విజయవాడ: పారా మెడికల్ (బీఎస్సీ నర్సింగ్-నాలుగేళ్లు), బీపీటీ (ఫిజియోథెరపీ), బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలోని ఐదు ఆన్‌లైన్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
విజయవాడలోని హెల్త్ వర్సిటీ, ఎస్‌వీ వర్సిటీ, ఆంధ్రా వర్సిటీ, జేఎన్‌టీయూ(కూకట్‌పల్లి), కాకతీయ వర్సిటీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. 14, 15 తేదీల్లో బీఎస్సీ నర్సింగ్, 16న బీపీటీ, 17న బీఎస్సీ (ఎంఎల్‌టీ) కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది.
మెరిట్ లిస్టులను యూనివర్సిటీ వెబ్‌సైట్ (హెచ్‌టీటీపీ://ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఏపీ.ఎన్‌ఐసీ.ఇన్)లో పొందుపరిచారు. కౌన్సెలింగ్ తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెరిట్ ఆర్డర్ కాపీ, కౌన్సెలింగ్ ఫీజుతో ఈ ఐదు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రాల్లో ఎక్కడైనా హాజరుకావచ్చని రిజిస్ట్రార్ తెలిపారు. మరిన్ని వివరాలు నోటిఫికేషన్‌లో పొందవచ్చు.
14 నుంచి పారా మెడికల్ కౌన్సెలింగ్
Published Sun, Nov 9 2014 1:28 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement