సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువజామున 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 46,555 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. వీరికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో రూ. 300 టికెట్ల దర్శనాన్ని మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివేశారు. కాలిబాట కాలిబాట భక్తులకు దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. కాగా, భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు.