విజయవాడ, న్యూస్‌లైన్: సంచలనం సృష్టించిన పీజీ వైద్య ప్రవేశపరీక్ష స్కాం కేసులో 16 మంది నిందితులకు శుక్రవారం 14వ అదనపు జిల్లా జడ్జి సి.బి. సత్యనారాయణ బెయిల్ మంజూరు చేశారు. నిందితుల తరఫున వారి న్యాయవాదులు దాఖలుచేసిన పిటిషన్లపై వాదోపవాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పొందిన నిందితులు వీరే.. చారుపల్లి కీర్తి, ఎస్.జి. రాజగోపాల్‌రెడ్డి, కె.వి.ఎన్.గౌతమ్‌వర్మ, ఎ.ఫణిశ్రీ, కె.కిష్టప్ప, లంకా ప్రత్యూష, షకీల్ అహ్మద్, కె.హారిక, వి.సురేష్‌బాబు, ఐ.భరత్ చంద్ర, అమీర్ అహ్మద్, ప్రవీణ్ వీరభద్రప్ప, ఎ.శివప్రసాదు, రాధారెడ్డి, కె.పాల్సన్, శ్రీనివాస్‌చక్రవర్తి.