
రేణిగుంటలో సెల్‌కాన్ తయారీ యూనిట్
అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబుతో సెల్‌కాన్ సీఎండీ వై.గురు
మొబైల్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెల్‌కాన్ మరో ప్లాంటును తిరుపతి సమీపంలోని రేణిగుంట దగ్గర ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సెల్‌కాన్ సీఎండీ వై.గురు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తొలుత నెలకు 5 లక్షల ఫోన్లను తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ ప్లాంటులో ట్యాబ్లెట్ పీసీలు కూడా తయారు చేస్తారు. చిత్రంలో గురుతో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా ఉన్నారు.