నల్లజర్ల: ఎమ్మార్పీఎస్‌లోని రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సోమవారం నల్లజర్లలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యక్రమాన్ని అడ్డుకుంటామంటూ మందకృష్ణ వ్యతిరేక వర్గం ప్రకటించింది. దీంతో ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు.