మేడారం(గోవిందరావుపేట), న్యూస్‌లైన్ :
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర నేపథ్యంలో రూ.1.68 కోట్లతో వివిధ విద్యుత్ పనులు చేపట్టనున్నారు. జాతర సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ సౌకర్యాల విషయమై పరిశీలించేందు కు ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా సోమవారం అధికారులతో కలిసి మేడారం, పరిసర గ్రామాలను సందర్శించారు. ముందు గా నార్లాపూర్ చేరుకుని అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎలుబాక మీదుగా మేడారం ఇంగ్లిష్ మీడి యం పాఠశాల ఎదురుగా ఉన్న స్థలం, స్నాన ఘట్టాల వద్ద, రెడ్డిగూడెం, మేడారంలో ఇంట ర్నల్ రోడ్ల అభివృద్ధి తర్వాత విద్యుత్ లైన్‌ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రూ.1.68 కోట్లతో మేడారంలో విద్యుత్‌కు సంబంధించిన పనులు చేపట్టనున్నామని, ఇందులో రూ.1.12 కోట్లు పనులకు, రూ.56 లక్షలు విద్యుత్ వినియోగం కోసమని వివరించారు. గతంలో 61 ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చగా ప్రస్తుతం 90 ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. కొత్తగా 63 విద్యుత్ స్తంభాలు వేస్తున్నామని, జాతర సమయంలో స్థానిక సబ్‌స్టేషన్‌తోపాటు ప్రత్యేక పీటీఆర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు, లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. కొత్తగా స్నాన ఘట్టాలు నిర్మించే ప్రాంతంలో విద్యుత్ లైన్ వేయాలని మోహన్‌రావు తెలుపగా పనులే ప్రారంభం కాలేదు.. విద్యుత్ లైన్ ఎలా వేస్తారని సీఎండీ ప్రశ్నించగా అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాతే విద్యుత్ పనులను చేపడతామని అన్ని పనులకు అంచనాలు రూపొందించినట్లు ఎస్‌ఈ వివరించారు. మేడారం సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మిశ్రా ట్రాన్స్‌కోకు కొత్తగా మంజూరైన గెస్ట్ హౌస్ నిర్మించే స్థలం గురించి తెలుసుకున్నారు.
మేడారం పరిసరాల్లో ట్రాన్స్ కో అధికారులు ఉండేందుకు శాశ్వత నిర్మాణా లు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాల ని అధికారులను ఆదేశించారు. అంతకు ముం దు సీఎండీ కార్తికేయ మిశ్రా సమ్మక్క, సారల మ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెల చుట్టూ విద్యుత్ సరఫరా, లైట్ల ఏర్పా టు, విద్యుత్ సరఫరా ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో డెరైక్టర్ చంద్రశేఖర్, డీఈ బిక్షపతి, ఏఈ మధుసూదన్ తదితరులు ఉన్నారు.
మేడారంలో రూ.1.68 కోట్లతో విద్యుత్ పనులు
Published Tue, Nov 26 2013 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement
Advertisement