సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 2 లక్షల మందికి పైగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం నాటికి 2,10,196 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 9284 టెస్టులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పది లక్షల జనాభాకు 3,768 వైద్య పరీక్షలు నిర్వహించి దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. (చదవండి : ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు)
ఇక రికవరీ రేటు కూడా రాష్ట్రంలో క్రమక్రమంగా పెరుగుతోంది. దేశంలో రికవరీ రేటు 32.90 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 53.44 శాతంగా నమోదైంది. మొత్తంగా ఇప్పటి వరకు 1142 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో 48 కరోనా కేసులు నమోదు కాగా, 86 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక మరణాల రేటు కూడా రాష్ట్రంలో తక్కువగా ఉంది. దేశంలో మరణాల రేటు 3.25శాతంగా ఉంటే రాష్ట్రంలో 2.20శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment