విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండాంలో అతి పురాతనమైన18 పంచలోహ విగ్రహాలను గ్రామస్తులు కనుగొన్నారు. శనివారం గ్రామంలోని చెరువులో పుడికతీత పనులను గ్రామస్తులు చేపట్టారు. అందులోభాగంగా చెరువుల పంచలోహ విగ్రహాలను కనుగొన్నారు. అ క్రమంలో 18 విగ్రహాలను చెరువులో నుంచి వెలికి తీశారు. పుడిక తీత పనులు కొనసాగుతున్నాయి. విగ్రహాలు దొరికి విషయాన్ని గ్రామస్తులు గ్రామ సర్పంచికి వెల్లడించారు. దాంతో ఆయన జిల్లా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు గండిగుండాం చేరుకుని ఆ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.