Walk with jagan
-
ప్రజాసంకల్పయాత్ర @1000 కిలోమీటర్లు
-
పాదయాత్రికునికి అడుగడుగునా నీరాజనాలు
-
ప్రజాసంకల్పయాత్ర @1000
-
భారీఎత్తున ‘వాక్ విత్ జగనన్న’
-
వైఎస్ జగన్ @ 1000 కిలోమీటర్లు
సాక్షి, నెల్లూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను సావధానంగా వింటూ వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే రాజన్న తనయుడిగా ప్రజామోద పాలన అందిస్తామని భరోసానిస్తూ ముందుకెళ్తున్నారు. స్ఫూర్తిదాయక హామీలతో కొనసాగుతున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జననేతకు బాసటగా ‘వాక్ విత్ జగన్’ అంటూ వేలాదిమంది పాదయాత్రలతో ఉరకలెత్తారు. కాగా గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
టీడీపీకి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయి
-
మైదుకూరులో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, మైదుకూరు: వైఎస్సార్ కడప జిల్లాలో మైదుకూరులో సోమవారం పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా 'వాక్ విత్ జగన్' కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఫైన్ విధించారు. అయితే పోలీసుల ఓవర్ యాక్షన్‌పై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అసహం వ్యక్తం చేశారు. అన్యాయంగా కార్యకర్తలకు ఫైన్ వేశారని మండిపడ్డారు. -
‘వణికిపోతున్న చంద్రబాబు’
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర టీడీపీకి అంతిమయాత్ర కాబోతున్నదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం వేలాది మందితో కలిసి ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని వినాయక గుడి నుండి ఓంశక్తి ఆలయం వరకు ఆమె పాదయాత్ర చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తవణంపల్లిలో డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్యర్యంలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. -
ఉత్సాహంగా ‘వాక్ విత్ జగనన్న’
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమాన్ని సోమవారం భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు నగరాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. విదేశాల్లోనూ అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనంతపురం: వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి జెడ్పీ ఆఫీసు దాకా నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్ పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ అన్న కార్యక్రమం చేపట్టి ఉరవకొండ నుంచి బుదగవి వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి అన్నదానం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. యాడికిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి వాక్ వీత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమగోదావరి: గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పేరుతో పాదయాత్ర భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో నిర్వహించారు. ఇందులో వైస్సార్సీపీ మండల కన్వీనర్ తిరుమాని ఏడుకొండలు, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బాయి చౌదరి, కొఠారు రామచంద్రరావుల ఆద్వర్యంలో పెదవేగి మండలం విజయరాయి గ్రామం నుంచి బలివే జంక్షన్ వరకు వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహంచారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు,మండల కన్వీనర్ మెట్టపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఉండి మండలం ఉండి గ్రామంలో నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ఉండి బస్టాండ్ నుంచి గోరింతోట గ్రామం వరకు పాదయాత్ర చేశారు. ఇందులో జిల్లా యువజన అధ్యక్షులు మంతెన యోగీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు .కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ బస్టాండ్ వద్ద నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాశ్, మండల కన్వీనర్లు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలులో నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి నారాయణ పురం మీదుగా ఉంగుటూరు సెంటర్‌కి పాదయాత్ర చేశారు. వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా కోఆర్డినేటర్ కొండేటిచిట్టిబాబు ఆధ్వర్యంలో పి.గన్నవరం నుంచి అంబాజీపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో పాముల రాజేశ్వరీదేవి, ఎమ్ మోహనరావు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంపచోడవరం నుంచి బందపల్లి వరకు కోఆర్డినేటర్ అనంతబాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్ కు మద్దత్తుగా పాదయాత్ర నిర్వహించారు. ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్, ఏలూరు సిటీ కన్వీనర్ బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బాయ్ చౌదరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దినేష్ రెడ్డి, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణా: శాసనసభ్యులు కొడాలి నాని అధ్వర్యంలో జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. వైఎస్ఆర్: కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వాక్ విత్ జగనన్న ర్యాలీని ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, ప్రజలు భారీగా హాజరయ్యారు. రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్వేల్లో పార్టీ సమన్వయ కర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) వైఎస్ జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా కమలాపురంలో సంఘీభావ పాదయాత్రను ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి చేపట్టారు. వేంపల్లిలో ఎంపీపి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, జడ్పీటీసీ షబ్బీర్ పార్టీ కార్యాలయం నుంచి వేంపల్లి బైపాస్ దగ్గర వివేకానంద కాలనీలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్రాయపేట ఇంచార్జ్ వైఎస్ కొండారెడ్డి, జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు చక్రాయపేట నాగులగుట్ట పల్లి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్మలమడుగులో పార్టీ సమన్వయ కర్త డా.సుదీర్ రెడ్డి ఆద్వర్య౦లో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆద్వర్యంలో వాక్ విత్ జగన్మ కార్యక్రమం నిర్వహించారు. నందలూరు మండల కేంద్రంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. సౌమ్యణాద స్వామి ఆలయం నుంచి నాగిరెడ్డిపల్లి మారమ్మాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు భారీగా తరలివచ్చారు. కర్నూలు: వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లలు పూర్తికానున్న నేపథ్యంలో నందికొట్కూరు లో ‘వాక్ విత్ జగనన్న’ పేరుతో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో నందికొట్కూరు నుంచి తర్తురు వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, ఎంపీటీసీలు,కౌన్సిలర్లు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మకూర్ లో శ్రీశైలం నియోజక వర్గ ఇన్ చార్జ్ వైఎస్ఆర్సీపీ నేత బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల టర్నింగ్ నుంచి పెద్ద బజార్ మీదుగా గౌడ్ సెంటర్ వరకు పాదయాత్ర చేశారు. డోన్ లో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యం లో జగన్ ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేశారు. రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై. ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయం గ్రామ శివారులోని రాఘసుధా నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో వైఎస్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణం వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఢిల్లీ: ఢిల్లీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏపీ భవన్ నుంచి పండిట్ రవిశంకర్ శుక్లా లేన్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో జగన్ లక్షల మందితో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారిన, జగన్ దృష్టికి తెచ్చిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు. ప్రజాభివృద్ధి అంశాలు వదిలిపెట్టి అసెంబ్లీ సీట్ల కోసం టీడీపీ కేంద్రాన్ని అడగడం విడ్డూరమని, ఫిరాయింపుల ప్రోత్సహానికే సీట్ల పెంపు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ అంశాలు పార్లమెంటులో లేవనెత్తుతామని మరోసారి గుర్తు చేశారు. విజయనగరం : ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి , అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షీత్ రాజు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టి కురుపాం నుంచి చినమేరంగి వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోలగట్ల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తవలస నుంచి పాత బస్టాండ్ మీదుగా వైఎస్సార్ విగ్రహాం వరకు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు జోగారావు, ప్రసన్న కుమార్ ఆద్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు : జిల్లా వ్యాప్తంగా వాక్ విత్ జగనన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నందిగం క్రాస్ రోడ్డు నుంచి చెక్ పోస్టు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కారంపూడి వరకు 35 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో అమరావతి బస్టాండ్ నుంచి అమరలింగేశ్వరుని ఆలయం వరకు భారీ ర్యాలీ జరిపారు. వైఎస్ఆర్సీపీ తాడికొండ సమన్వయకర్త క్రిస్టినా ఆధ్వర్యంలో మేడికొండూరు నుంచి పేరేచర్ల వరకు పాదయాత్ర చేశారు. రేపల్లె పేటూరు అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పాదయాత్రలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ యాత్రకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు. నగరంలోని పాలెం వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముస్తఫా, సమన్వయకర్తలు ఎల్.అప్పిరెడ్డి, రావి వెంకటరమణ పాదయాత్ర చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇస్సప్పాలెం అమ్మవారి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొల్లూరు నుంచి వేమూరు వరకు భారీ పాదయాత్ర చేపట్టారు. తెనాలి ఇన్ ఛార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరిపారు. ప్రత్తిపాడు సమన్వయకర్త మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో, వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహించి పాదయాత్ర చేశారు. నెల్లూరు : ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్ర చేశారు. ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చెంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. వరికుంటపాడులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి షేక్ అలీ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం పట్టణంలో వైఎస్ఆర్ అభిమానులతో వాక్ విత్ జగన్ కార్యక్రమంలో భాగంగా 3కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త నర్తు రామారావు ఇచ్చాపురంలో వందలాదిమంది కార్యకర్తలతో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం టౌన్ నుంచి వస్త్రపురి కాలని వరకు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. తూర్పుగోదావరి: వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దత్తుగా కొత్తపేట సాయిబాబా గుడి నుండి పలివెల వరకూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టారు. కె గంగవరం మండలంలో తామరపల్లి నుంచి గంగవరం సెంటర్ వరకు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు సామర్లకోటలో రెండు కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో కొండాలమ్మ చింత నుంచి పదోమైలు రాయి సెంటరు వరకూ వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని ప్రారభించారు. 2కిలో మీటర్ల పాద యాత్ర చేశారు. తణుకులో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. వైస్సార్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకోల్లు నరసింహారావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు నలుకుర్తి రమేష్ కార్యకమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నందిగామలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం చేపట్టారు. కైకలూరులో నియోజకవర్గ ఇన్ చార్జి దూలం నాగేశ్వరరావు ఆద్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి నేతలు బొడ్డు నోబుల్, ముంగర నరసింహరావు, పార్టీ నాయకులు కార్యకర్తలుచ పాల్గొన్నారు. శాసన సభ్యులు కొడాలి నాని అధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలులో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి బూరుగా పల్లి నరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అంబెడ్కర్ సర్కిల్ నుంచి నీరుగట్టివారి పల్లి మార్కెట్ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆను సాహెబ్ ఆధ్వర్యంలో కలక్టరేట్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రాన్ని విజయవంతం చేశారు. ప్రకాశం: కనిగిరి వైఎస్ఆర్సీపీ ఇంచార్జి బుర్రా,మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. చీరాలలో వైసీపీ ఇంచార్జీ యడంబాలాజి నాయకత్వంలో పట్టణ పురవీదుల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు భారి ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో దద్దలమ్మ ఆలయం నుండి పులిపాడు శివాలయం వరకు దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జ్ బాదం మాధవరెడ్డి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలంగాణలో... హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వరకు పాదయాత్ర, పాల్గొన్న వాసిరెడ్డి పద్మ, కార్యకర్తలు. సంగారెడ్డి: జోగిపేటలో రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్సార్సీపీ నాయకులు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహం నుంచి అన్నసాగర్ దర్గా వరకు పాదయాత్ర నిర్వహించి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అన్నాసాగర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్, రాష్ట్ర సంయుక్త నాయకులు బాలకృష్ణ రెడ్డి, నాయకులు రమేష్, పరిపూర్ణ, ప్రవీణ్, అరవింద్ పవన్ కుమార్. మహబూబ్‌నగర్ : వైఎస్ జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లా టీవైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు మరియమ్మ మరియు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కిలోమీటర్ పాదయాత్రగా బయల్దేరి వైఎస్ విగ్రహానికి పూల మాల వేశారు. ఖమ్మం: జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నర్సింహస్వామిగుట్ట వరకు పాదయాత్ర చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పెద్దఎత్తున పాల్గొన్న జగన్ అభిమానులు, స్థానిక ప్రజలు. రంగారెడ్డి : ఇబ్రహీంపట్టణంలో టీ వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్ ఆధ్యర్యంలో వాక్‌విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికారాబాద్ : కొడంగల్‌లో టీ వైఎస్ఆర్సీపీ ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాను టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ సమన్వయకర్త బాలరాజు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. -
నేడు వాక్ విత్ జగన్
కాకినాడ: కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసాగా నిలిచే లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. దీనిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ‘వాక్ విత్ జగన్’ పేరిట పాదయాత్ర చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తమవుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. అదే సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ‘వాక్ విత్ జగన్’ నిర్వహించాలని తలపెట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు భరోసాగా నిలవడంతోపాటు, పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, త్వరలో జిల్లాకు రానున్న పాదయాత్రలో అన్ని వర్గాలూ జగన్‌కు బాసటగా నిలిచేలా ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు మోషేన్‌రాజు, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ఈ కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. వాక్ విత్ జగన్‌లో పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు మోషేన్‌రాజు, కన్నబాబు, బోస్ పిలుపునిచ్చారు. -
అధినేతకు అండగా..
శ్రీకాకుళం అర్బన్: అధినేతకు అండగా వైఎ స్సార్ సీపీ నాయకులు ముందడుగు వేయనున్నారు. ప్రజాక్షేత్రంలో తమ నాయకుడు చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి టీడీపీ నిరంకుశ విధానాలను, ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలను ప్రజల కు పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. పథకాల పేరుతో జరుగుతున్న అవినీతిని, హామీలిచ్చి మర్చిపోయిన విధానాన్ని జనాలకు గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గత ఏడాది నవంబరు 6వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. వెంకటగిరి వద్ద యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రకు మద్దతుగా వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో.. శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మా న ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డే అండ్ నైట్ కూడలి వరకూ అక్కడ నుంచి పాలకొండ రోడ్ మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ అక్కడ నుంచి కళింగ రోడ్ మీదుగా పాతబస్టాండ్ వరకూ ఈ పాదయాత్ర జరగనుంది. ఆమదాలవలస నియోజకవర్గంలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో టీఎస్ఆర్ జూ నియర్ కళాశాల నుంచి కృష్ణాపురం జంక్షన్ వరకు ఈ పాదయాత్ర జరగనుంది. నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం నుంచి సబ్ రిజి స్ట్రార్ కార్యాలయం మీదుగా సంతపేట, వజ్రంపేట, ఆదివరపుపేట, బజారు, పెద్దపేట, ఆర్టీసీ కాంప్లెక్స్, కొత్తబస్టాండ్ మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనుంది. టెక్కలి నియోజకవర్గం పార్టీ కన్వీనర్ పేడాడ తిలక్ ఆధ్వర్యంలో టెక్కలిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా వైఎస్సార్ జంక్షన్ వద్ద రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం పాత జాతీయ రహదారి మీదుగా ఎన్ఎం రోడ్ జంక్షన్, మెయిన్‌రోడ్, అంబేడ్కర్ జంక్షన్, గోపీనాథపురం, తిరుగుప్రయాణం కచేరివీధి మీదుగా వాక్ విత్ జగనన్న పాదయాత్ర జరగనుంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రణస్థలం మండల కేంద్రంలోని రా మతీర్థాలు కూడలి నుంచి గిరివానిపాలెం గ్రామం వరకు సు మారు 8 కిలోమీటర్లు మేర వాక్ విత్ జగనన్న పేరిట పాదయాత్ర నిర్వహించనున్నారు. లావేరు మండలంలో పార్టీ మండల కన్వీ నర్ దన్నాన రాజినాయుడు ఆధ్వర్యలో సుభద్రాపురం కూడలి నుంచి వెంకటాపురం గ్రామం వరకు, ఎచ్చెర్ల మండలంలో పార్టీ మండల కన్వీనర్ సనపల నారాయణరావు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల గ్రామం నుంచి కుశాలపురం బైపాస్ వరకు, జి. సిగడాం మండలంలో పార్టీ మండల కన్వీనర్ మీసాల వెంకటరమణ ఆధ్వర్యంలో జి. సిగడాం మండల కేంద్రం నుంచి కొత్తపేట గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. పాలకొండ నియోజకవర్గ కేంద్రం పాలకొండలో నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్ర జరుగుతుంది. యాలాం కూడలి వద్ద అం బేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పలు వార్డులను కలుపుకొంటూ వీరఘట్టం రహదారిలో వైఎ స్సార్ విగ్రహం వద్ద సంఘీభావ పాదయాత్ర ముగుస్తుంది. రా జాం నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో రాజాం పట్టణంలోని అంబేడ్కర్ జంక్షన్ నుంచి వస్త్రపురి కాలనీ వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమం పేరిట పాదయాత్ర నిర్వహించనున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆ ధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్. ఎన్.పేట, కొత్తూరు తదితర మండలాలలో ఆయా మండల కన్వీనర్లు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం చేపడతారు. పలాస పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మందస మండలం హరిపురం గ్రామం నుంచి మందస వరకు, వజ్రపు కొత్తూరు మండలంలో వజ్రపుకొ త్తూరు నుంచి పల్లెసారథి వరకు, పలాస మండలంలో తర్లాకోట నుంచి రెంటికోట వరకు, కాశీబుగ్గలో మూడురోడ్లు నుంచి మొగి లిపాడు వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రా మారావు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్రను నిర్వహించనున్నారు. కవిటి మండలంలో జగతి గ్రామం కూడలి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు, ఇచ్చాపురం మున్సిపాలిటీలో అ మ్మవారి ఆలయం నుంచి టూరిజరం పార్కు వద్ద వైఎస్సార్ విగ్రహం వరకూ, కంచిలి మండలంలో బైరిపురం నుంచి బైరిపురం కూడలి రాధాకృష్ణ ఆలయం వరకూ పాదయాత్ర జరగనుంది. -
అడుగడుగులో జనం గుండె చప్పుడు
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ఆ చేతి స్పర్శ ఓ భరోసా.. ఆ మాటలో అసాధారణ ఆత్మ గౌరవం.. ఆ అడుగు రేపటి బంగారు భవితకు సోపానం.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జనం గుండె చప్పుళ్లకు ప్రతీకగా నిలిచింది. సోమవారం.. ప్రజా సంకల్పయాత్ర 1000 కిలోమీటర్ల అరుదైన మైలు రాయిని చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పాదయాత్ర విజయవంతంగా సాగుతుండడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అభిమాన నేత నిర్దేశించిన దూరాన్ని చేరుకునేందుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రజలు దేవుడిని కోరుకుంటున్నారు. పాదయాత్రలో 74వ రోజున నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం సమీపంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వెయ్యి కిలోమీటర్లను దాటుతారు. జిల్లాలో విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర... కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర నవంబర్ 14వ తేదీ ప్రారంభమై డిసెంబర్ 3వ తేదీ వరకు కొనసాగింది. జిల్లాలోని చాగలమర్రి నుంచి ప్రారంభమైన పాదయాత్ర తుగ్గలి మండలం ఎర్రగుడి వరకు 18 రోజులపాటు కొనసాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాల మీదుగా దాదాపు 270 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అడుగడుగునా వేలాది మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి నడిచారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, వికలాంగులు పెద్ద ఎత్తున జననేతకు తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రజా సమస్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి సావధానంగా వింటూ వాటికి పరిష్కారం చూపుతూ మందుకు సాగారు. జిల్లాలో చాగలమర్రి సమీపంలో 100 కిలోమీటర్లు, కారుమంచి సమీపంలో 200 కిలోమీటర్ల మైలురాయిని ప్రతిపక్ష నేత అధిగమించారు. తన పాదయాత్రలో..అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా ఉంటానని, ఏడాదిపాటు ఓపిక పడితే ప్రజా ప్రభుత్వం వస్తుందని ధైర్యం చెప్పారు. గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు: మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 18 రోజులపాటు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో పాదయాత్ర చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమకు గుండెకాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టును చేపడుతానని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి నానుతూ వస్తున్న హగరి, నగరడోణ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను ఒక టైమ్ బౌండ్‌తో పూర్తి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తానని చెప్పారు. వీటితో జిల్లాలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. నవరత్నాలు అమలైతే రాష్ట్రంలో పేదరికం మాయవుతుంది. శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సమస్యలు చెప్పుకొని ఉపశమనం పొందారు: నాలుగేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు అడిగిన వారు ఒక్కడూ లేడు. ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడానికే పరిమితం అయ్యారు. ప్రజలు తమ సమస్యలను జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో చెప్పుకొని ఉపశమనం పొందారు. ఆయనే సీఎం అన్న రీతిలో ఊహించుకొని తమ సమస్యలను బాధప్త హృదయంతో చెప్పుకున్నారు. ఆయన కూడా అంతే ఓపికతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రుణమాఫీ కాలేదని రైతులు, మహిళలు, ఫీజు రీయిబర్స్‌మెంట్ రాలేదని విద్యార్థులు, ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు, భృతి ఇవ్వడంలేదని యువకులు, పెన్షన్లు రావడంలేదని వృద్ధులు, మహిళలు, వితంతువులు, సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు, కులాల సమస్యల పరిష్కారం ఆయా సంఘాల నాయకులు వైఎస్ జగన్‌ను కలిశారు. రైతు, బీసీ, మహిళా సదస్సులు జిల్లాలో భారీ ఎత్తున విజయవంతం అయ్యాయి. బీవై రామయ్య, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నేడు వాక్ విత్ జగనన్న... జిల్లాలోని రెండు పార్లమెంటరీ జిల్లాల పరిధిలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర చేపట్టేందుకు నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 1000 కిలోమీటర్ల అరుదైన మైలురాయిని చేరుకోనుండడంతో ఈ కార్యక్రమానికి పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ప్రతి మండలంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
ప్రజా సంకల్పం స్ఫూర్తిగా..
సాక్షి, కడప : ప్రజా సంకల్ప పాదయాత్రను 2017 నవంబరు 6వ తేదీ ఇడుపులపాయ నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంకల్పించారు. జిల్లా ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఇడుపులపాయలో ప్రారంభమై ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతున్న ప్రతిపక్ష నేత పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటుతోంది. దీంతో పార్టీ అధిష్టానం వాక్ విత్ జగనన్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులన్నీ జిల్లాలో నిర్వహణకు సిద్దమయ్యాయి. నేడు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సోమవారం వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా నాయకులంతా పాదయాత్రలను చేపట్టనున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందులలోని ఆర్టీసీ బస్టాండు కూడలి నుంచి మెయిన్ బజారు పూలంగళ్ల మీదుగా జూనియర్ కళాశాల సర్కిల్ వరకు పాదయాత్ర చేయనున్నారు. కమలాపురంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటు ఇన్‌ఛార్జి కె.సురేష్‌బాబు, రాయచోటిలో ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, మైదుకూరులో ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వెంకట సుబ్బయ్య, జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు పాదయాత్ర శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ‘వాక్ విత్ జగన్’కు శ్రీకారం ఒంటిమిట్ట: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి కావడంతో ‘‘వాక్ విత్ జగన్’’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. మండల నాయకులు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ చామ సుబ్బారెడ్డి, మండల యూత్ కన్వీనర్ పోలి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చెర్లోపల్లి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. ముమ్మడి శ్రీధర్ రెడ్డి, తేళ్ల శేషారెడ్డి, నగేష్ రెడ్డి, జేసిబి సుబ్బారెడ్డి, ముమ్మడి నారాయణ రెడ్డి, చింతరాచపల్లి రాజమోహన్, డిప్ సుబ్బారెడ్డి, మాధవరం సర్పంచ్ సుబ్రమణ్యం, సిద్ధవరం గోపి రెడ్డి, గుండ్లు మల్లికార్జున రెడ్డి, రాజంపేట బాస్కర్ రాజు, పోలి మురళి, అచ్చవరం వేణుగోపాల్ రెడ్డి మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
నేడు వాక్ విత్ జగన్
అమరావతి ,కంకిపాడు (పెనమలూరు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సోమవారం జిల్లాలోని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లోనూ ‘వాక్ విత్ జగన్’ పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ మచిలీ పట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. కంకిపాడు మండలం, ఈడుపుగల్లు గ్రామంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి మండలంలోనూ పార్టీ శ్రేణులు రెండు కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టి విజయవంతం చేయాలన్నారు. కాల్వగట్ల వాసులకు అండగా, పింఛన్ల మంజూరు, పక్కా గృహాలకు అనుమతులు, ఇళ్లస్థలాల సమస్యలు, రుణమాఫీ అమలులో వివక్ష తదితర అంశాలపై బాధితుల వద్ద వివరాలు తెలుసుకుంటూ ఈ పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో వంచనకు గురైన ప్రజలు ఈ పాదయాత్రకు మద్దతు తెలపాలని విజ్ఞప్తిచేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు కంకిపాడు సినిమాహాలు సెంటరులో పాదయాత్ర ప్రారంభమై గన్నవరం రోడ్డు, పునాదిపాడు, గొల్లగూడెం మీదుగా కోలవెన్ను చేరుతుందన్నారు. అనంతరం ఉయ్యూరు, సాయంత్రం 4 గంటలకు పెనమలూరు పప్పుల మిల్లు సెంటరు నుంచి కాల్వ కట్ల మీదుగా పాదయాత్ర సాగుతుందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, జిల్లా నాయకులు పర్వతనేని వెంకట కృష్ణారావు, మాదు వసంతరావు, బాకీ బాబు, ఎస్సీ, బీసీ విభాగాల మండల అధ్యక్షులు కలపాల వజ్రాలు, నకరికంటి శేఖర్, బండారు సంసోన్, పెనమలూరు మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు, కాళిదాసు పాల్గొన్నారు. -
అడుగులో అడుగేస్తూ..
ప్రజాసంకల్ప యాత్ర దూసుకెళ్తోంది. లక్ష లాదిమంది ప్రజలతో మమేకమవుతూ లక్ష్యం వైపు కదులుతోంది. దుష్ట పాలనను అంత మొందించి రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు వేస్తున్న అడుగులు అధికార పక్షం నేతల్లో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు బాటలే సేందుకు బహుదూరపు బాటసారి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తోన్న ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారంతో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతుంది. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ‘జగన్‌తో నడుద్దాం’ అంటూ వేలాదిమంది కదం తొక్కనున్నారు. సాక్షి, విశాఖపట్నం: గడిచిన నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుంటూ మొక్కవోని దీక్షతో జనహృదయ నేత కదులుతుంటే పార్టీలకతీతంగా లక్షలాదిమంది ఆయనను అనుసరిస్తున్నారు. 3 వేల కిలోమీటర్ల ఈ సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల తొలి మైలురాయిని నేడు నెల్లూరు జిల్లా వెంకటగిరి వద్ద వైఎస్ జగన్ దాటబోతున్నారు. ఈ సందర్భంగా జననేతకు బాసటగా పార్టీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ‘వాక్ విత్ జగన్’ అంటూ జగన్ సైన్యం పాదయాత్రలతో ఉరకలెత్తనుంది. ఉత్తుంగ తరంగంలా సాగనున్న ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు పార్టీ శ్రేణులే కాదు.. సామాన్య జనం కూడా ఉవ్విళ్లూరుతున్నారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు అన్ని వార్డులు, మండల కేంద్రాల్లో కూడా ఈ పాదయాత్రలు జరిగేలా పార్టీ యంత్రాంగం రూట్ మ్యాప్ తయారు చేసింది. సిటీ, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నేతలంతా ఈ పాదయాత్రల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండల కేంద్రాల్లో సైతం 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు పాదయాత్రలు చేసేలా షెడ్యూల్ తయారు చేశారు. విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కంచరపాలెం నుంచి ఐటీఐ జంక్షన్ వరకు జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. అలాగే అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నా«థ్, పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణి అనకాపల్లిలో జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కాశీపురం నుంచి దేవరాపల్లి వరకు జరిగే పాదయాత్రలో పాల్గొంటారు. చోడవరం, పాడేరు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో పాదయాత్రలు తలపెట్టగా మిగిలిన నియోజక వర్గాల పరిధిలో నాలుగు మండలాల శ్రేణులు ఒకేచోట జరిగే పాదయాత్రలో పాల్గొనేలా రూట్ మ్యాప్ తయారు చేశారు. విజయవంతం చేయండి సాక్షి, విశాఖపట్నం : ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్ర నేటితో వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటుతున్న సందర్భంగా తలపెట్టిన వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. సోమవారం జీవీఎంసీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరుగుతాయన్నారు. వేలాదిగా పార్టీనేతలు, శ్రేణులు ఈ పాదయాత్రల్లో కదం తొక్కాలని మళ్ల విజయప్రసాద్ పిలుపునిచ్చారు. -
28న గుంటూరులో వాక్ విత్ జగన్ కార్యక్రమం
-
'వాక్ విత్ జగనన్న' పోస్టర్ విడుదల
-
28న జగనన్నతో నడుద్దాం
సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి దాటుతున్న సందర్భంగా తలపెట్టిన ‘జగనన్నతో నడుద్దాం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకొని కోస్తాలో అడుగుపెట్టిన వై.ఎస్.జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో తాము పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారని చెప్పారు. దారిపొడవునా వేలాది మందిని కలుస్తూ వారి కష్టసుఖాలు వింటూ వైఎస్ జగన్ అప్రతిహాతంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ కో ఆర్డినేటర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్ర ఈ నెల 28న నెల్లూరు జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాట బోతుందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టామన్నారు. జిల్లాలో కూడా ఇదేరీతిలో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు, అభిమానులు, సామాన్య ప్రజలతో కలిసి పాదయాత్రలు చేయాలన్నారు. పార్టీ కో ఆర్డినేటర్లతో పాటు అనుబంధ కమిటీలు, ఇతర విభాగాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల నేతలంతా పాదయాత్రలో పాల్గొనేలా చూసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా సమన్వయం చేయాలన్నారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. నెలఖారులోగా కమిటీల నియామకం పూర్తి చేయాలి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో వార్డు, మండల కమిటీల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కో ఆర్డినేటర్లను ఆదేశించారు. వార్డు, మండల కన్వీనర్లతో పాటు అనుబంధ విభాగాలకు కూడా అధ్య క్షులు, ఇతర కార్యవర్గాల నియామకాలను నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాను మూడు పార్లమెంటు జిల్లాలుగా వేరు చేసినందున వాటి పరిధిలో కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలన్నారు. అదే విధంగా ప్రతి బూత్‌కు పదిమంది చొప్పున కమిటీల ఏర్పాటును ఫిబ్రవరి నెలాఖరులోగా నియమించాలని సూచించారు. బూత్ కమిటీల్లో ఖాళీగా ఉన్న నియామకాలను భర్తీ చేయాలన్నారు. సైనికుల్లా పనిచేసే వార్ని గుర్తించి బూత్ కమిటీల్లో వేయాలన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కమిటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఐటీ విభాగం రాష్ట్రకన్వీనర్ చల్లా మధుసూదన రెడ్డి, విశాఖ, అనకాపల్లి, అరుకు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్నాధ్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, అనకాపల్లి పార్లమెంటు కో ఆర్డినేటర్ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పలనాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజు, అక్కరమాని విజయనిర్మల, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, చెట్టి ఫల్గుణ, బొడ్డేడ ప్రసాద్, ఏకేవి జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. పాడేరు నుంచి భారీగా చేరికలు సాక్షి, విశాఖపట్నం :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్ ఉందని.. ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, అరకు అసెంబ్లీ కో ఆర్డినేటర్ చెట్టి పాల్గుణల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సీనియర్ నేతలు మంగళవారం పార్టీలో చేరారు. విశాఖలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు వందమంది చేరగా.. వారందరికీ ఎంపీ విజయసాయిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మహానేత సంక్షేమ ఫలాల ద్వారా లబ్ధి పొందిన గిరిజనులు దివంగత వైఎస్సార్‌ను తమ గుండెల్లో పెట్టుకుని దైవంలా కొలుచుకుంటున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీకి చెందిన ఎంపీటీసీల ఫోరం చింతపల్లి అధ్యక్షుడు ఉల్లి సత్యనారాయణ, సర్పంచ్ల ఫోరం చింతపల్లి మండల అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ, పీసా కమికీ చింతపల్లి మండల అధ్యక్షుడు ఉల్లి నూకరాజు, బీజేపీ చింతపల్లి డివిజన్ నాయకులు వసుపరి ప్రసాద్, బీఎస్పీ డివిజన్ అధ్యక్షుడు సుమర్ల సూరిబాబు, జల్లిబాబు, పీసా కమిటీ సభ్యులు బురిటి ఆదినారాయణ, పొటుకూరి ధారబాబు, అరుకు చిన్నయ్య, ఉల్లి సతీష్, సెగ్గె నూకరాజు, కాంగ్రెస్ యూత్ నాయకులు మాజీ ఎంటీపీసీ సభ్యుడు బురిటి ధనుంజయ, ఉన్నారు. -
29న ‘వాక్ విత్ జగనన్న’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 29 నాటికి 1,000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ఆరోజు ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. 28న ఈ కార్యక్రమం ఉంటుందని అంతకు ముందు ప్రకటించినా 1,000 కిలోమీటర్లు 29 నాటికి పూర్తికా నుండటంతో ఈ మేరకు మార్పు చేశారు. ఆ రోజు అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులతో రెండు కిలోమీటర్ల పాదయాత్రలు చేపట్టనున్నట్లు పార్టీ పేర్కొంది. -
జగనన్నతో నడుద్దాం
కడప కార్పొరేషన్: ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర ఈనెల 28వ తేదికి 1000 కిలోమీటర్ల మైలురాయిని చేరుతున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ పేరుతో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు కె. సురేష్‌బాబు తెలిపారు. సోమవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర వాప్తంగా 700 ప్రదేశాల్లో, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ఈ పాదయాత్ర సాగుతుందని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలుపుతూ పార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించాలని సూచించారు. జిల్లా కేంద్రమైన కడపలో పాత కలెక్టరేట్ వద్దనున్న వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
28న నెల్లూరులో వాక్ విత్ జగన్