తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ కల్యాణ వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు అర కిలోమీటర్ మేర నిలుచుని ఉన్నారు. అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వ దర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా, కాలి నడక భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానినికి 8 గంటల సమయం పడుతుంది.శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకూ స్వామి వారిని 36,700 మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెల్లడించింది. ఇంకా దర్శనం కోసం 80 వేల మంది భక్తులు వేచి ఉన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో గురువారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేశారు. నిన్నటి కంటే ఈ రోజు శ్రీవారిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు.