ఎయిర్ పోర్టులో 2కేజీల బంగారం పట్టివేత
Published Thu, Dec 8 2016 9:09 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తి నుంచి అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి దాదాపు 2 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement