
తిరుపతిలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమంలో భూమన కరుణాకర్‌రెడ్డి
సాక్షి, తిరుపతి: వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర టీడీపీకి అంతిమయాత్ర కాబోతున్నదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం వేలాది మందితో కలిసి ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ... జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు ప్రారంభం అయ్యాయని ధ్వజమెత్తారు.
చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని వినాయక గుడి నుండి ఓంశక్తి ఆలయం వరకు ఆమె పాదయాత్ర చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, తవణంపల్లిలో డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్యర్యంలో ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.