చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం బసవరాజ కండ్రిగలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొన్నాయి.
చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం బసవరాజ కండ్రిగలో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.