నవ వధువుల ఓటు ఉత్సాహం , దక్షిణ కన్నడ జిల్లాలో ఓటేసిన జంట
సాక్షి, బెంగళూరు: ఎన్నికల రోజున పలు చోట్ల పెళ్లిళ్లు జరిగాయి. ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని కొత్త దంపతులు కొందరు పెళ్లికి ముందే ఓటేస్తే, మరికొందరు తాళి కట్టి బయల్దేరారు.
⇔ దక్షిణ కన్నడ జిల్లాలోని విట్లాలో ఉదయాన్నే వధువు శ్రుతి పెళ్లి మంటపానికి వెళ్లకముందు పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి ఓటేశారు.
⇔ అదే జిల్లా పుత్తూరులో వధువు హేమలత, బెళ్తంగడి తాలూకాలో తణ్ణీరుపంథలో పెళ్లికూతుళ్లు అశ్విని, అక్షత ఓటు వేశారు.
⇔ బంట్వాళలో నవజంట సుమిత్ పూజారి, ప్రతిజ్ఞ మొదట ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. ఆ తర్వాత పోళలి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment