నగరం: వేగంగా వెళ్తున్నలారీ, బైక్ను ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. రేపల్లేకు చెందిన శేషు(45) అనే వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిని రేపల్లేలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శేషు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.