2014 మంది రైతుల ఆత్మహత్య!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది 2014 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదికను ఉటంకిస్తూ కేంద్రం లోక్‌సభకు తెలిపింది. 2012లో ఈ సంఖ్య 2,572గా ఉన్నట్లు పేర్కొంది. మొత్తంమీద 2012తో పోలిస్తే 2013లో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కాస్త తగ్గాయని చెప్పింది.
2012లో 13,754 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడగా, గత ఏడాది 11,772 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యవసాయశాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.