విశాఖపట్నం జిల్లాలోని ఎస్. రాయవరం మండలం బంగారుపాలెంలోని ఆదివారం ఉదయం బోటు కోసం సముద్రంలోకి వెళ్లిన 10 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. దాంతో ఆ మత్స్యకారులు కుటుంబాలు వారు ఆచూకీ తెలియకు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అయితే భారీ వర్షాలతో మేఘద్రిపేట రిజర్వాయర్లో నీటి మట్టం ఆదివారం మధ్యాహ్ననానికి గరిష్ట స్థాయికి మించి ప్రమాద స్థాయికి చేరుకుంది.
దాంతో షీలానగర్, కాజు జగ్గారాజు కాలనీ, గొల్ల జగ్గరాజుపేట కాలనీ, పెద్ద గంట్యాడ, హెచ్ పీ కాలనీలు పూర్తిగా జలమయమైనాయి. దీంతో మేఘద్రి రిజర్వాయర్లోని నాలుగు గేట్లను అధికారులు నాలుగు గేట్లను ఎత్తివేశారు. రిజర్వాయర్లోని నీటికి దిగువ ప్రాంతాలకు వదిలారు. అలాగే జిల్లాలోని వాగులు, వంకలకు వరద పోటెత్తింది. దాంతో కోట్లఊరుట్ల మండలంలో వరద తాకిడికి జల్లురి వంతెన కూలి పోయింది. దాంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించాయి.