సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 29 నాటికి 1,000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ఆరోజు ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
28న ఈ కార్యక్రమం ఉంటుందని అంతకు ముందు ప్రకటించినా 1,000 కిలోమీటర్లు 29 నాటికి పూర్తికా నుండటంతో ఈ మేరకు మార్పు చేశారు. ఆ రోజు అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులతో రెండు కిలోమీటర్ల పాదయాత్రలు చేపట్టనున్నట్లు పార్టీ పేర్కొంది.
29న ‘వాక్ విత్ జగనన్న’
Published Wed, Jan 24 2018 1:14 AM | Last Updated on Tue, May 29 2018 4:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment