విశాఖ జిల్లాలో విషాదం
Published Sat, Jul 15 2017 3:36 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
పాయకరావుపేట: విశాఖ జిల్లాలో విషాద సంఘటన వెలుగుచూసింది. నిర్మాణంలో ఉన్న నూతన భవనంలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందారు. ఈ సంఘటన పాయకరావుపేట మండలం పి.ఎల్ పురం గ్రామంలో శనివారం వెలుగుచూసింది.
గ్రామంలోని ఓ నూతన భవనంలో కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో.. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వేలంపాటవాసులుగా గుర్తించారు.
Advertisement
Advertisement