Kartikeya Mishra
-
రేణిగుంటలో సెల్కాన్ తయారీ యూనిట్
అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సెల్కాన్ సీఎండీ వై.గురు మొబైల్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెల్కాన్ మరో ప్లాంటును తిరుపతి సమీపంలోని రేణిగుంట దగ్గర ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సెల్కాన్ సీఎండీ వై.గురు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తొలుత నెలకు 5 లక్షల ఫోన్లను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లాంటులో ట్యాబ్లెట్ పీసీలు కూడా తయారు చేస్తారు. చిత్రంలో గురుతో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఉన్నారు. -
మేడారంలో రూ.1.68 కోట్లతో విద్యుత్ పనులు
మేడారం(గోవిందరావుపేట), న్యూస్‌లైన్ : వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర నేపథ్యంలో రూ.1.68 కోట్లతో వివిధ విద్యుత్ పనులు చేపట్టనున్నారు. జాతర సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ సౌకర్యాల విషయమై పరిశీలించేందు కు ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా సోమవారం అధికారులతో కలిసి మేడారం, పరిసర గ్రామాలను సందర్శించారు. ముందు గా నార్లాపూర్ చేరుకుని అక్కడ చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎలుబాక మీదుగా మేడారం ఇంగ్లిష్ మీడి యం పాఠశాల ఎదురుగా ఉన్న స్థలం, స్నాన ఘట్టాల వద్ద, రెడ్డిగూడెం, మేడారంలో ఇంట ర్నల్ రోడ్ల అభివృద్ధి తర్వాత విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రూ.1.68 కోట్లతో మేడారంలో విద్యుత్‌కు సంబంధించిన పనులు చేపట్టనున్నామని, ఇందులో రూ.1.12 కోట్లు పనులకు, రూ.56 లక్షలు విద్యుత్ వినియోగం కోసమని వివరించారు. గతంలో 61 ట్రాన్స్ఫార్మర్లు అమర్చగా ప్రస్తుతం 90 ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. కొత్తగా 63 విద్యుత్ స్తంభాలు వేస్తున్నామని, జాతర సమయంలో స్థానిక సబ్‌స్టేషన్‌తోపాటు ప్రత్యేక పీటీఆర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో ఆటంకాలు, లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వివరించారు. కొత్తగా స్నాన ఘట్టాలు నిర్మించే ప్రాంతంలో విద్యుత్ లైన్ వేయాలని మోహన్‌రావు తెలుపగా పనులే ప్రారంభం కాలేదు.. విద్యుత్ లైన్ ఎలా వేస్తారని సీఎండీ ప్రశ్నించగా అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాతే విద్యుత్ పనులను చేపడతామని అన్ని పనులకు అంచనాలు రూపొందించినట్లు ఎస్ఈ వివరించారు. మేడారం సబ్‌స్టేషన్‌ను సందర్శించిన మిశ్రా ట్రాన్స్‌కోకు కొత్తగా మంజూరైన గెస్ట్ హౌస్ నిర్మించే స్థలం గురించి తెలుసుకున్నారు. మేడారం పరిసరాల్లో ట్రాన్స్ కో అధికారులు ఉండేందుకు శాశ్వత నిర్మాణా లు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాల ని అధికారులను ఆదేశించారు. అంతకు ముం దు సీఎండీ కార్తికేయ మిశ్రా సమ్మక్క, సారల మ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెల చుట్టూ విద్యుత్ సరఫరా, లైట్ల ఏర్పా టు, విద్యుత్ సరఫరా ఏర్పాట్ల గురించి అధికారులు వివరించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో డెరైక్టర్ చంద్రశేఖర్, డీఈ బిక్షపతి, ఏఈ మధుసూదన్ తదితరులు ఉన్నారు. -
పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించాలి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతి కోసం వినియోగించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తీకేయ మిశ్రా విద్యార్థులకు సూచించారు. అన్నాసాగరంలోని వరదారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించే ‘స్పుత్నిక్-2013’ జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్ గురువారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా మిశ్రా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. నవ సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షిం చా రు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్, మెడికల్ సబ్జెక్టులు ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉంటాయన్నారు. ఇప్పటివరకు 450 గుండె ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ‘గ్రామ ప్రజల గుండె చికిత్సాలయం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి ఫెస్ట్ లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని తమ ఈవెంట్స్‌ను ప్రదర్శించారు.ప్రోగ్రాం కన్వీనర్ ఎన్.సుధాకర్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రమేష్, రాము, శరత్, పాండురంగ, గోవర్ధన్, మధుసూదన్, ఉపేందర్ పాల్గొన్నా రు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఈవెంట్స్‌ను అతిథులు తిలకించారు. -
డీల్..!
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలపై దూకుడు ప్రదర్శిస్తున్న సీఎండీ కార్తికేయ మిశ్రాను సాగనంపేందుకు డిస్కంలోని ఇంజినీర్లు పథకం పన్నారు. ఆయన బదిలీ కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న అవినీతి బాగోతాలు ఎన్పీడీసీఎల్‌ను కుదిపేస్తున్నాయి. ఈ అక్రమాల్లో కంపెనీకి చెందిన పలువురు ఇంజినీర్లతోపాటు ఉన్నతస్థాయి సిబ్బంది వరకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణ చేపట్టగా... నివేదికలు తుది ద శకు చేరుకున్నాయి. పని చేసిన చోటల్లా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువైంది. కంపెనీకి చెం దిన కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు తేటతెల్లమైంది. దీంతో అక్రమార్కులు తమకు తిప్పలు తప్పవనే ఉద్దేశంతో మిశ్రాను బదిలీ చేసే పనిలో ప డ్డారు. ఏకంగా ఓ కేంద్ర మంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎండీని ఇక్క డి నుంచి బదిలీ చేస్తే డబ్బుల సంచులను బహుమానంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే... ఇటీవల వెలుగులోకి వచ్చిన కేబుల్ కుంభకోణం ఎన్పీడీసీఎల్‌ను కుదిపేసింది. దీంతో సీఎండీ కార్తికేయ మిశ్రా విచారణ బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించారు. మీటర్ల కొనుగోలు, అధిక ధరలకు దిగుమతి చేసుకోవడం.. వంటి తదితర అంశాలను పూర్తిస్థాయిలో వెలికి తీసే పనిలో పడ్డారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు బిల్లులను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యూరు. అంతేకాదు... కింది స్థాయిలో విధులను నిర్లక్ష్యం చేసిన వారిపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన డీఈల బదిలీల్లో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేసినట్లు సంస్థ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో సీఎండీ కార్తికేయ మిశ్రా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుమిత్ర కార్యక్రమంలో కూడా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు మైనర్ మరమ్మతులు వచ్చినా... వాటిని మేజర్‌గా చూపించి కాంట్రాక్టర్లతో కలిసి బిల్లులు విడుదల చేశారని సీఎండీకి ఫిర్యాదులు సైతం అందాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మిశ్రా కఠిన నిర్ణయూలకు వెనుకాడడం లేదు. అన్నింటిపైనా క్రమక్రమంగా విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. రైతుమిత్ర, బిల్ కలెక్షన్లు, విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇంజినీర్లకు మింగుడు పడడం లేదు. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత ఎన్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి సీఎండీగా రావడంతో సీనియర్లంతా అయిష్టంగానే ఉన్నారు. ఐఏఎస్‌లు లేకపోవడం, తమతో పనిచేసిన ఇంజినీర్లు సీఎండీగా ఉండడంతో వారిదే ఇష్టారాజ్యం. తాము అడిందే ఆట.. పాడిందే పాటగా పలు యూనియన్లు చక్రం తిప్పాయి. ఇప్పుడా పరిస్థితి లేదు... దీంతో ఆయనను ఈపీడీసీఎల్‌కు సాగనంపేందుకు ఓ ఇంజినీరింగ్ అసోసియేషన్ నేతలు రాష్ర్టస్థాయిలో రంగంలోకి దిగారు. ఈ విషయం సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి సైతం వెళ్లినట్లు తెలిసింది.