శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 16 గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. రూ. 300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2గంటలకు నిలిపివేశారు. కాలిబాట భక్తుల క్యూ కిలోమీటరు వరకు విస్తరించింది. వీరికి 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. - సాక్షి , తిరుమల