మద్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి కారణాలతో కాలేయ ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. కాలేయాన్ని సంరక్షించుకునేందుకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల ఆహారాన్న తీసుకోవాలి. మద్యపాన వినియోగం తగ్గించడం, క్రమం తప్పని శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువు, హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండటం వంటి అలవాట్లతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వీటితోపాటు అదనంగా హెపటైటిస్ A, Bలకు టీకాలు వేయడం కీలకం అన్నారు. కాలేయ వ్యాధులకు ప్రత్యేక సంరక్షణతో సమగ్రమైన, అధిక నాణ్యతను అందించే లక్ష్యంలో ఆలివ్ హాస్పిటల్ సిద్ధంగా ఉంది. అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో, ఆసుపత్రి రోగులకు సాధ్యమైనంతఉత్తమమైన ఫలితాలను నిర్ధారించడానికి సాధారణ స్క్రీనింగ్ ద్వారా అధునాతన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి." అని అన్నారు.
ఆలివ్ హాస్పిటల్ గురించి:
తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది.
ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్, ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్థులైన వైద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యత యొక్క బంగారు ప్రమాణం అయిన నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ & హెల్త్కేర్ నుండి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.