Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu, Pawan Kalyan By Vardhelli Murali1
రెండు కోహినూర్‌ కథలు!

నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్‌ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్‌. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్‌ లైన్‌లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్‌లో ఉన్న కోహినూర్‌ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్‌ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్‌ మోస్ట్‌ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్‌ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ కోసం మరోసారి సింగపూర్‌ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్‌ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.సింగపూర్‌ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్‌ ఏరియా ఒప్పందాన్ని జగన్‌ సర్కార్‌ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్‌ ఏరియా ఒప్పందంలో సింగపూర్‌ తరఫున మంత్రి ఈశ్వరన్‌ కీలక భూమిక పోషించారు. ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్‌ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్‌కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్‌ పాత్ర కారణంగా ఉండాలి.ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్‌ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్‌ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్‌ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్‌ బ్రాండ్‌ మనకు కోహినూర్‌ డైమండ్‌ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్‌పై ఓ కామెంట్‌ విసిరి ఆయన సింగపూర్‌ వెళ్ళారు.గతంలో కుదిరిన స్టార్టప్‌ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్‌ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్‌ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్‌ మెంట్‌ పార్ట్ట్‌నర్స్‌’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్‌ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది. ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌తో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్‌ నేతృత్వంలో వచ్చిన సింగపూర్‌ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్‌ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.ఇక రెండో కోహినూర్‌ కథలో నిజంగానే కోహినూర్‌ డైమండ్‌ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్‌ కల్యాణ్‌ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్‌ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది. విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్‌ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్‌ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంత చిన్న విషయంపై కూడా పవన్‌ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్‌ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్‌ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.కోహినూర్‌ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్‌ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్‌షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్‌సింగ్‌ వశమై లాహోర్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్‌ వారితో లండన్‌కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్‌ కోహినూర్‌ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్‌ చక్రవర్తి. ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్‌ కల్యాణ్‌ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్‌ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్‌ చేసిన క్రిష్‌ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు. కానీ, మొఘల్‌ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్‌ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్‌ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్‌ పవర్‌గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్‌ ది గ్రేట్‌ అని ఊరికే అనలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్‌వాళ్లే కాని, మొఘల్స్‌ కాదు. బాబర్‌ సెంట్రల్‌ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్‌మహల్‌ వంటి సంత కాలను చేశారు. బ్రిటిష్‌ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ కాదా? బ్రిటిష్‌ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్‌లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Andhra Pradesh Govt Tops In Debts says Comptroller and Auditor General2
అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల జాతర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని పలు రాష్ట్రాల ఆదాయ, వ్యయాలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెల్లడించిన నివేదికల ప్రకారం బహిరంగ మార్కెట్‌లో రుణాలను ఏపీనే అందరికంటే ఎక్కువగా తీసుకుంటోంది. అప్పుల్లో ఏపీ రూ. 37 వేల కోట్లతో మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌ రూ. 26 వేల కోట్లే తీసుకోవడం గమనార్హం. కాగ్‌ ఇటీవల వెల్లడించిన నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత మూడు నెలల (2025 ఏప్రిల్, మే, జూన్‌) కాలంలో రూ.37.093 కోట్ల అప్పులను సేకరించింది. ఏపీతో పోలిస్తే తెలంగాణ ఒకింత తక్కువే అయినా రూ. 20 వేల కోట్ల అప్పుల చిట్టాను దాటిపోయింది. తెలంగాణతో కొంచెం అటూ ఇటుగా కేరళ, రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలుండగా, మధ్యప్రదేశ్‌ మాత్రం తెలంగాణ కంటే ఎక్కువగానే అప్పులు తీసుకుంది. ఇక, దక్షిణాది రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ ఎవరికీ చిక్కనంత దూరంలో నిలిచింది. జాబితాలో ఏపీ తర్వాత తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. సగానికి చేరువగా...! వాస్తవానికి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇంత మొత్తంలో రుణాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాయి. ఈ మేరకు వార్షిక బడ్జెట్‌ అంచనాల్లో ప్రతిపాదించి అసెంబ్లీ ఆమోదం తీసుకుని ఏడాదిపాటు ఆ రుణాలను క్రమంగా తీసుకుంటాయి. కానీ ఏపీ మాత్రం కేవలం మూడు నెలల కాలంలోనే ఏడాది మొత్తం లక్ష్యంగా పెట్టుకున్న అప్పుల్లో దాదాపు సగం అప్పుడే తీసేసుకున్నట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం రూ.79,926.89 కోట్లను 2025–26 ఆర్థిక సంవత్సరంలో అప్పుల పద్దు కింద సమకూర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, అందులో 46.40 శాతం అంటే రూ. 37,093.98 కోట్లను అప్పుడే తీసేసుకుంది. ఇక, తెలంగాణ రూ. 54,009.74 కోట్ల రుణ సేకరణ లక్ష్యంగా పెట్టుకుని తొలి మూడు నెలల కాలంలో 37.52 శాతం అంటే రూ. 20,266.09 కోట్లను సమకూర్చుకుంది. తెలంగాణలో కొంచెం అటూ ఇటుగా...తెలంగాణ ఖజానా గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ముందుకెళ్తోంది. గత వార్షిక బడ్జెట్‌ లక్ష్యంలో తొలి మూడు నెలల్లో 17.80 శాతం నిధులు సమకూరగా, ఈసారి కొంచెం ఎక్కువగా 20.19 శాతం అంటే రూ.57,449 కోట్లు సమకూరాయి. పన్ను ఆదాయంలో గత ఏడాది లక్ష్యంతో పోలిస్తే తొలి మూడు నెలల్లో 16.10 శాతం రాగా, ఈ ఏడాది 35,721.80 కోట్లు (16.20%) వచ్చాయి. జీఎస్టీ, స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్, పన్నేతర ఆదాయం...ఇలా అన్ని పద్దుల్లోనూ కొంచెం అటూ ఇటుగా 2024–25 ఆర్థిక సంవత్సరం మాదిరిగానే నిధులు సమకూరుతున్నాయని కాగ్‌ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అప్పులు మాత్రం ఈసారి ఒకింత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది పెట్టుకున్న రుణలక్ష్యంలో తొలి మూడు నెలల్లో 26.74 శాతం సమకూర్చుకోగా, ఈసారి మాత్రం 37.52 శాతం రుణాలను తీసేసుకోవడం గమనార్హం. ఇక, ఆదాయ రాబడులు ఎలా ఉన్నాయో వ్యయ లెక్కలు కూడా అలాగే ఉన్నాయని కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. అన్ని పద్దుల కింద కలిపి మొత్తం రూ. 57,499. 58 కోట్లు రాగా.. రూ.52,559.96 కోట్లు ఖర్చయ్యాయి. రూ.10,582.85 కోట్లు రెవెన్యూ లోటు నమోదు కాగా, రూ.20,266.09 కోట్ల ద్రవ్య లోటుతో తెలంగాణ ఖజానా ఉందని కాగ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Illegal Liquor Case: Sit Search Balaji Govindappa Residency Hyderabad3
అక్రమ మద్యం కేసు.. ‘సిట్‌’ మరో కొత్త నాటకం

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్‌ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్‌ ప్రయత్నించింది. హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్‌ అధికారులు హల్‌చల్‌ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్‌ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్‌ చేసింది‌. 74 రోజులుగా ఆయన రిమాండ్‌లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్‌ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఆయన పిటిషన్‌పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్‌ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్‌ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్‌ ఇంటర్నేషనల్‌లో ఫుల్‌టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాట్‌ గ్రూప్‌కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్‌ అధికారులు సోదాలు చేపట్టారు.

YS Jagan tweet on the deteriorating economic situation of AP4
మరింతగా దిగజారిన ఏపీ ఆర్థిక స్థితి.. వైఎస్‌ జగన్‌ ఆందోళన

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారాయన. కాగ్‌ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్‌ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని వైఎస్‌ జగన్ అభిప్రాయపడ్డారు. ఆ నివేదికలో.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు (పన్నులు, పన్నేతర ఆదాయాలు) అత్యంత మందగమనం చూపించాయని అన్నారాయన. జీఎస్‌టీ, సేల్స్‌ టాక్స్‌ ఆదాయాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆదాయాలు లేకపోగా శరవేగంగా అప్పులు పెరుగుతున్నాయ్‌ప్రభుత్వ విధానాలతో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందిమొదటి త్రైమాసికంలో రాష్ట్రంపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందిఏపీలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగా లేనేలేదువిభజనతో మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చిందిఏపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందిఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందిపన్ను ఆదాయం, పన్నేతర ఆదాయాలు పేలవంగా ఉన్నాయిగతేడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది.. జీఎస్‌టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయికొన్ని శాఖల్లో అత్యంత అధ్వాన్నమైన వృద్ధిరేటు ఉందిరాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయికేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14 శాతం మాత్రమే పెరిగిందిఅప్పులు మాత్రం మూడు నెలల్లో ఏకంగా.. 15.61శాతం వేగంతో పెరిగాయిఇది ఏపీపై ఆర్థిక ఒత్తిడికి సంకేతం అని జగన్‌ అన్నారు. అలాగే.. చంద్రబాబు ప్రభుత్వం ఖర్చులు, సొంత ఆదాయాలపై కాకుండా అప్పులపై ఆధారపడుతున్నాయని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరంగా మారిందని జగన్‌ అభిప్రాయపడ్డారు.Fiscal stress worsens in the first quarter of this financial yearThe CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public… pic.twitter.com/0tYnKfNSQi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 26, 2025వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులపై చంద్రబాబు చేసిన తప్పుడు లెక్కల ప్రచారం(రూ.14 లక్షల కోట్లంటూ..) గురించి తెలిసిందే. అంతేకాదు.. ఆ సమయంలో ఏపీ మరో శ్రీలంక అయిపోతోందంటూ గగ్గోలు పెట్టారాయన. అయితే మొత్తంగా జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమేనని కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఇంకోవైపు.. ప్రతీ మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసుకున్న చంద్రబాబు, కేవలం 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్ల అప్పు చేయడం విశేషం.

Vijay Deverakonda Kingdom Movie trailer launch Grandly At Tirupati5
ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ లాంచ్‌.. అంచనాలు తారాస్థాయికి

తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది.‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "గత సంవత్సర కాలంగా 'కింగ్‌డమ్' గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం." అన్నారు.

Congress MP Chamala Kiran Takes On KTR6
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్‌, మా బావ హరీష్‌ వచ్చి..’

హైదరాబాద్‌: కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం​ కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ​ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ‘ఎక్స్‌’ వేదికగా బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్‌, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్‌ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025

Asia Cup 2025 Acc Announces Full schedule Ind vs Pak Match Dates out7
Asia Cup: పూర్తి షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ల తేదీలివే!

Asia Cup 2025: ఆసియా కప్‌-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్‌ మండలి (ACC) శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్‌ ఫోర్‌ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్‌ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.గ్రూప్‌- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ గ్రూప్‌-బి నుంచి తలపడతాయి. దుబాయ్‌, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.బీసీసీఐపై విమర్శలుకాగా ఆసియా కప్‌ టీ20 టోర్నీకి ఈసారి భారత్‌ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.కానీ.. తాజా షెడ్యూల్‌ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్‌ ఆడేందుకు ఇండియా చాంపియన్స్‌ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ రద్దు కాగా.. చెరో పాయింట్‌ వచ్చింది.లీగ్‌ దశ షెడ్యూల్‌👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్‌ యూఏఈ👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌👉సెప్టెంబరు 12: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఒమన్‌👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ శ్రీలంక👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్‌ ఒమన్‌👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌👉సెప్టెంబరు 17: పాకిస్తాన్‌ వర్సెస్‌ యూఏఈ👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్‌ ఒమన్‌సూపర్‌ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్‌- బి టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)👉సెప్టెంబరు 21: గ్రూప్‌-ఎ టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)👉సెప్టెంబరు 23: A2 vs B1👉సెప్టెంబరు 24: A1 vs B2👉సెప్టెంబరు 25: A2 vs B2👉సెప్టెంబరు 26: A1 vs B1👉సెప్టెంబరు 28: ఫైనల్‌.చదవండి: IND vs AUS: ధావన్‌ ధనాధన్‌.. పఠాన్‌ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం

One year old bites cobra in Bihar boy survives snake dies8
ఏడాది వయస్సున్న బుడ్డోడు కొరికితే కోబ్రానే చనిపోయింది..!

సాధారణంగా పాము కరిచి ప్రజలు మృత్యువాత పడిన ఘటనలే మనకు కనిపిస్తూ ఉంటాయి. అదే మనిషి కరిస్తే పాము చచ్చిపోతుందా అనేది మాత్రం ఇక్కడ ఆసక్తికరం. ఒకవేళ ఈ తరహా ఘటనలు జరిగినా అరుదనే చెప్పాలి. మరి ఏడాది వయస్సున్న చంటోడు కోబ్రాను కొరికితే అది చచ్చిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటన బిహార్‌ రాష్ట్రంలోబెట్టాహ్‌ జిల్లాలోని వెస్ట్‌ చాంపరన్‌లో చోటుచేసుకుంది. ఆ బుడ్డోడు ఇంట్లో ఆడుకుంటున్న సమయం‍లో కోబ్రా వచ్చింది. అయితే అది ఆట వస్తువు అనుకున్న ఆ పిల్లాడు.. దాన్ని గట్టిగా పట్టుకుని ఒక పట్టుపట్టాడు. ఆ పామును కోరిక పారేశాడు. దాంతో ఆ పాము చనిపోవడం ఇప్పుడు షాకింగ్‌ ఘటనగా మారిపోయింది. పామును కరిచిన తర్వాత ఆ చంటోడు స్పృహ కోల్పోవడంతో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఆ పిల్లాడికి ఎటువంటి విషం ఎక్కలేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లాడ్ని కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలనే డాక్టర్ల సూచన మేరకు అక్కడే ఉంచారు. ఆ పిల్లాడి అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం.. ఒక పొడవాటి కోబ్రా ఇంట్లోకి వచ్చిందని, ఆ సమయంలో పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడని, ఆ పామును ఆట వస్తువు అనుకుని దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకుని నోటితో కొరికినట్లు చెప్పారు.

Guess the Actress, Who Acted with Srikanth, Rajinikanth9
ఈ హీరోయిన్‌కు అప్పట్లో ఫుల్‌ క్రేజ్‌.. ఇలా మారిపోయిందేంటి!

పైన కనిపిస్తున్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో అగ్ర కథానాయికగా స్టార్‌డమ్‌ అందుకుంది. కానీ, అందరిలాగే పెళ్లి కాగానే నటనకు గుడ్‌బై చెప్పి ఇంటికే పరిమితమైంది. 2009 తర్వాత మరే చిత్రంలోనూ కనిపించనేలేదు. ఇంతకీ ఆ కథానాయిక మరెవరో కాదు మాళవిక (Actress Malavika).పెళ్లయ్యాక సినిమాలకు గుడ్‌బైమాళవిక అసలు పేరు శ్వేత కొన్నూర్‌ మీనన్‌ (Shweta Konnur Menon). చాలా బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌, చంద్రముఖి చిత్రాల్లో నటించింది. తమిళంలో స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. బోల్డ్‌ పాత్రల్లోనూ కాదనకుండా యాక్ట్‌ చేసింది. 2007లో సుమేశ్‌ మీనన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య రీఎంట్రీకి రెడీ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలా అయిపోయిందేంటి?పుష్పలో సమంతలా 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' వంటి ఐటం సాంగ్స్‌ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అప్పట్లో నాజూకుగా ఉన్న మాళవిక ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్న ఈమె.. ఇంతలా లావైపోవడంతో అభిమానులు వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. మాళవిక ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్‌ దేవరకొండ

Operation Sindoor to be part of NCERT textbooks10
స్పెషల్‌ సిలబస్‌గా ‘ఆపరేషన్‌ సిందూర్‌’..!

ఢిల్లీ: పెహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌.. తరగతి గదుల్లో పిల్లలు చదువుకునే పాఠాల్లోకి రావడానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఇది తరతరాలు గుర్తుపెట్టుకునే దిశగా ఉండేందుకు వీలుగా ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు ఎన్సీఈఆర్టీ(నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) సిలబస్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ ను పాఠ్యాంశంగా చేర్చేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. దీన్ని స్పెషల్‌ క్లాస్‌రూమ్‌ సిలబస్‌’గా ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఎన్సీఈఆర్టీ. మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఈ సిలబస్‌ను ప్రవేశ పెట్టాలనే దిశగా కసరత్తు జరుగుతుంది. దీన్ని రెండు భాగాలుగా విభజించి.. మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకూ ఒక పార్ట్‌గా, తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకూ రెండో పార్ట్‌గా విభజించి సదరు సిలబస్‌లో చేర్చడానికి ఎన్సీఈఆర్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద ముప్పులకు దేశాలు ఎలా స్పందిస్తాయో అనే అంశంతో పాటు జాతీయ భద్రతలో రక్షణ, దౌత్యం మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనేది విద్యార్థులకు చేరువ చేయడమే ఈ సిలబస్‌ యొక్కు ముఖ్య ఉద్దేశంగా సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement