
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ!
తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో నిండారు. అర కిలోమీటర్ మేర క్యూలైన్ లో భక్తులు దర్శనానికి వేచివున్నారు.
సర్వదర్శనానికి 21 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 10 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహకులు తెలిపారు. కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది.