
సాక్షి, కడప : ప్రజా సంకల్ప పాదయాత్రను 2017 నవంబరు 6వ తేదీ ఇడుపులపాయ నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంకల్పించారు. జిల్లా ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఇడుపులపాయలో ప్రారంభమై ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సాగుతున్న ప్రతిపక్ష నేత పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటుతోంది. దీంతో పార్టీ అధిష్టానం వాక్ విత్ జగనన్న కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులన్నీ జిల్లాలో నిర్వహణకు సిద్దమయ్యాయి.
నేడు అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సోమవారం వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా నాయకులంతా పాదయాత్రలను చేపట్టనున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందులలోని ఆర్టీసీ బస్టాండు కూడలి నుంచి మెయిన్ బజారు పూలంగళ్ల మీదుగా జూనియర్ కళాశాల సర్కిల్ వరకు పాదయాత్ర చేయనున్నారు. కమలాపురంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటు ఇన్‌ఛార్జి కె.సురేష్‌బాబు, రాయచోటిలో ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి, మైదుకూరులో ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త వెంకట సుబ్బయ్య, జమ్మలమడుగులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు పాదయాత్ర శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
‘వాక్ విత్ జగన్’కు శ్రీకారం
ఒంటిమిట్ట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి కావడంతో ‘‘వాక్ విత్ జగన్’’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. మండల నాయకులు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ చామ సుబ్బారెడ్డి, మండల యూత్ కన్వీనర్ పోలి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చెర్లోపల్లి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోందని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. ముమ్మడి శ్రీధర్ రెడ్డి, తేళ్ల శేషారెడ్డి, నగేష్ రెడ్డి, జేసిబి సుబ్బారెడ్డి, ముమ్మడి నారాయణ రెడ్డి, చింతరాచపల్లి రాజమోహన్, డిప్ సుబ్బారెడ్డి, మాధవరం సర్పంచ్ సుబ్రమణ్యం, సిద్ధవరం గోపి రెడ్డి, గుండ్లు మల్లికార్జున రెడ్డి, రాజంపేట బాస్కర్ రాజు, పోలి మురళి, అచ్చవరం వేణుగోపాల్ రెడ్డి మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment