జ్ఞాపకాలు.. మైలురాళ్లు | 2013 roundup of west godavari district | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాలు.. మైలురాళ్లు

Published Tue, Dec 31 2013 4:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

2013 roundup of west godavari district

జిల్లా చరిత్రలో 2013 ఉద్యమనామ సంవత్సరంగా నమోదైంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. మరోవైపు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడేది వైసీపీయేనని ఆ పార్టీ శ్రేణులు చాటిచెప్పాయి.  ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పైలాన్‌ను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మన జిల్లాలోనే ఆవిష్కరించారు. ప్రపంచ చరిత్రలో మైలురాయిగా నిలిచిన షర్మిల మరోప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో రెండు వేల కిలోమీటర్లు దాటింది. భారీ వర్షాలు, తుపాన్లు రైతులను నిండా ముంచాయి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నదాతలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
 జనవరి
  ఉద్యమ నామ సంవత్సరం
 రాష్ట్ర విభజన ఖాయమన్న సంకేతాలతో జనవరి 22న ప్రజా సంఘాలు జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి.
  ‘ఇస్రో’లో మనోడు
 ఇస్రో డెరైక్టర్‌గా ఎంవైఎస్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టడంతో ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో పండగ వాతారణం నెల కొంది.   
  ‘మీ సేవ’కు అవార్డు
 మీ సేవలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లాకు రాష్ట్ర ప్ర భుత్వం అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ జి.వాణీమోహన్ అందుకున్నారు.
 
 ఫిబ్రవరి
 
  క్షీరపురిలో కళాభినేత్రి
 పాలకొల్లులో 6వ అఖిల భారతస్థారుు నాటికల పోటీలు ప్రారంభమయ్యూరుు. సినీ నటి వాణిశ్రీని మంత్రి టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సత్కరించారు.
  రాజకీయాల్లో ‘రవి కిరణ’ం
 సహకార ఎన్నికలు జరిగాయి. డీసీసీబీ చైర్మన్‌గా ముత్యాల రత్నం, డీసీఎంఎస్ అధ్యక్షునిగా భూపతి రాజు రవివర్మ ఎన్నికయ్యారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాననమండలి సభ్యునిగా కలిదిండి రవికిరణ్‌వర్మ విజ యం సాధించారు.
 
 మార్చి
 
  గవర్నర్ వచ్చారు.. లేసుల్ని చూశారు
 రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సీతారామపురంలో లేసు పార్కును సతీసమేతంగా సందర్శించారు. లేసు మహిళల పనితీరును మెచ్చుకున్నారు.
  షిండే వచ్చె..
 కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కాళ్ల మండలం కలవపూడి, మోడి గ్రామాల్లో పర్యటించారు. మొగదిండి డ్రెరుున్‌పై  నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేశారు.
   పన్నెండు రోజుల పర్యటన
 టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’ పాదయూత్ర ఆకివీడు మండలం దుంపగడప వద్ద జిల్లాలో ప్రవేశించింది. 12 రోజుల పాటు యాత్ర సాగింది.
 
 ఏప్రిల్
  సబ్‌ప్లాన్ పైలాన్ ఆవిష్కరణ
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించారు. జంగారెడ్డిగూడెంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.  మే 5న సీఎం మరోసారి జిల్లాకు వచ్చారు.
  డబ్లింగ్ పనులకు శంకుస్థాపన
 విజయవాడ-గుడివాడ, భీమవరం-నిడదవోలు రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ లో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
 
 మే
  మహా యాత్ర.. మరో చరిత్ర
 షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చింతలపూడి మండ లం గురుభట్లగూడెం వద్ద జిల్లాలో ప్రవేశించింది.  17న  కామవరపుకోట మండలం రావికంపాడులో పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా 28న పాలకొల్లులో షర్మిల రిలే దీక్ష కూడా చేశారు.
  బుద్ధ పార్కు ప్రారంభం
 ఏలూరులో బుద్ధపార్కును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రారంభించారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో జిల్లా ప్రజలు నిరు త్సాహానికి గురయ్యారు.
 
 జూన్
  ఎమ్మెల్యేలపై వేటు
 ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన అభియోగంపై గోపాలపురం ఎ మ్మెల్యే తానేటి వనిత, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌కుమార్‌పై అనర్హత వేటు వేశారు. వారు అంతకుమందే తమ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు.
 
  పీసీసీలో జిల్లాకు సముచిత స్థానం
 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లాకు సముచిత స్థానం ఇచ్చారు. మొత్తం కమిటీలో 44 మందికి చోటు కల్పించగా జిల్లాకు చెందిన నలుగురికి పార్టీ పదవులు ప్రకటించారు. ఎంపీ కావూరి సాంబశివరావు, పీసీసీ మాజీ చైర్మన్ జీఎస్ రావు, కంతేటి సత్యనారాయణ, ఎమ్మెల్యే కారుమూరికి స్థానం దక్కింది.
 
 జూలై
  వాణీ వెళ్లె.. జైన్ వచ్చె
 జిల్లా కలెక్టర్‌గా సిద్ధార్థజైన్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ జి.వాణీమోహన్ కార్యదర్శిగా పదోన్నతి పొంది బదిలీ కావటంతో ఆ స్థానంలో సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వం నియమించింది.
  బాలరాజు రాజీనామా
 రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైసీపీ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో జిల్లా భగ్గుమంది. ఊరూరా ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు చేపట్టారు.
 
 ఆగస్టు
  ఎన్జీవోల ‘సమ్మె’ట
 ఈ నెలంతా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంతో జిల్లా హోరెత్తింది. ఎన్జీవోలు సమ్మె చేపట్టడంతో ఉద్యమానికి  ఊపు వచ్చింది. ప్రతి పట్టణం, మండల కేంద్రంలోను ఎన్జీవోలు రిలే దీక్షా శిబిరాలు  ఏర్పాటు   చేశారు.  ప్రతిరోజు  వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
  ఇసుక ఇబ్బందులు
 ఇసుక ర్యాంపులు లీజు పూర్తికావటంలో 12 ర్యాంపులు మూత ప డ్డాయి. ఇది భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది.
  స్వర్ణమయికి శ్రీకారం
 చినవెంకన్న ఆలయ విమాన గోపురానికి బంగారు తొడుగు చే యించేందుకు దేవస్థానం స్వర్ణమయి కార్యక్రమాన్ని ప్రకటించింది.    
 
 సెప్టెంబర్
  జగన్‌కు బెయిల్.. జిల్లాలో సంబరాలు
 వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావడంతో జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పండగ చేసుకున్నాయి. ప్రజలు సంబరాల్లో మునిగితేలారు.
  నవరత్నాలకు పురస్కారాలు
 జిల్లా నుంచి ఈ ఏడాది తొమ్మిది మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు హైదరాబాదులో వారు పురస్కారాలు అందుకున్నారు.
  బ్యాడ్మింటన్ హోరాహోరీ
 తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో రాష్ట్రస్థాయి అండర్-19 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా జరిగాయి.
 
 అక్టోబర్
 
  విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. కారు చీకట్లు
 సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఊరూవాడా చీకట్లు అలముకున్నాయి.
  ఆలకిస్తూ.. అభయమిస్తూ..
 జిల్లాలో వరద బాధితులను 28న వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, 30న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పరామర్శించారు.  
 
 నవంబర్
  హెలెన్ తుపాను బీభత్సం
 జిల్లాలో  హెలెన్ తుపాను బీభత్సం సృష్టించింది. 120-130 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తుపాను తాకిడికి రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, 223 ఇళ్లు ధ్వంసమయ్యాయి.  
  జగన్ పరామర్శ
 తుపాను బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నేనున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు.
  చంద్రబాబు పర్యటన
 హెలెన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటించారు.
 
 డిసెంబర్
  అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు
 భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో ఆంధ్రా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ వర్సిటీ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో 35 కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అక్నూ ఉ మెన్ చాంపియన్‌షిప్‌ను ఏలూరు సెయింట్ థెరిస్సా మహిళా కళాశాల కైవసం చేసుకొంది.
  బాలుర బేస్‌బాల్ విజేత ‘పశ్చిమ’
 ఉంగుటూరు మండలం నారాయణపురం వివేకానంద జెడ్పీ హైస్కూల్‌లో 59వ అండర్-14, 17 బాలబాలికల రాష్ట్రస్థాయి త్రోబాల్, బేస్‌బాల్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో బేస్‌బాల్ విజేతగా జిల్లా బాలుర జట్టు నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement